Thursday, December 30, 2010

మీతోనే ఉంటాం * వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ * రైతు కోసం జాతీయ స్థాయి ఉద్యమం

Raitukosam
ప్రకృతి వైఫరీత్యాలతో తీవ్ర నష్టాలపాలైన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తుపాన్‌ల ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చే విధంగా మిత్ర పక్షాలతో కలిసి గుంటూరులో గురువారం సాయంత్రం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ భారీ బహిరంగసభ జరిగింది. సభలో చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్రాలు అవినీతిలో మునిగితేలుతున్నా యని ఆరుగాలం శ్రమించిన రైతు అకాల వర్షాలకు కుదే లైపోతే వారిని ఆదుకోకుండా ప్రభు త్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాన్‌ కారణంగా ఏర్పడిన తీవ్రనష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. రైతులకు మేలు చేయడం కోసం తాము శాసనసభలోనూ బయట అనేక పోరాటాలు చేశామని ఆయన తెలియజేశారు. తెలంగాణా అంశంలో విద్యా ర్ధులపై కేసులను ఎత్తివేయాలని తాము శాసనసభ లో ప్రభుత్వాన్ని కోరితే మూడు రోజులపాటు సభను గందరగోళానికి గురిచేసిందన్నారు. విద్యార్ధులపై కేసులు ఎత్తేయాలని తాము శాసనసభలో ముందే కోరా మని అయితే అప్పుడు స్పందించని ప్రభుత్వం రైతుల కష్టా లపై పోరాటం చేస్తున్న తమపట నిర్ధాక్షిణ్యంగా వ్యవహ రించిందన్నారు. ప్రభుత్వం ఎంపిలు 24 గంటలు దీక్ష చేసేలోగా కేసులన్నీ ఎత్తి వేసిందన్నారు. రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.

HANDSU 

స్వామినాధన్‌ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాం డ్‌ చేశారు. చేనేతలను, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కూడా చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రైతులు స్థైర్యం కోల్పోవద్దని, ఆత్మ హత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేవరకు తాను మిత్రపక్షాలతో కలిసి రాజీ లేని పోరాటాన్ని చేయనున్నామని చంద్రబాబు తెలిపారు. రైతుల కష్టాలను తొలగించేందుకు జాతీయ స్థాయిలో ఉద్య మాలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల పక్షంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి అతి త్వరలోనే ఒక నూతన సంస్థను ఏర్పాటుచేయనున్నట్లుగా చంద్ర బాబు ప్రకటించారు.

అవినీతిని అంతమొందించి పేదలులేని సమాజాన్ని చూడ డమే తన జీవితలక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో మునిగితేలుతూ పేదలకు కొద్దిగా సహాయం చేయమంటే స్పందించడం లేదని బాబు విమర్శిం చారు. 2జి స్పెక్ట్రమ్‌ కామవెల్త్‌ గేమ్‌ల నిర్వహణలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రైతులను ఆదు కోవడానికి ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చుచేయ డానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. అదే విధంగా అవినీతిపరుల జేబుల్లో నిండుతున్న సొమ్మును పేద రైతులకోసం ఖర్చు చేయాలని ఆయన అన్నారు.
అలాగే కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ట్రిబ్యునల్‌ తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులు సరిగా లేవని, రాష్ట్ర అవసరాలకు నీటి కోసం మరెవరో దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని అసహనం వ్యక్తంచేశారు.

రైతులకు దగ్గరయిన ‘దేశం’
babu-sirrదాదాపు పదకొండేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ రైతులకు చేరువయింది. ఒకవైపు తెలంగాణ- సమై క్యాంధ్ర ఉద్యమాలు. మరోవైపు శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ. ఇంకోవైపు అందరిచూపూ ఢిల్లీ వైపు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో జనం ఎవరినీ, వేటినీ పట్టించుకోని వైనం. ఈ ప్రతికూల రాజకీయ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అతికొద్ది సమయంలో గుంటూరులో నిర్వహించిన ‘రైతు కోసం’ బహిరంగసభ దిగ్విజయం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపింది. దాదాపు 3 లక్షల మందికి పైగా రైతాంగం, పార్టీ శ్రేణులు హాజరుకావడమే దానికి కారణం. నిఘా వర్గాలు మాత్రం రెండు- రెండున్నర లక్షల మంది వచ్చారని చెబుతున్నాయి.

