హాజరు కానున్న పది జాతీయ పార్టీల నేతలు
దేశవ్యాప్త ఉద్యమానికి తొలి అడుగు
రైతు సమస్యలపై 'గుంటూరు డిక్లరేషన్'
దేశవ్యాప్త ఉద్యమానికి తొలి అడుగు
రైతు సమస్యలపై 'గుంటూరు డిక్లరేషన్'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే లక్ష్యంతో టీడీపీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక రైతు సదస్సు ‘రైతుకోసం’ సభకు గుంటూరు బ్రహ్మానంరెడ్డి స్టేడియం సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నానికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సదస్సు నిర్వహణ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ర్ట నాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు గత రెండు రోజులుగా తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, సుజనాచౌదరి, నందమూరి హరికృష్ణ, ఎంపిలు వేణుగోపాలరెడ్డి, వేమ్ నరేంద్రరెడ్డి, యర్రన్నాయుడు, రేవంత్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులంతా గుంటూరులోనే మకాం పెట్టారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా రైతులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముందని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు.
ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము పరిశీలిస్తున్నట్లుగా రాష్ట్ర నేతలు చెబుతున్నారు. గుంటూరు సహా ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, నల్గొండ తదితర జిల్లాల నుండి కూడా రైతులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో వాహనాల పార్కింగ్‌కు గుంటూరులోని అతిపెద్ద మైదానాలను, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి సిద్ధం చేస్తున్నారు. సదస్సుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు వామపక్ష నేతలు, 16 జాతీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు.
రెండేళ్ళ క్రితం జిల్లాలోనే యువగర్జన సదస్సును తాము విజయవంతంగా నిర్వహించామని, ఆస్ఫూర్తితోనే ఈ సదస్సును కూడా విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పుల్లారావు తెలియజేశారు. అప్పట్లో తాము చేసిన ఏర్పాట్ల వల్ల లక్షలాది మంది కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువగర్జన సదస్సులో పాల్గొని వెళ్ళారని, అదే స్ఫూర్తితో ప్రస్తుతం కూడా కార్యకర్తలు, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. బుధవారం సదస్సు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నాయకులు రేవంత్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, యనమల రామకృష్ణుడు, సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య తదితరులు పర్యవేక్షించారు.
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతుకోసం' బహిరంగ సభకు గుంటూరు ముస్తాబైంది. దేశవ్యాప్తంగా సుమారు పది పార్టీల నేతలు ఈ సభలో పాల్గొని వ్యవసాయదారుల సమస్యలపై జాతీయ స్థాయి పోరాటానికి పిలుపునివ్వనున్నారు. తమ పోరాటానికి విధానపరమైన ప్రాతిపదికను వివరిస్తూ 'గుంటూరు డిక్లరేషన్' పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేయనున్నారు.
డిక్లరేషన్‌లో పేర్కొన్న డిమాండ్ల సాధనకు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ రీత్యా జన సమీకరణపరంగా కూడా ఈ సభను భారీగా నిర్వహించడం ద్వారా తమ పోరాటానికి శుభారంభాన్ని ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు సభ తన డిక్లరేషన్‌లో డిమాండ్ చేయనుంది.
టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, జనతాదళ్ (యు),జనతాదళ్ (ఎస్), ఆరెల్డీ, ఐఎన్ఎల్‌డీ, ఏజీపీ, ఎండీఎంకే, అన్నా డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చాలకు చెందిన నేతలు పాల్గొంటున్నారు. వీరిలో మాజీ ప్రధాని దేవెగౌడ్, మాజీ ముఖ్యమంత్రులు ఓం ప్రకాష్ చౌతాలా, బాబూలాల్ మరాండీ, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్, వామపక్ష పార్టీల జాతీయ నేతలు ప్రకాశ్ కరత్, ఏ రాజా, అభినవ్ రాయ్, ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తదితరులు ఉన్నారు.
ఢిల్లీ, బెంగుళూరుల నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో ఈ నేతలు గురువారం ఉదయం నేరుగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు అక్కడకు వెళ్తారు. విమానాశ్రయంలోనే వీరంతా కొంతసేపు సమావేశమై గుంటూరు డిక్లరేషన్ ముసాయిదా పరిశీలించి దానికి తుది రూపు ఇస్తారు. అక్కడ నుంచి వీరంతా హెలికాప్టర్లో గుంటూరు సభకు చేరుకొంటారు.
హెలికాప్టర్ రెండు మూడు విడతల్లో వీరిని గుంటూరు చేరుస్తుంది. సభను మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభించి సాయంత్రం 5గంటలకు ముగించాలన్నది నిర్వాహకుల ప్రయత్నం. ఇటీవలి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ చంద్రబాబు 8రోజులపాటు నిరవధిక దీక్ష చేసిన సంగతి తెలిసిందే.
ఆ దీక్షకు జాతీయ పార్టీల నేతల నుంచి మంచి సంఘీభావం వ్యక్తమైంది. దానిని ఉద్యమ రూపంలోకి మల్చడంతో పాటు రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడానికి ఈ సభను జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది.
భారీగా ఏర్పాట్లు
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మూడు రోజులుగా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ, యనమల రామకృష్ణుడు, ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావులు పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
లక్ష మంది లక్ష్యంగా తొలుత ఏర్పాట్లు ప్రారంభించిన పార్టీ నేతలు బుధవారం నాటికి తమ అంచనాలు మించి జనం హాజరవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ వెలుపల భారీ ్రస్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, చంద్రబాబు పరామర్శలు, బాబు నిరవధిక దీక్ష, పోలీసుల అరెస్టులు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలకు సంబంధించిన అనేక ఫొటోలను ఫ్లెక్సీల రూపంలో గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేశారు.
వేదిక పక్కన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా.. పచ్చని జెండాలు, ఫ్లెక్సీలతో గుంటూరు పసుపు మయమైంది. చాలా కాలం తరువాత నగరంలో భారీ సదస్సు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.
లాభసాటిగా వ్యవసాయం
డిక్లరేషన్‌లో డిమాండ్ ఇదే
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు సభ తన డిక్లరేషన్‌లో డిమాండ్ చేయనుంది. పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, మద్దతు ధరకు గ్యారంటీ లేకపోవడం, ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం, సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం గాలివాటంగా మారిందని, పెట్టిన పెట్టుబడి తిరిగిరాని సందర్భాల్లో రైతులు మరో దారిలేక ఆత్మహత్యలను అనుసరించాల్సి వస్తోందని ఈ డిక్లరేషన్ అభిప్రాయపడుతోంది.
స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా పెట్టిన పెట్టుబడి ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరగా నిర్ణయించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులకు వీలైనంత ఉదారంగా సహాయం అందించడానికి వీలుగా కేంద్రం నియమించిన వర్కింగ్ గ్రూపు సిఫారసులను తక్షణం అమలు చేయాలని, పంట వేసిన ప్రతి రైతుకూ బీమా సౌకర్యం కల్పించాలని, కౌలు రైతులతో సహా అందరికీ తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చూడాలని ఈ డిక్లరేషన్ ద్వారా డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్ల సాధనకు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది.

No comments:
Post a Comment