చిక్తిసకు ససేమిరా.. కుటుంబ సభ్యులు కోరినా నో...
ఐసీయూలో చేరేందుకూ నిరాకరణ
ప్రమాదం పొంచి ఉందన్న డాక్టర్లు
దీక్షపై దిగిరాని ప్రభుత్వం
విరమిస్తేనే చర్చలని మెలిక
సీఎంను అడ్డుకోబోయిన టీడీపీ
మరో దారిలో వెళ్లిపోయిన కిరణ్
క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రితో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
వాడివేడిగా తీవ్ర వాగ్యుద్ధం
గురువారం నాడు అఖిలపక్ష భేటీకి సీఎం హామీ
రాష్ట్ర వ్యాప్తంగా 'కలెక్టరేట్ల ముట్టడి'
ప్రధానిని కలిసిన మిత్రపక్షాల నేతలు
రెండు రోజుల్లో చెబుతామన్న సీఎం
గురువారం నాడు రైల్, రాస్తా రోకోలు

చంద్రబాబు పట్టు వీడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెట్టు దిగడంలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకూ దీక్ష విరమించేది లేదని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. నష్టపోయిన రైతులకు ఇప్పటికే మంచి ప్యాకేజీ ఇచ్చామని, కొత్తగా ఇవ్వగలిగేది ఏమీ లేదని ప్రభుత్వం అంతే గట్టిగా చెబుతోంది. సర్కారు స్పందిస్తేనే దీక్ష విరమిస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తుండగా... దీక్ష విరమించిన తర్వాతే ఏదైనా ఉంటే చర్చిస్తామని సర్కారు వాదిస్తోంది.
ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు కేంద్రం స్థాయిలో విపక్షాల విన్నపాలకు స్పందన కరువవుతోంది. టీడీపీ, లెఫ్ట్ ఇతర విపక్షాల అగ్రనేతలు ఢిల్లీలో ప్రధానిని కలిసి పరిస్థితి వివరించారు. రైతులకు మరింత సహాయం ప్రకటించాలని, బాబు దీక్షను విరమింప చేయాలని కోరారు. అయితే... ఒకటి రెండు రోజుల్లో కేంద్ర బృందం నివేదిక రాగానే మరింత సహాయం ప్రకటించడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. దీంతో... చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పీటముడిలా బిగుసుకుంటోంది.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బుధవారంతో ఆరో రోజు పూర్తయింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు, పార్టీ ముఖ్యనేతలు, చివరికి కుటుంబ సభ్యులు కోరినా... ఆయన చికిత్సకు ససేమిరా అన్నారు. తన భర్త ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, అయినా చికిత్సకు నిరాకరిస్తున్నారని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాపోయారు.
నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న చంద్రబాబును టీడీపీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు కలిశారు. రైతుల సమస్యలపై వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిద్దామని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి దీక్ష విరమణ గురించి ఆలోచించాలని వారు కోరారు. ఈ విజ్ఞప్తిని చంద్రబాబు తోసిపుచ్చారు. "నా ఆరోగ్యంకన్నా రైతుల సమస్యలకు పరిష్కారం లభించడమే నాకు ముఖ్యం. గత కొన్ని రోజులుగా రైతుల మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్ప నేను దీక్ష విరమించేది లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం!'' అన్నారు.
వైద్యులు చెప్పినా...
చంద్రబాబు శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల్లో బాగా హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నందున మూత్రపిండాలు, గుండెపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స చేయించుకుని, తమతో సహకరించాలని బుధవారం ఉదయం నుంచి పదే పదే అభ్యర్థించారు. అయినా... బాబు ససేమిరా అన్నారు. దీంతో వైద్యులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌కు పరిస్థితి వివరించారు. వారు చంద్రబాబును కలిసి చికిత్సకు అంగీకరించాల్సిందిగా కోరారు.
అయినా... ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిమ్స్ వైద్యులు టీడీపీ ముఖ్య నేతలను సంప్రదించారు. 'పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే చికిత్సకు ఒప్పించండి' అని కోరారు. బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు మరోసారి చంద్రబాబును కలిసి దీక్ష విరమించాలని కోరారు. అప్పటికీ చంద్రబాబు పట్టు వీడలేదు. కనీసం ఐసీయూలో చేర్చేందుకైనా అంగీకరించాలని వైద్యులు కోరినా.. ఆయన ససేమిరా అన్నారు. దీంతో బీపీ, కార్డియో యంత్రాలను ఆయన గదికే తెప్పించారు. వీటితో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నివేదికల విశ్లేషణకు ప్రత్యేకంగా ఓ డాక్టరును ఏర్పాటు చేశారు.
బుధవారం రాత్రి చంద్రబాబు పరిస్థితి బాగా దిగజారింది. ఓపిక లేకపోవడంతో మాట్లాడడం కూడా తగ్గించారు. ఒకటి రెండు మాటలు మాట్లాడినా... అవెక్కడో నూతిలోంచి వచ్చినట్లున్నాయి. బుధవారం ఆయనను చూసేందుకు మీడియా ప్రతినిధులను అనుమతించారు. అభివాదం చేసేందుకు కూడా ఓపిక లేకపోవడంతో కళ్లతోనే పలకరించారు. భువనేశ్వరి, లోకేష్‌లు బుధవారం పూర్తిగా ఆస్పత్రిలోని ఆయన గదివద్దే ఉండిపోయారు. చంద్రబాబు సోదరీమణులు, మేనకోడలు, భువనేశ్వరి సోదరి కూడా ఆయనను పరామర్శించారు.