రైతుల కోసం సంక్షేమనిధి : టీడీపీ
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి తెలుగు దేశంపార్టీ సంక్షేమనిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన రైతుకోసం సభావేదికపై ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్‌ మొమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నిధి ద్వారా తమవంతు సహాయాన్ని రైతులకు చేయడానికి కృషి చేస్తామని బాబు తెలిపారు. ఇక నుంచి రైతుకు చిన్న అన్యాయం జరిగినా సహించేది లేదని, ప్రభుత్వాన్ని నిలదీసి న్యాయం జరిగేవరకు టీడీపీ పోరాడుతుందని బాబు అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల రాజకీయ పరిస్థితిలో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం టీడీపీ నిర్వహించిన ‘రైతుకోసం’ బహిరంగసభ విజయ వంతం కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖుషీగా ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేసిన నేతలను ఆయన అభినందించారు. కోస్తా నేతలు సమీకరణను ప్రతిష్ఠాత్మకంగా భావించారు. నిజానికి, ఇప్పుడు నెలకొన్న పరిస్థితిలో 50 వేల మంది జనం వచ్చినా ఎక్కువేనన్న అంచనా పార్టీ నేతల్లో అంతర్గతంగా ఉంది. అయితే, లక్షమంది పట్టే స్టేడియం నిండిపోగా, అం దుకు రెండింతలు బయట, రోడ్లపై ఉండటం, సభ జరుగు తుండగానే ఇంకా వాహనాలు వస్తుండటం, దాదాపు 18 కిలోమీటర్లు ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో దాదాపు ఐదు గంటలు ప్రయాణీకులు ఇబ్బంది పడవలసి వచ్చింది. దీన్ని బట్టి జనం హాజరు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

రైతు సమస్యలపై జరిగిన ‘రైతుకోసం’ సభకు దేవెగౌడ, ప్రకాష్‌కరత్‌, బర్దన్‌, అజిత్‌సింగ్‌, చౌతాలా, బాబూలాల్‌ మరాండీ వంటి జాతీయ నేతలు హాజరయిన సభతో కోస్తాలో తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం వచ్చినట్ట యింది. పార్టీకి మళ్లీ రైతుముద్ర వచ్చినట్టయింది. ఎన్టీఆర్‌ మృతి చెందకముందు వరకూ రైతు పార్టీగా ఉన్న టీడీపీకి, కోస్తాలో రైతులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా సీట్లు బాగానే వచ్చినప్పటికీ, 2004 నుంచి తిరోగ మనం మొదలయింది. ఇప్పుడు మళ్లీ రైతుకోసం సభ విజయవంతంతో ఆ పార్టీ రైతులకు దగ్గరయినట్ట యింది. ఇది పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది.

అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడే గుంటూరు జిల్లా పార్టీ నేతలు, రైతుకోసం సభ విజయవంతానికి కలసికట్టుగా శ్రమించారు. గుంటూరులో ఎంపీ మోదుగుల, కోడెల, ధూళిపాళ్ల, పుల్లారావు, యరపతినేని, ఆంజనేయులు, ఆలపాటి రాజా సమన్వయంతో పనిచేయడం కలసివచ్చిం ది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి బాబు ఆధ్వర్యంలో చేసిన తరలింపు ఏర్పాట్లు విజయవంతమయ్యాయి. కొవ్వూరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణ జరిగింది. డెల్టాలో కన్నా అప్‌ల్యాండ్‌ లోనే జన సమీకరణ బాగా జరిగి నట్లు కనిపిపించింది. గుంటూ రులో గరికపాటి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సమీక రణ బాధ్యత తీసుకోగా, యన మల-హరికృష్ణ నిర్వర్తించిన సమన్వయ బాధ్యతలు సఫలమయ్యాయి.

జగన్‌ పార్టీ నేపథ్యంలో.. పార్టీపరంగా, నాయకత్వ విబే ధాల కారణంతో కొంత బలహీనంగా ఉన్న కోస్తా ప్రాంతం లో ‘రైతుకోసం’ సభ విజయవంతం కావడం టీడీపీ శ్రేణు లకు టానిక్‌లా పరిణమించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో ఉత్సాహంగా పనిచేయటంతో పాటు, జగన్‌ పార్టీ వైపు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు వెళ్లకుండా నిరోధించ డానికి దోహదపడింది. అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి సమీకరణ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అక్కడ పార్టీపై దృష్టి సారించడానికి అవకాశం లభించింది. వైఎస్‌ మృతి నేపథ్యంలో ప్రత్యామ్నాయం లేని నేతగా ఆవిర్భవిం చిన బాబుపై కోస్తా రైతాంగం చూపిన ఆదరణ పరిశీలిస్తే, రానున్న రోజుల్లో కోస్తాప్రాంతంలో టీడీపీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

మళ్లీ యనమల-గరికపాటి హిట్‌ కాంబినేషన్‌
టీడీపీ ‘రైతు కోసం’ సభకు సమయం తక్కువగా ఉండ టంతో ప్రధానంగా గుంటూరు-కృష్ణా-ప్రకాశం- పశ్చిమ గోదావరి-నల్లగొండ- ఖమ్మం జిల్లాలపైనే దృష్టి కేంద్రీక రించారు. అయితే, కృష్ణా-ప్రకాశం నుంచి ఆశించినంత సంఖ్యలో సమీకరణ కనిపించలేదు. గుంటూరు- ఖమ్మం వెస్ట్‌ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యా రు. నల్లగొండ నుంచి జరిగిన సమీకరణ ఫర్వాలేదనిపిం చింది. దీనికోసం యనమల సారధ్యంలో హరికృష్ణ, గరిక పాటి మోహన్‌రావు రూపొందించిన ప్రణాళిక ఫలించింది. ప్రధానంగా యనమల-గరికపాటి కాంబినేషన్‌ మరోసారి హిట్టయింది.

