చంద్రబాబు దీక్ష భగ్నం
ఇక సర్కారుతో టీడీపీ ఢీ
సమరమే!
ఆందోళన పథంలో తెలుగుదేశం.. శుక్రవారం నాడు చలో సచివాలయం
ఆదివారం రాజధానిలో రైతు గర్జన బహిరంగ సభ?
రానున్న జాతీయ నేతలు.. నిమ్స్ నుంచి బాబు నేరుగా సభకు
అక్కడే దీక్ష విరమణ.. రైతు సమస్యలపై ఉద్యమానికి శ్రీకారం
సీఎం అఖిలపక్షం విఫలం
ప్యాకేజీ పెంపునకు సర్కారు నో
విపక్షం ఆగ్రహం..దేశం, లెఫ్ట్ వాకౌట్
రాష్ట్ర వ్యాప్తంగా రైలు, రాస్తారోకోలు
సాయంత్రం నిమ్స్‌లో మారిన సీన్
భారీగా బలగాల మోహరింపు
ఐసీయూకు చంద్రాబు తరలింపు
బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్
ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత
మండిపడిన టీడీపీ నేతలు
అధినేత దీక్ష ఆగలేదని ప్రకటన

పంట నష్టాలపై ప్రకటించిన ప్యాకేజీలో మార్పులేమీ ఉండవ్! ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం! అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం!! ఇదీ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తేల్చిన మాట! ప్యాకేజీ ఆసరా ఇచ్చేందుకేనని, పెంచినా సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్య.. ఇంటికి పంట వచ్చినప్పుడు రైతుల్లో కనిపించే ఆనందాన్ని ఎంత ధర చెల్లించినా కొనలేమంటూ 'సెంటు'మెంటు చల్లే యత్నం!!
డిమాండ్లపై కనీస స్పందనేది? ప్యాకేజీపై పునరాలోచన గురించి ఒక్క మాట కూడా లేదేం? మేం కేవలం మీరు చెప్పేది వినడానికి శ్రోతల్లా రాలేదు! అఖిలపక్ష భేటీని అడిగితే.. చరిత్ర చెబుతున్నారు. చరిత్ర వింటానికి మేం రాలేదు..! ఇది రాజకీయాలకు సమయం కాదు.. రైతులను ఆదుకోండి! కనీసం మీరు కేంద్రానికి లేఖ రాసిన మేరకైనా హెక్టారుకు రూ.8వేలకు పెంచండి!! ఇదీ.. అదే సమావేశంలో విపక్షాల వినతి!!
రైతు సమస్యలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిసింది! ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు దీక్ష విరమించాలని ఓ విన్నపం.. అండగా ఉన్నాం.. ఆత్మస్థైర్యంతో ఉండండి.. అంటూ రైతులకు ఓ భరోసా.. ఈ రెండు తీర్మానాలు మినహా.. అఖిలపక్షం విఫలమైంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు గతంలో ఇచ్చినట్లుగా లక్షన్నర పరిహారం చెల్లించాలని మంత్రి ధర్మాన చేసిన సూచనకు.. ముఖ్యమంత్రి పరిశీలిద్దామంటూ సానుకూలతను వ్యక్తం చేశారు.
అయితే.. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా.. టీడీపీ, సీపీఐ, సీపీఎంలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు చంద్రబాబు నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. దీక్ష ఏడో రోజు సాయంత్రం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం బాగా విషమించే సూచనలు కనిపిస్తున్నాయని, బలవంతంగానైనా చికిత్స అవసరమని పోలీసులకు తేల్చి చెప్పడంతో నిమ్స్‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.. పెద్ద ఎత్తున బలగాలు ఆస్పత్రిలో, చంద్రబాబు గది వద్ద మోహరించాయి.
వద్దు వద్దంటున్నా.. చంద్రబాబును బలవంతంగా.. 50 మంది పోలీసులు చుట్టుముట్టి కాపలా కాయగా ఐసీయూ గదికి తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా దీక్షను భగ్నం చేశారు. బలవంతాన ఫ్లూయిడ్స్ ఎక్కించినంత మాత్రాన చంద్రబాబు దీక్ష విరమించినట్లు కాదని టీడీపీ ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిరసనగా ఈ నెల 26న హైదరాబాద్‌లో రైతు గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ యోచిస్తోంది.