సర్కారు తీరుతో కలవరం
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు దీక్షపై దిగి రావాల్సిన అవసరం లేదనే ధోరణిలో ఉంది. మహబూబ్‌నగర్‌లో సీఎం వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైంది. తాము ప్రతిపక్షం డిమాండ్లకు అంగీకరిస్తే రాజకీయంగా వారికి లాభం చేసినట్లు అవుతుందని... రెండురోజులు ఓపిక పడితే దీక్ష అదే ముగిసిపోతుందని ఆంతరంగిక సంభాషణల్లో మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పుడు చేసిన దీక్షలకు టీడీపీ స్పందించిందా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలు టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీక్ష కొనసాగిస్తే చంద్రబాబు ఆరోగ్యం మరింత దిగజారుతుందన్న భయం వారిలో వ్యాపిస్తోంది. 'రైతుల కోసం ఆయన చేస్తున్న దీక్ష ఎంత ముఖ్యమో, ఆయన ఆరోగ్యం మాకు అంతే ముఖ్యం. ఇప్పటిదాకా ఆయన చురుకుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఏదైనా అయినా మా పార్టీ చాలా నష్టపోతుంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా అదే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే మొండిగా వ్యవహరిస్తున్నాయి.
మేం ఈ పరిణామాలపై తీవ్రంగా చర్చిస్తున్నాం' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు బుధవారం రాత్రి వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో, ఆ తర్వాతి టీడీఎల్పీ భేటీలో బాబు ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతల మధ్య తర్జనభర్జనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే, మరోపక్క దీక్ష విరమణకు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం కూడా చేయాలని నేతలు నిర్ణయించారు.
సర్కారుపై ఒత్తిడి చేయడంలో భాగంగా బుధవారం జూబ్లీహాల్‌లో సీఎంను నిలదీసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. సీఎం వారితో మాట్లాడకుండా... మరో మార్గం నుంచి వెళ్లిపోయారు. దీంతో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి చర్చ జరిగినట్లు తెలిసింది. చివరికి... ఈ చర్చలు విఫలమయ్యాయి. కిరణ్ స్పందన అవమానకరంగా ఉందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాత్రంతా సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు.
తర్వాత కొద్దిసేపటికి సీఎం వారి వద్దకు వచ్చి... గురువారం అఖిల పక్షం ఏర్పాటు చేస్తామనడంతో, నిరసనను ఉపసంహరించుకున్నట్లు టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు... విపక్షాల ఉమ్మడి నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ, లెఫ్ట్ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లను దిగ్బంధించారు.
టీడీపీ నేత దేవేందర్ గౌడ్, సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రాఘవులుతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. తమ ఆందోళనల ఉద్దేశాన్ని సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇలాగైతే.. కోమాలోకే ?
రైతులకు ఇంకా మరింత మెరుగయిన ప్యాకేజీ ప్రకటిం చాలన్న డిమాండ్‌తో గత ఆరురోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం ప్రాణాపాయంగా మారుతోంది. గురువారం సాయంత్రం లోగా బాబు ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు బాబు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. గత ఆరు రోజుల నుంచి ఎలాంటి ఘన పదార్థం తీసుకోకుండా దీక్ష కొనసాగి స్తున్నందున ఇప్పటికే ఆయన కిడ్నీ దెబ్బతినే పరిస్థితి చేరిం దని, అది కోమాకు తీసుకువెళ్లేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. బాబు నేటి సాయంత్రం లోగా ఫ్లూయిడ్స్ తీసుకోక పోతే కోమాలోకి వెళ్లే అవకాశాలు కొట్టేయలేమని నిమ్స్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమ పరిస్థితి కూడా ఇరకాటంలో ఉందని, ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే బాబు పరిస్థితి కోమాలోకి వెళుతుందని, తీసుకోమని తాము ఎంత బలవంతం చేస్తున్నా ఆయన వినడం లేదని, కనీసం వైద్య పరీక్షకే ఆయన రెండు గంటల పాటు ప్రతిఘటిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తాముచెప్పినా ఆయన వినడం లేదని బాబు సతీమణి భువనేశ్వరి కూడా బయటకొచ్చి వాపోయారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎంత నచ్చచెప్పినా వినలేదు. ఆయన టీడీపీ కార్యకర్తల గురించి దీక్ష చేయడం లేదు. రైతుల కోసం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.మరోవైపు.. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం గురించి కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చేలా గట్టిగా పోరాడాలని తనను కలిసిన నాయకులకు బాబు స్పష్టం చేస్తున్న క్రమంలో నేతలు నిస్సహాయంగా బయటకు వస్తున్నారు.
‘నా జీవితం ఇక రైతులకే అంకితం. ఎవరికైనా ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరగక తప్పదు. ప్రభుత్వం దిగివచ్చి, రైతులకు న్యాయం జరిగే వరకూ నా దీక్ష ఆగదు. రైతులకు మంచి చేయడమే నా జీవిత లక్ష్యం. మీరంతా వచ్చి నన్ను దీక్ష విమరించమని చెప్పవద్ద’ని తనకు ఆప్తులయిన నాయకులతో బాబు స్పష్టం చేస్తున్నారు. తన పరిస్థితి చూసి కళ్లనీరు పెట్టిన వారికి బాబు ధైర్యం చెబుతున్నారు.‘ నీవే అధైర్య పడితే ఎలా? నాకేం కాదు. ధైర్యంగా ఉండండ’ని హితవు పలుకుతున్నారు. బాబుతో మాట్లాడుతున్న సమయంలో నాయకులు ఆయన నోరు వద్ద చెవి పెట్టవలసి వస్తోంది. బాబుకు కొన్ని సంవత్సరాల నుంచి రక్షణగా ఉంటున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన పరిస్థితిని చూసి కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. సార్ పరిస్థితి దారుణంగా ఉంది. మీరయినా చెప్పి విరమింపచేయండంటూ నాయకులను అభ్యర్థిస్తున్నారు.
No comments:
Post a Comment