తండ్రి చంద్రబాబునాయుడు రైతుల కోసం నిరవధిక దీక్ష చేస్తున్న ఒకరోజు తర్వాత ఆయన తన యుడు లోకేష్ దీక్షా శిబిరానికి వచ్చి, తండ్రికిమద్దతుగా శిబిరంలో కూర్చుకున్నారు. రాత్రంతా ఆయన అక్కడే ఉండటంతో.. బాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహ రించే కొందరు నాయకులు ఇక ఇంటికి వెళ్లమని సూచించినా లోకేష్ వినకుండా అక్కడే ఉన్నారు. పార్టీ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఏర్పాట్లను కూడా స్వయంగా సమీక్షించారు. తండ్రి ఆరోగ్యం గురించి డాక్టర్లను వాకబు చేశారు. జిల్లాల నుంచి వచ్చిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబును నిమ్స్‌కు తరలిం చిన తర్వాత కూడా ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయన ఎమర్జెన్సీ వార్డు వద్దనే ఉన్నారు.
ఎప్పుడూ పార్టీ నాయకులతో దూరంగా ఉండి, తన వ్యాపారాలకే పరిమితమయిన లోకేష్ దీక్షా శిబిరం వద్ద మాత్రం నాయకు లందరితో కలియదిరిగారు. సన్నిహితంగా వ్యవహరించారు. బాబు దీక్ష సందర్భంగా మిగిలిన పక్షాలు చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై ప్రతిస్పందించాల్సిన వ్యూహం గురించి సీనియర్లు చేసిన విశ్లేషణలలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా.. తన తండ్రిని తెల్లవారు ఝామున పోలీసులు మూకుమ్మడిగా వచ్చి అరెస్టు చేసిన సమయంలో లోకేష్ ప్రతిఘటించిన తీరు, యువ నేతలతో కలసి పోలీసు వ్యూహాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. ఆ సమయంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బాబు అరెస్టును అడ్డుకున్నందుకు లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లోకేష్ రాజకీయ అరంగేట్రానికి ఈ ఘటనే పునాది వేసిందని పార్టీకి చెందిన యువ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటివరకూ కేవలం వ్యాపారాల్లోనే ఉంటూ, ఎన్నికల సమయంలో మాత్రం తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన లోకేష్.. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ‘నగదు బదిలీ హామీ’ పథకానికి మూలకర్తగా నిలిచారు. పార్టీలో నేరుగా క్రియాశీల పాత్ర పోషించకపోయినప్పటికీ, యువ నేతలతో మాత్రం సన్నిహితంగా వ్యవహరిస్తూ క్షేత్ర స్థాయి సమాచారాన్ని తెప్పించుకున్నారు. గత ఎన్నికల్లో సర్వే నివేదికలు కూడా తెప్పించి, ఆ మేరకు వ్యవహరించటంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ యువ నేతల సమాచారం.
పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణతో లోకేష్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ త్వరలో ఏర్పాటుచేయబోయే రాష్ట్ర కమిటీలో లోకేష్‌కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వచ్చంటున్నారు.
కాగా, లోకేష్ రాజకీయ అరంగేట్రంతో తెలుగుదేశంలో యువతరానికి ప్రాధాన్యం పెరగనుంది. ఇప్పటికీ 1982 నాటి నాయకులే పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం, అంతా పాత ముఖాలే కనిపిస్తుండటం ప్రతిసారీ వారికే అన్ని అవకాశాలు దక్కడంతో ద్వితీయ శ్రేణి, ప్రధానంగా యువకులు పార్టీలో చురుకయిన పాత్ర పోషించేందుకు నిరాశతో ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఎన్నికల్లో టికెట్లు, రాజ్యసభ-ఎమ్మెల్సీల్లో కూడా పాత తరం వారికే ప్రాధాన్యం ఇస్తుండటం, మరోవైపు, జగన్ కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తూ, అందులో యువ తరానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో తమ పార్టీ కూడా కాలానికి తగినట్లు యువకులకు అవకాశాలు ఇవ్వకపోతే ప్రస్తుతం కొంత ఆశతో ఉన్న యువ నాయకులు కూడా జగన్ పార్టీ వైపు వెళ్లే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది.
జగన్ పార్టీ నేపథ్యంలో.. తాము కూడా యువకులకే ఇకపై ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, సీనియర్లను లోక్‌సభ- రాజ్యసభకు, పొలిట్‌బ్యూరోకు పరిమితం చేసి, మిగిలిన అన్ని అవకాశాలూ యువకు లకే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. అందులో భాగంగా, యువకుడయిన లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా.. పార్టీపై యువ ముద్ర వేసే యోచనలో ఉంది. లోకేష్‌ను పార్టీలోకి తీసుకువచ్చి, యువనేత లను ప్రోత్సహిస్తే యువరక్తం పార్టీ వైపు ఆకర్షితులవుతుందని భావిస్తోంది. 1982 నాటి తరహాలో పార్టీకి యువరక్తం అవసరమని గ్రహించింది.
ప్రధాన కార్యదర్శిగా లోకేష్
జగన్ అటు కాంగ్రెస్-ఇటు తెలుగుదేశం పార్టీల్లోని యువ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నందున.. ఆ ప్రభావాన్ని అడ్డు కోవడంతో పాటు, కొత్త తరాన్ని ఆకర్షిం చాలని టీడీపీ నాయకత్వం చాలాకాలం నుంచీ యోచిస్తోంది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకత్వం ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మాదిరిగానే.. లోకేష్‌కూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమంగా పార్టీలో క్రియాశీల పాత్ర పోషించేలా చూస్తున్నారు.
అదే సమయంలో... ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్ల కుమారులను కూడా తెరపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడు చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే సీనియర్లు విశ్రాంతి తీసుకుని కుమారులకు బాధ్యతలు అప్పచెప్పాలని తరచూ సూచిస్తున్నారు. ఇప్పుడు లోకేష్‌ను తెరపైకి తీసుకురావడం ద్వారా ఇక నాయ కుల కుమారులను కూడా పార్టీలోకి తెచ్చేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదారు సార్లు పోటీ చేసిన సీనియర్లు, 60 సంవత్స రాల వయసు వచ్చిన నాయకుల కుమారు లను రాజకీయాల్లోకి తీసుకు రావడం ద్వారా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలతో వెళ్లాలని నిర్ణయించింది.
No comments:
Post a Comment