జాతీయ నేతలందరినీ ఈ సభకు ఆహ్వానించాలని ఆలోచిస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి నుంచి చంద్రబాబు నేరుగా ఆ సభకు వచ్చి.. అక్కడే.. జాతీయ నేతల చేతుల మీదుగా అధికారికంగా దీక్షను విరమించేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోపు ఉద్యమ తీవ్రత తగ్గకుండా శుక్రవారం సచివాలయ ముట్టడికి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షను ఏడో రోజైన గురువారం పోలీసులు భగ్నం చేశారు. గురువారం రాత్రి ఇక్కడి నిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉన్న ఆయనను బలవంతంగా అదే ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. ఆ వెంటనే ఆయనకు ఆస్పత్రి వైద్య బృందం చేతి నరం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలుపెట్టింది.
ఆయనను ఐసీయూకు తరలించే ముందు నిమ్స్ ఆస్పత్రిలో ఉత్కంఠభరిత దృశ్యాలు చోటు చేసుకొన్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తున్న లక్షణాలు కనిపించడంతో ఆయనకు బలవంతంగానైనా చికిత్స మొదలు పెట్టాలని వైద్య బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొన్న తర్వాత మంత్రి శంకరరావు ఆస్పత్రికి వచ్చి చంద్రబాబును పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వెంటనే పెద్ద సంఖ్యలో టాస్క్‌ఫోర్స్ పోలీసులను.. చంద్రబాబు గదికి చుట్టూ మోహరించారు.
చంద్రబాబు చికిత్స కోసం ప్రభుత్వం అధికారికంగా నియమించిన వైద్య బృందంలోని సభ్యులైన డాక్టర్ సోమరాజు, డాక్టర్ నాగేశ్వరరెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో నిమ్స్‌కు వచ్చారు. నిమ్స్ వైద్యులతో కలిసి ముందుగా చంద్రబాబు సతీమణి, కుమారుడి దగ్గరకు వెళ్లారు. తాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చూచాయగా చెప్పారు. పార్టీ నేతలకు కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని చెప్పారు. ఏదో జరగబోతోందని ఊహించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు.
నాయకుల సంఖ్య 60-70గా ఉంటే పోలీసులు సుమారు రెండు వందల మంది అక్కడ మోహరించారు. సాయంత్రం ఆరు గంటలకు రోజువారీ పరీక్షలు పూర్తయ్యాక, ఐసీయూకు తరలించబోతున్నట్లు వైద్య బృందం చంద్రబాబుకు చెప్పింది. కానీ ఆయన నిరాకరించి, తాను బాగానే ఉన్నానని, తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయవద్దని చెప్పారు.బలవంతంగా తరలించక తప్పని పరిస్థితి వచ్చిందని వైద్యులు అభిప్రాయపడి పోలీసు వర్గాలకు అదే విషయం చెప్పారు. అప్పటికే డీసీపీలు స్టీఫెన్ రవీంద్ర, అకున్ సబర్వాల్, కమలాసన్ రెడ్డి తదితరులు అక్కడికి వచ్చారు.
సరిగ్గా 7.20 గంటలకు చంద్రబాబు ఉన్న గది వద్దకు మఫ్టీలో ఉన్న పోలీసులు 50-60 మంది ఒకేసారి దూసుకొచ్చారు. గదికి సమీపంలో వివిధ చోట్ల నిలబడి ఉన్న పార్టీ నేతలను గబగబా అక్కడ ఉన్న గదుల్లోకి నెట్టేసి బయటి నుంచి తలుపులు వేసేశారు. ఆయన గదికి దారి తీసే మార్గాలనూ మూసేశారు. చంద్రబాబును ఆయన పడుకొన్న మంచంతో సహా బయటకు తెచ్చారు. మంచానికి కింద చక్రాలు ఉండటంతో తోసుకొని లిఫ్ట్ వరకూ తెచ్చారు.వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ను మాత్రం అనుమతించారు. చంద్రబాబు బలహీన స్వరంతో వద్దు... వద్దు అంటున్నా పోలీసులు పట్టించుకోలేదు.