గతంలో గుంటూరులోనే జరిగిన యువగర్జ న, రైతుగర్జన, రాజమండ్రి మహానాడుతో పాటు భారీసభ ల ఏర్పాట్లు కూడా వీరిద్దరి కాంబినేషన్‌లోనే హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా బాబు దీక్ష సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మూడుసార్లు తెల్లవారుఝామున పోలీసులను కార్యకర్తలు ప్రతిఘటించే వ్యూహానికి కూడా వీరిద్దరే వ్యూహకర్తలు కావడం విశేషం. కాకపోతే గుంటూరు ‘రైతుకోసం’ సభలో హరికృష్ణ తోడయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి గుంటూరు వేదిక వరకూ భారీ స్వాగత సన్నాహాలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ కోస్తాలో టీడీపీ బలపడుతోందన్న భావనను కలిగించాయి. 
రైతు కోసం సభలో చంద్రబాబు డిమాండ్
14 అంశాలతో ‘రైతుకోసం డిక్లరేషన్’ ప్రకటన
భావసారూప్య పార్టీలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తాం
ప్రభుత్వం స్పందించకున్నా ఆత్మహత్యలకు పాల్పడవద్దు
చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ మీ కోసమే పనిచేస్తా
చేతకాకపోతే ఎంపీలు రాజీనామా చేయాలి


కేంద్రంలో, రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వ్యవసాయ పెట్టుబడులు, రైతు శ్రమ, భూమి విలువలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై 50 శాతం లాభం ఉండేలా ఉత్పత్తులకు ధర నిర్ణయించాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన అఖిలపక్ష ‘రైతుకోసం’ సభలో ఆయన సదస్సు డిక్లరేషన్‌ను ప్రకటించారు. 14 అంశాలపై రైతుల కోసం సమావేశం ప్రకటిస్తున్న డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభకు జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఆర్.ఎల్.డి. అధినేత అజిత్‌సింగ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓంప్రకాశ్ చౌతాలా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, ఆర్.ఎస్.పి. నేత అభనిరాయ్, ఫార్వర్డ్‌బ్లాక్ నేత దేవరాజన్, ఎండీఎంకే నేత గణేష్‌మూర్తి, తదితర నేతలు హాజరయ్యారు.

సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... ఇక్కడికి వచ్చిన జాతీయ స్థాయి నాయకులతో మరోసారి సమావేశమై, ఒక వ్యవస్థను ఏర్పాటుచేసుకొని దానికింద జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం స్పందించకపోయినా నిరాశకులోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంచిరోజులొస్తాయని, రైతుల జీవితాల్లో వెలుగునింపేవరకు తామంతా కలిసిపోరాడతామని భరోసా ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్టీఆర్ స్ఫూర్తితో రైతు సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడతామని చెప్పారు. ‘ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నా... చివరి రక్తపుబొట్టు వరకు మీ కోసమే పాటుపడతా..’ అని స్పష్టం చేశారు.

ఎంపీలూ! రైతుల కోసమూ దీక్ష చేయండి!!

ప్రస్తుత నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సుమారు 60 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే.. ప్రభుత్వం ఎకరానికి రూ. 2,400 ఇస్తామంటోందని తప్పుపట్టారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ‘‘అసెంబ్లీలో కొట్లాడాం. ఈ ప్రభుత్వం స్పందించలేదు. రైతులకోసం జీవితంలో తొలిసారిగా నిరాహార దీక్షకు కూర్చున్నా. దీక్ష విరమించి కొద్దిగా కోలుకున్నాక ఇక్కడికి వచ్చా. నాకు గొంతు కూడా పెగలడం లేదు. కానీ మిమ్మల్ని చూశాక లేని శక్తిని కూడా కూడగట్టుకొని మాట్లాడుతున్నా. దిగాలుపడిన రైతాంగానికి న్యాయం జరగాలి. రైతులు రోజుకు 30 మంది చనిపోతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 33 మంది ఎంపీలున్నారు. ఏం చేస్తున్నారు? రైతులకోసం నిరాహార దీక్ష చేయండి. చేతకాకపోతే రాజీనామా చేయండి.. కానీ రైతుకు అన్యాయం చేయొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అధ్యయనం చేశాక కార్యాచరణ

మిగులు జలాలను కర్ణాటక, మహరాష్టల్రతో కలిసి పంచుకునే పరిస్థితి.. భవిష్యత్తులో రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టివేస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఆలమట్టి ప్రాజెక్టు 524 మీటర్ల ఎత్తు కడతామంటే అప్పట్లో మా పోరాటంతో 519 మీటర్లకు కట్టడి చేశాం. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుకోవచ్చనే తీర్పు రావడం రాష్ట్రానికి కష్టకాలం. సరైన న్యాయవాదులను పెట్టుకోకపోవడం వల్లే తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. దీనిపై గత ఏప్రిల్‌లో ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేసి మరీ హెచ్చరించినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం’’ అని ఆయన తెలిపారు.

