తన కఠోర దీక్షతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రైతుల కోసం పోరాడే నేతగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వచ్చిన కీర్తిని సుస్థిరం చేసుకునేందుకు రైతుబాట పట్టనున్నారు. ఈనెల 30న గుంటూరులో జరపతలపెట్టిన ‘రైతుకోసం’ భారీ బహిరం గసభను విజయవంతం చేయడం ద్వారా వ్యక్తిగతంగా తన పై, సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీపై రైతు ముద్ర వేసేలా కార్యాచరణ ప్రారంభించారు. గతంలో తనపై కాంగ్రెస్ పార్టీ వేసిన రైతు వ్యతిరేక ముద్రను కఠోర దీక్ష ద్వారా, మొండితనంతో తొలగించుకున్న చంద్రబాబు, ఆ ఉత్సా హంతో రైతులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించారు.
అందులో భాగంగా గుంటూరులో జరిగే ‘రైతు కోసం’ సభ నుంచి బాబు తన రైతు బాటను ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత ఉత్తరాంధ్ర నుంచి రైతుయాత్రలు ఉంటాయని తెలుస్తోంది. గతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మీకోసం’ యాత్ర ద్వారా కొత్త ఇమేజ్‌ను పొందిన బాబు, ఇప్పుడు రైతు కోసం యాత్రల ద్వారా రైతన్నకు చేరువకానున్నారు. తన దీక్షా సమయంలో రైతుల నుంచి వచ్చిన స్పందన, ఆ సమయంలో జిల్లాల్లో పార్టీ నేతల కార్యక్రమాల తీరు, కార్యకర్తలు-రైతు సమీకరణలో నేతల పాత్ర వంటి అంశాలను బేరీజు వేసుకుంటున్న బాబు, ఆ మేరకు పార్టీని ఏవిధంగా రైతుల వద్దకు తీసు కువెళ్లాలన్న అంశంపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒక రకంగా దీక్ష వల్ల పార్టీని తిరిగి ఏవిధంగా పునర్ని ర్మాణం చేసుకోవాలో తెలుసుకునే అవకాశం కలిగిందని బాబు భావిస్తున్నారు. ఆ సమయంలో చిత్తశుద్ధితో పని చేసింది ఎవరు? మొక్కుబడిగా వ్యవహ రించింది ఎవరన్న అంశాలను పరిశీలిస్తున్న బాబు, ఆ మేరకు పార్టీని ఆయా ప్రాంతాల్లో పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు సమా చారం. బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వంటి చోట నాయకత్వాన్ని మార్చి, యువనా కత్వానికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.
తన దీక్ష ద్వారా గతంలో తనపై కాంగ్రెస్ పార్టీ వేసిన రైతు వ్యతిరేక ముద్రను తొలగించుకోగలిగినా, పూర్తి స్థాయిలో రైతులు టీడీపీ వైపు ఇంకా ఆ ర్షితులు కావడం లేదు. ఈ వాస్తవాన్ని విషయాన్ని గ్రహించిన బాబు, ఇకపై వారికి దగ్గరయ్యే కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఇకపై ఎక్కువ సమయం మండల కేంద్రాల్లోనే ఉండేలా కార్య్ర మాలు రూపొందించేందుకు పార్టీ నాయకులు కార్యాచ రణలో నిమగ్నమయ్యారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదని, కాంగ్రెస్ నాయ కులు పదవుల కోసం తిరుగుతున్నారన్న భావన బలపడి నందున, అలాంటి వ్యతిరేకత ఇంకా పెరిగేంత వరకూ పట్టణప్రాంతాలపై దృష్టి తగ్గించి, గ్రామాలపైనే ఎక్కువ దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఏ రాజకీయ పార్టీలకూ చెందని తటస్థ రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఇటీవలి తుపాన్ల సమయంలో ప్రభుత్వ మొక్కుబడి స్పందన తటస్థ రైతును ఆగ్రహానికి, అసంతృప్తికి గురిచేసింది. తమకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని, అధికార పార్టీ ఎమ్మె ల్యేలు కూడా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి బలంగా నాటుకుపోయింది. బాబు దీక్ష సమయంలో కూడా తటస్థ రైతులు తమంతట హాజరయ్యారు. బాబు తమ కోసం దీక్ష చేస్తున్నారని నమ్మిన రైతులు సమీపంలోని దీక్షా శిబిరాలకు హాజరయ్యారు.
నిమ్స్‌లో రెండో రోజు తర్వాత శిబిరాలకు అంతంత మాత్రంగా హాజరయిన తటస్థ రైతులు, ఆ తర్వాత బాబు దీక్షలో చిత్తశుద్ధి ఉందని తెలుసుకున్న తర్వాతే ఎక్కువమంది హాజరవడం ప్రస్తావనార్హం. అయితే వారి శాతం తక్కువయినప్పటికీ, వారిని మండల స్థాయిలో సమన్వయం చేసే నాయకులు దానిపై శ్రద్ధ చూపి ఉంటే వారి శాతం ఇంకా ఎక్కువగా ఉండేది. దానిని గమనించిన టీడీపీ నాయకత్వం తటస్థ రైతుకు చేరవయ్యే కార్యక్రమా లను మండల, గ్రామ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో బాబు ‘రైతుకోసం’ యాత్రను మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.
గుంటూరు సభ తర్వాత బాబు గ్రామబాటలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబు యాత్రలో పట్టణాలు కాకుండా పర్యటించే ప్రతీ మండలంలో ఒక సభ నిర్వహించాలని భావిస్తున్నారు. అంతకంటే ముందు.. మండల పార్టీని పటిష్ఠం చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులను వీలయినంత ఎక్కువగా గ్రామాల్లోనే ఉండేలా చూడనున్నారు. ఇకపై ఎవరినీ హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఇవ్వనున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి, సాధారణ శ్రేణి కార్యకర్తలకు నేతలను అందుబాటులో ఉంచనున్నారు. అగ్రనేతలు అందుబాటులో ఉంటే కిందిస్థాయి నేతల్లో ఉత్సాహం, ఆత్మస్థైర్యం వస్తుందన్న విషయాన్ని నాయకత్వం గ్రహించింది.
No comments:
Post a Comment