ఆ సమయంలో మంచం చుట్టూ 50 మంది పోలీసులు కాపలా కాశారు. వారితోపాటు వైద్యులు సోమరాజు, నాగేశ్వరరెడ్డి, శేషగిరిరావు, శ్రీనివాసన్, దక్షిణామూర్తి ఉన్నారు. పోలీసులు తలుపులు మూయడంతో వాటి వెనుక ఆగిపోయిన టీడీపీ నేతలు కొందరు వాటిని తెరిపించడానికి పోలీసులతో కలబడ్డారు. తర్వాత చంద్రబాబును పై అంతస్తుకు తీసుకెళ్లి ఐసీయూలో చేర్చారు. ఐసీయూలోకి చంద్రబాబు భార్యను కూడా అనుమతించలేదు. గత ఏడాది టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా ఇదే గదిలో ఉంచారు.
ఆరోగ్యం దృష్ట్యా తప్పలేదు: వైద్య బృందం
చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణించడంతో బలవంతంగా చికిత్స మొదలు పెట్టాల్సి వచ్చిందని వైద్య బృందం తెలిపింది. తమ నిర్ణయానికి కారణాలను వివరిస్తూ వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. "సాయంత్రం 6గంటలకు చేసిన పరీక్షల్లో ఆయన రక్తపోటు పడిపోవడం... గుండె కొట్టుకొనే వేగం బాగా పెరిగిపోవడం వెల్లడైంది. బైకార్బొనేట్ నిల్వలు, సోడియం నిల్వలు తరిగిపోవడం మొదలైంది. తక్షణం చికిత్స మొదలు పెట్టకపోతే శరీర భాగాలు విఫలం కావడంతోపాటు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆయన ఆహారం తీసుకోవడానికి, చికిత్స చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు.
అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి కోర్టు ఈ నెల 21వ తేదీనే మాకు అనుమతి ఇచ్చింది. వీటి ఆధారంగా ఆయనను ఐసీయూకు తరలించి చేతి ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఆయన ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నాం'' అని వైద్యులు రమేష్, సోమరాజు, నాగేశ్వరరెడ్డి, శేషగిరిరావు విలేకరులకు చెప్పారు. ఐసీయూకు తరలించాక కూడా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఆయన నిరాకరించారని, బలవంతంగా వాటిని ఆయనకు ఎక్కించామని వైద్యులు వివరించారు.

రైతుల సమస్యల విషయంలో ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తన డిమాండ్ల విషయంలో చంద్రబాబు ఎంత పట్టుదలగా ఉన్నారో, వాటిని ఎలాంటి పరిస్థితిలోనూ ఆమెదించరాదని, పంతాన్ని వీడరాదన్న సంకల్పం కిరణ్‌కుమార్ రెడ్డిలో గత ఏడు రోజుల నుంచి స్పష్టంగా కనిపించింది.
టీడీపీతో పాటు అన్ని విపక్ష పార్టీలు రైతులకు ఇచ్చే ప్యాకేజీలో మార్పులు చేయాలని డిమాండ్ చేసినా, స్వంత పార్టీ ఎంపీలు ఢిల్లీలో ప్రధానికి వినతి పత్రాలు సమర్పించుకున్నా తాను శాసనసభలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటాను తప్ప ఒక్క అంగుళమైనా వెనక్కి వేసేది లేదని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏడు రోజులుగా నిరవధిక నిరశన దీక్షలో ఉన్న చంద్రబాబును చివరకు గురువారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తీసుకు వెళ్ళి బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఎక్కించారు. అయినా తాను నోటి ద్వారా ఆహారం తీసుకోబోనని, కేవలం ఫ్లూయిడ్స్ ద్వారానే అదే బెడ్‌పై దీక్ష కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నట్టు సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి తదితరులు చెప్పారు.