రైతు కోసం జాతీయ స్థాయి ఉద్యమం

  రైతాంగ సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహించాలని, అందుకు గుంటూరులో జరిగిన ‘రైతుకోసం’ సభ నాంది పలకాలని వివిధ జాతీయ పార్టీల నేతలు ఉద్ఘాటించారు.

జాతీయ స్థాయిలో పోరాడాలి: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో మేమంతా కలిసి ప్రధాని దగ్గరికి వెళితే ముష్టివేసినట్టుగా రూ.400 కోట్లు ఇస్తామన్నారు. ఈ గుంటూరు సభ స్ఫూర్తిగా జాతీయస్థాయిలో మనమంతా ఉమ్మడిగా పోరాడాలి.
- ప్రకాశ్ కారత్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి

రైతుకివ్వడానికి మనసొప్పడం లేదు..: తమిళనాడులో ఎకరాకు నష్టపరిహారం రూ. 10 వేలు ఇస్తున్నారు. ఇక్కడ ఇవ్వడానికి మనసొప్పడం లేదు. దీనిపై భావసారూప్య పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం.
- సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి

రైతులు తిరగబడాలి: సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలపై రైతులు ఉద్యమించి తిరగబడాలి. ఎన్డీయే, యూపీఏ హయాంలో 2 లక్షల 16 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- దేవెగౌడ, మాజీ ప్రధాని

రెండు పూటలా తినలేని పరిస్థితి: రైతుల పిల్లలు రెండుపూటలా తినలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి విద్యాబుద్ధులు కూడా చెప్పించలేని పరిస్థితి. రైతాంగం పక్షాన ఐక్య ఉద్యమం నిర్మించాలి.
- బాబూలాల్ మరాండీ, జార్ఖండ్ మాజీ సీఎం
ఆంధ్ర, మహారాష్టల్ల్రోనే ఎక్కువ: రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర, మహారాష్టల్ల్రో ఎక్కువ. 2010 కుంభకోణనామ సంవత్సరంగా మారింది. ఈ సభతోనైనా 2011 రైతు నామ సంవత్సరంగా మారాలి.
- అజిత్‌సింగ్, ఆర్‌ఎల్‌డీ అధినేత

నల్ల ఆంగ్లేయులు దోచుకుంటున్నారు: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెల్ల ఆంగ్లేయులు పో యి కాంగ్రెస్ నల్ల ఆంగ్లేయులు రైతును దోచుకుంటున్నారు. రైతన్న అధికారం పోరాడి సాధించుకోవాలి.
- ఓంప్రకాశ్‌చౌతాలా, ఐఎన్‌ఎల్‌డీ నేత
 

రైతే పెన్నిధి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి ఏర్పాటు...
అధికారంలోకి వస్తే ప్రత్యేక బడ్జెట్
నా చివరి రక్తపు బొట్టూ రైతు సంక్షేమానికే...
ప్రాణం పోయినా వెనుకంజవేయను
రైతుకోసం సదస్సులో చంద్రబాబు.. కిక్కిరిసిన జనం, సభ సక్సెస్
పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి...
గుంటూరు డిక్లరేషన్ విడుదల
ప్రధాని 400కోట్లు ముష్టి వేశారు: కరత్
కాంగ్రెస్ దోచుకుంటోంది: చౌతాలా
ఎన్డీయే, యూపీఏ రైతు వ్యతిరేక పార్టీలే: దేవెగౌడ
దేశవ్యాప్త పోరాటానికి ప్రతిన

అన్నదాత ఆత్మహత్యలు ఆపాలి. ఇందుకు స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. ఇవీ.. 'గుంటూరు డిక్లరేషన్' కీలకాంశాలు. వీటిపై దేశవ్యాప్త పోరాటం చేస్తామని.. ప్రభుత్వాలను కదిలిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినబూనారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక బడ్జెట్ ఇస్తామని ప్రకటించారు. గుంటూరులో గురువారం నిర్వహించిన 'రైతు కోసం' సదస్సులో ఆయన మాట్లాడారు.