ఎవరి మాట వారిదే...
సహజంగానే చంద్రబాబు స్వభావం మొండిగా ఉంటుంది. ఏ అంశాన్ని చేపట్టినా దాన్ని తుదకంటా లాగే దాకా ఆయన వదలరన్న చరిత్ర ఉంది. ఇప్పుడు రైతు సమస్యల విషయంలోనూ ఆయన అదే పంథా అవలంబిం చారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడినా, డిమాండ్లు నెరవేరితే చాలునని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మూడు రోజులు గడచిన తర్వాత అర్ధరాత్రి వేళ పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించినప్పుడే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన రోజుల్లో ఆరోగ్యం క్షీణించినా వెనక్కి తగ్గ కుండా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేదాకా దీక్ష కొన సాగించారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, సమీప బంధువులు బుధవారం నుంచి ఎంతగా కోరినా ఆయన తన మాట మార్చుకోలేదు. తన మాటను సైతం ఆయన కాదంటున్నారని భువనేశ్వరి కూడా అన్నారు.
ఇటువైపు కిరణ్...
ఇక ఇటువైపు కిరణ్‌కుమార్ రెడ్డి సైతం తన పద్ధతి తనదే అనే పంథా అనుసరిస్తూ వచ్చారు. శాసనసభలో రైతు సమస్యలపై ప్రకటించిన ప్యాకేజీకి మించి దమ్మిడీ పైసా విదిల్చేది లేదని పదే పదే తేల్చి చెప్పారు. ఢిల్లీ వెళ్ళినప్పుడూ అదే మాట అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిసినప్పుడు మంత్రుల బృందాన్ని పంపించి దీక్ష విరమణ యత్నాలు చేయించారే తప్ప ప్యాకేజీపై మరో మాట లేదని కరాఖండిగా తేల్చారు. జడ్చర్లలో బుధవారం జరిగిన బహిరంగ సభ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు దీక్షపై ఎద్దేవా చేసే పద్ధతిలో మాట్లాడారు. రైతు బాంధవుడు అని పేరు తెచ్చుకోవాలన్న సంకల్పం సిద్ధించిందని, ఇక దీక్ష విరమిస్తే మంచిదన్నారు.
గురువారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా సైతం కిరణ్‌కుమార్ రెడ్డి విపక్ష నేతల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్ని పార్టీల వారూ ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చించటానికి వస్తే తనకన్న ఎక్కువగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో మాట్లాడించినట్టు సమాచారం. చివరకు అసలు సమస్య పక్క దోవ పట్టి ఎవరి హయాంలో ఏమి చేశారో చెబుతుంటే యనమల తదితరులు జోక్యం చేసుకుని మళ్ళీ దారిలోకి తీసుకు వచ్చారంటున్నారు. ఒక దశలో ఆయన తానేమీ కోరికోరి అఖిలపక్షాన్ని పిలవలేదని, పిలవాలని అడిగితే కాదనలేక ఒప్పుకున్నానే తప్ప ఆహ్వానించి మాట్లాడాలన్న ఉద్దేశమేమీ తనకు లేదన్న రీతిలో మాట్లాడటం ముఖ్యమంత్రి జగమొండి వైఖరికి పరాకాష్ఠ అని విపక్ష నేతలు ఘాటుగా విమర్శించారు.
ఇంతకీ విజయం ఎవరిది?
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య ఒక ప్రధాన సమస్యపై సాగిన దీక్షాస్త్ర సమరంలో విజయం ఎవరిదనేదానికి మాత్రం సమాధానం లేదు. విపక్షాల ఒత్తిడికి లొంగకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నానని ముఖ్యమంత్రి ఒకవైపు సంబర పడుతుంటే, ఏడు రోజులైనా చెక్కు చెదరకుండా చేసిన నిరశన దీక్షతో బాబు రైతు లోకాన్ని ఉత్తేజితం చేస్తున్నారు.
No comments:
Post a Comment