ప్రాణం పోయినా.. ఆరోగ్యం చెడినా.. వెనుకంజ వేసే ప్రసక్తే లేదని.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే వరకూ రాజీ లేని పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన చివరి రక్తపు బొట్టును కూడా రైతాంగ సంక్షేమానికే అర్పిస్తానని ప్రకటించారు. ఉద్యమ కేసులు ఎత్తివేయాలని దీక్షలు చేసిన ఎంపీలు.. రైతుల కోసం కూడా దీక్షలు చేస్తే సంతోషిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఉపయోగపడనప్పుడు ఎంపీలు రాజీనామాలు చేయడమే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది పార్టీల జాతీయ నేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమర శంఖం పూరించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ సారి రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరులో గురువారం జరిగిన 'రైతు కోసం' సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీపరంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రైతుల సంక్షేమానికి 'ప్రత్యేక నిధి'ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలన్నదే తన ధ్యేయమన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ర్రాష్టాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు.

ప్రభుత్వ భూములను అమ్మివేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని, దోచుకున్న డబ్బుతో పేపర్లు, టీవీలు పెట్టారని, సిమెంట్ కంపెనీలు నిర్మించారని, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారంటూ పరోక్షంగా దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆ డబ్బుతో రైతులను ఆదుకుంటే సంతోషించే వాడినని చెప్పారు. దోచుకున్న సొమ్మును కక్కించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కేంద్రంలో కొందరు మంత్రులు తిమింగలాలుగా మారి ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కామన్‌వెల్త్ క్రీడల పేరుతో రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారని, వందలాది కోట్లు మింగేశారని విమర్శించారు. వాటిలో రెండు వేల కోట్లను రైతుల కోసం ఖర్చు చేసేందుకు వారికి ప్రాణం ఒప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. 'కష్టాల్లో ఉన్న రైతన్నలను ఆదుకోవాలనే తలంపుతో నా జీవితంలో తొలిసారి నిరవధిక నిరాహార దీక్ష చేశాను. రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఆరోగ్యం చెడినా వెరవను. రైతులకు న్యాయం జరిగే వరకు వెనుకంజ వేయను. నా చివరి రక్తపు బొట్టును సైతం రైతుల సంక్షేమానికే చిందిస్తా'' అన్నారు. రాష్ట్రం నుంచి 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నా రైతుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులపై మోపిన కేసులు ఎత్తివేయాలని దీక్షలు చేసిన ఎంపీలు రైతుల కోసం కూడా దీక్షలు చేస్తే సంతోషిస్తానని, తద్వారా వచ్చే కీర్తి కూడా వారే పొందవచ్చనని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి రైతుల పట్ల శ్రద్ధ లేదన్నారు.

తీర్పు చూశాక తదుపరి కార్యాచరణ

కృష్ణా మిగులు జలాల విషయంలో తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిమూలంగా ఆంధ్రప్రదేశ్ కరువు రాష్ట్రంగా మారనుందని వాపోయారు. ట్రిబ్యునల్ నివేదిక చూసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు

Wednesday, December 29, 2010

'' రైతుకోసం '' సర్వం సిద్ధం

'రైతు కోసం' రెడీ


భారీ స్థాయిలో గుంటూరు సభ ఏర్పాట్లు
పర్యవేక్షిస్తున్న హరికృష్ణ, యనమల, గరికపాటి

హాజరు కానున్న పది జాతీయ పార్టీల నేతలు
దేశవ్యాప్త ఉద్యమానికి తొలి అడుగు
రైతు సమస్యలపై 'గుంటూరు డిక్లరేషన్' 
tdpsabha 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే లక్ష్యంతో టీడీపీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక రైతు సదస్సు ‘రైతుకోసం’ సభకు గుంటూరు బ్రహ్మానంరెడ్డి స్టేడియం సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నానికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సదస్సు నిర్వహణ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ర్ట నాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు గత రెండు రోజులుగా తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పయ్యావుల కేశవ్‌, యనమల రామకృష్ణుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, సుజనాచౌదరి, నందమూరి హరికృష్ణ, ఎంపిలు వేణుగోపాలరెడ్డి, వేమ్‌ నరేంద్రరెడ్డి, యర్రన్నాయుడు, రేవంత్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులంతా గుంటూరులోనే మకాం పెట్టారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా రైతులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముందని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు.

ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము పరిశీలిస్తున్నట్లుగా రాష్ట్ర నేతలు చెబుతున్నారు. గుంటూరు సహా ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, నల్గొండ తదితర జిల్లాల నుండి కూడా రైతులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో వాహనాల పార్కింగ్‌కు గుంటూరులోని అతిపెద్ద మైదానాలను, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి సిద్ధం చేస్తున్నారు. సదస్సుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు వామపక్ష నేతలు, 16 జాతీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు.

రెండేళ్ళ క్రితం జిల్లాలోనే యువగర్జన సదస్సును తాము విజయవంతంగా నిర్వహించామని, ఆస్ఫూర్తితోనే ఈ సదస్సును కూడా విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పుల్లారావు తెలియజేశారు. అప్పట్లో తాము చేసిన ఏర్పాట్ల వల్ల లక్షలాది మంది కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువగర్జన సదస్సులో పాల్గొని వెళ్ళారని, అదే స్ఫూర్తితో ప్రస్తుతం కూడా కార్యకర్తలు, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. బుధవారం సదస్సు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నాయకులు రేవంత్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, యనమల రామకృష్ణుడు, సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్‌, వర్ల రామయ్య తదితరులు పర్యవేక్షించారు.
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతుకోసం' బహిరంగ సభకు గుంటూరు ముస్తాబైంది. దేశవ్యాప్తంగా సుమారు పది పార్టీల నేతలు ఈ సభలో పాల్గొని వ్యవసాయదారుల సమస్యలపై జాతీయ స్థాయి పోరాటానికి పిలుపునివ్వనున్నారు. తమ పోరాటానికి విధానపరమైన ప్రాతిపదికను వివరిస్తూ 'గుంటూరు డిక్లరేషన్' పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేయనున్నారు.

డిక్లరేషన్‌లో పేర్కొన్న డిమాండ్ల సాధనకు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ రీత్యా జన సమీకరణపరంగా కూడా ఈ సభను భారీగా నిర్వహించడం ద్వారా తమ పోరాటానికి శుభారంభాన్ని ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు సభ తన డిక్లరేషన్‌లో డిమాండ్ చేయనుంది.

టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, జనతాదళ్ (యు),జనతాదళ్ (ఎస్), ఆరెల్డీ, ఐఎన్ఎల్‌డీ, ఏజీపీ, ఎండీఎంకే, అన్నా డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చాలకు చెందిన నేతలు పాల్గొంటున్నారు. వీరిలో మాజీ ప్రధాని దేవెగౌడ్, మాజీ ముఖ్యమంత్రులు ఓం ప్రకాష్ చౌతాలా, బాబూలాల్ మరాండీ, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్, వామపక్ష పార్టీల జాతీయ నేతలు ప్రకాశ్ కరత్, ఏ రాజా, అభినవ్ రాయ్, ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తదితరులు ఉన్నారు.

ఢిల్లీ, బెంగుళూరుల నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో ఈ నేతలు గురువారం ఉదయం నేరుగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు అక్కడకు వెళ్తారు. విమానాశ్రయంలోనే వీరంతా కొంతసేపు సమావేశమై గుంటూరు డిక్లరేషన్ ముసాయిదా పరిశీలించి దానికి తుది రూపు ఇస్తారు. అక్కడ నుంచి వీరంతా హెలికాప్టర్లో గుంటూరు సభకు చేరుకొంటారు.

హెలికాప్టర్ రెండు మూడు విడతల్లో వీరిని గుంటూరు చేరుస్తుంది. సభను మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభించి సాయంత్రం 5గంటలకు ముగించాలన్నది నిర్వాహకుల ప్రయత్నం. ఇటీవలి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ చంద్రబాబు 8రోజులపాటు నిరవధిక దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

ఆ దీక్షకు జాతీయ పార్టీల నేతల నుంచి మంచి సంఘీభావం వ్యక్తమైంది. దానిని ఉద్యమ రూపంలోకి మల్చడంతో పాటు రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడానికి ఈ సభను జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది.

భారీగా ఏర్పాట్లు

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మూడు రోజులుగా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ, యనమల రామకృష్ణుడు, ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావులు పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

లక్ష మంది లక్ష్యంగా తొలుత ఏర్పాట్లు ప్రారంభించిన పార్టీ నేతలు బుధవారం నాటికి తమ అంచనాలు మించి జనం హాజరవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ వెలుపల భారీ ్రస్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, చంద్రబాబు పరామర్శలు, బాబు నిరవధిక దీక్ష, పోలీసుల అరెస్టులు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలకు సంబంధించిన అనేక ఫొటోలను ఫ్లెక్సీల రూపంలో గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేశారు.

వేదిక పక్కన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా.. పచ్చని జెండాలు, ఫ్లెక్సీలతో గుంటూరు పసుపు మయమైంది. చాలా కాలం తరువాత నగరంలో భారీ సదస్సు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.

లాభసాటిగా వ్యవసాయం
డిక్లరేషన్‌లో డిమాండ్ ఇదే

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు సభ తన డిక్లరేషన్‌లో డిమాండ్ చేయనుంది. పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, మద్దతు ధరకు గ్యారంటీ లేకపోవడం, ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం, సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం గాలివాటంగా మారిందని, పెట్టిన పెట్టుబడి తిరిగిరాని సందర్భాల్లో రైతులు మరో దారిలేక ఆత్మహత్యలను అనుసరించాల్సి వస్తోందని ఈ డిక్లరేషన్ అభిప్రాయపడుతోంది.

స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా పెట్టిన పెట్టుబడి ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరగా నిర్ణయించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులకు వీలైనంత ఉదారంగా సహాయం అందించడానికి వీలుగా కేంద్రం నియమించిన వర్కింగ్ గ్రూపు సిఫారసులను తక్షణం అమలు చేయాలని, పంట వేసిన ప్రతి రైతుకూ బీమా సౌకర్యం కల్పించాలని, కౌలు రైతులతో సహా అందరికీ తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చూడాలని ఈ డిక్లరేషన్ ద్వారా డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్ల సాధనకు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది.
Click Here!

Monday, December 27, 2010

బాబు ‘' రైతు బాట '’

babu-recover
తన కఠోర దీక్షతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రైతుల కోసం పోరాడే నేతగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వచ్చిన కీర్తిని సుస్థిరం చేసుకునేందుకు రైతుబాట పట్టనున్నారు. ఈనెల 30న గుంటూరులో జరపతలపెట్టిన ‘రైతుకోసం’ భారీ బహిరం గసభను విజయవంతం చేయడం ద్వారా వ్యక్తిగతంగా తన పై, సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీపై రైతు ముద్ర వేసేలా కార్యాచరణ ప్రారంభించారు. గతంలో తనపై కాంగ్రెస్‌ పార్టీ వేసిన రైతు వ్యతిరేక ముద్రను కఠోర దీక్ష ద్వారా, మొండితనంతో తొలగించుకున్న చంద్రబాబు, ఆ ఉత్సా హంతో రైతులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించారు.

అందులో భాగంగా గుంటూరులో జరిగే ‘రైతు కోసం’ సభ నుంచి బాబు తన రైతు బాటను ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత ఉత్తరాంధ్ర నుంచి రైతుయాత్రలు ఉంటాయని తెలుస్తోంది. గతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మీకోసం’ యాత్ర ద్వారా కొత్త ఇమేజ్‌ను పొందిన బాబు, ఇప్పుడు రైతు కోసం యాత్రల ద్వారా రైతన్నకు చేరువకానున్నారు. తన దీక్షా సమయంలో రైతుల నుంచి వచ్చిన స్పందన, ఆ సమయంలో జిల్లాల్లో పార్టీ నేతల కార్యక్రమాల తీరు, కార్యకర్తలు-రైతు సమీకరణలో నేతల పాత్ర వంటి అంశాలను బేరీజు వేసుకుంటున్న బాబు, ఆ మేరకు పార్టీని ఏవిధంగా రైతుల వద్దకు తీసు కువెళ్లాలన్న అంశంపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒక రకంగా దీక్ష వల్ల పార్టీని తిరిగి ఏవిధంగా పునర్ని ర్మాణం చేసుకోవాలో తెలుసుకునే అవకాశం కలిగిందని బాబు భావిస్తున్నారు. ఆ సమయంలో చిత్తశుద్ధితో పని చేసింది ఎవరు? మొక్కుబడిగా వ్యవహ రించింది ఎవరన్న అంశాలను పరిశీలిస్తున్న బాబు, ఆ మేరకు పార్టీని ఆయా ప్రాంతాల్లో పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు సమా చారం. బలహీనంగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ వంటి చోట నాయకత్వాన్ని మార్చి, యువనా కత్వానికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

తన దీక్ష ద్వారా గతంలో తనపై కాంగ్రెస్‌ పార్టీ వేసిన రైతు వ్యతిరేక ముద్రను తొలగించుకోగలిగినా, పూర్తి స్థాయిలో రైతులు టీడీపీ వైపు ఇంకా ఆ ర్షితులు కావడం లేదు. ఈ వాస్తవాన్ని విషయాన్ని గ్రహించిన బాబు, ఇకపై వారికి దగ్గరయ్యే కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఇకపై ఎక్కువ సమయం మండల కేంద్రాల్లోనే ఉండేలా కార్య్ర మాలు రూపొందించేందుకు పార్టీ నాయకులు కార్యాచ రణలో నిమగ్నమయ్యారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేయడం లేదని, కాంగ్రెస్‌ నాయ కులు పదవుల కోసం తిరుగుతున్నారన్న భావన బలపడి నందున, అలాంటి వ్యతిరేకత ఇంకా పెరిగేంత వరకూ పట్టణప్రాంతాలపై దృష్టి తగ్గించి, గ్రామాలపైనే ఎక్కువ దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఏ రాజకీయ పార్టీలకూ చెందని తటస్థ రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఇటీవలి తుపాన్ల సమయంలో ప్రభుత్వ మొక్కుబడి స్పందన తటస్థ రైతును ఆగ్రహానికి, అసంతృప్తికి గురిచేసింది. తమకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని, అధికార పార్టీ ఎమ్మె ల్యేలు కూడా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి బలంగా నాటుకుపోయింది. బాబు దీక్ష సమయంలో కూడా తటస్థ రైతులు తమంతట హాజరయ్యారు. బాబు తమ కోసం దీక్ష చేస్తున్నారని నమ్మిన రైతులు సమీపంలోని దీక్షా శిబిరాలకు హాజరయ్యారు.

నిమ్స్‌లో రెండో రోజు తర్వాత శిబిరాలకు అంతంత మాత్రంగా హాజరయిన తటస్థ రైతులు, ఆ తర్వాత బాబు దీక్షలో చిత్తశుద్ధి ఉందని తెలుసుకున్న తర్వాతే ఎక్కువమంది హాజరవడం ప్రస్తావనార్హం. అయితే వారి శాతం తక్కువయినప్పటికీ, వారిని మండల స్థాయిలో సమన్వయం చేసే నాయకులు దానిపై శ్రద్ధ చూపి ఉంటే వారి శాతం ఇంకా ఎక్కువగా ఉండేది. దానిని గమనించిన టీడీపీ నాయకత్వం తటస్థ రైతుకు చేరవయ్యే కార్యక్రమా లను మండల, గ్రామ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో బాబు ‘రైతుకోసం’ యాత్రను మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.

గుంటూరు సభ తర్వాత బాబు గ్రామబాటలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబు యాత్రలో పట్టణాలు కాకుండా పర్యటించే ప్రతీ మండలంలో ఒక సభ నిర్వహించాలని భావిస్తున్నారు. అంతకంటే ముందు.. మండల పార్టీని పటిష్ఠం చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులను వీలయినంత ఎక్కువగా గ్రామాల్లోనే ఉండేలా చూడనున్నారు. ఇకపై ఎవరినీ హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఇవ్వనున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి, సాధారణ శ్రేణి కార్యకర్తలకు నేతలను అందుబాటులో ఉంచనున్నారు. అగ్రనేతలు అందుబాటులో ఉంటే కిందిస్థాయి నేతల్లో ఉత్సాహం, ఆత్మస్థైర్యం వస్తుందన్న విషయాన్ని నాయకత్వం గ్రహించింది.

Thursday, December 23, 2010

మొండి... జగమొండి * చంద్రబాబు దీక్ష భగ్నం * ఇక సర్కారుతో టీడీపీ ఢీ సమరమే!

babu-b

చంద్రబాబు దీక్ష భగ్నం
ఇక సర్కారుతో టీడీపీ ఢీ
సమరమే!

ఆందోళన పథంలో తెలుగుదేశం.. శుక్రవారం నాడు చలో సచివాలయం
ఆదివారం రాజధానిలో రైతు గర్జన బహిరంగ సభ?
రానున్న జాతీయ నేతలు.. నిమ్స్ నుంచి బాబు నేరుగా సభకు
అక్కడే దీక్ష విరమణ.. రైతు సమస్యలపై ఉద్యమానికి శ్రీకారం

సీఎం అఖిలపక్షం విఫలం
ప్యాకేజీ పెంపునకు సర్కారు నో
విపక్షం ఆగ్రహం..దేశం, లెఫ్ట్ వాకౌట్
రాష్ట్ర వ్యాప్తంగా రైలు, రాస్తారోకోలు
సాయంత్రం నిమ్స్‌లో మారిన సీన్
భారీగా బలగాల మోహరింపు
ఐసీయూకు చంద్రాబు తరలింపు
బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్
ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత
మండిపడిన టీడీపీ నేతలు
అధినేత దీక్ష ఆగలేదని ప్రకటన
పంట నష్టాలపై ప్రకటించిన ప్యాకేజీలో మార్పులేమీ ఉండవ్! ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం! అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం!! ఇదీ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తేల్చిన మాట! ప్యాకేజీ ఆసరా ఇచ్చేందుకేనని, పెంచినా సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్య.. ఇంటికి పంట వచ్చినప్పుడు రైతుల్లో కనిపించే ఆనందాన్ని ఎంత ధర చెల్లించినా కొనలేమంటూ 'సెంటు'మెంటు చల్లే యత్నం!!

డిమాండ్లపై కనీస స్పందనేది? ప్యాకేజీపై పునరాలోచన గురించి ఒక్క మాట కూడా లేదేం? మేం కేవలం మీరు చెప్పేది వినడానికి శ్రోతల్లా రాలేదు! అఖిలపక్ష భేటీని అడిగితే.. చరిత్ర చెబుతున్నారు. చరిత్ర వింటానికి మేం రాలేదు..! ఇది రాజకీయాలకు సమయం కాదు.. రైతులను ఆదుకోండి! కనీసం మీరు కేంద్రానికి లేఖ రాసిన మేరకైనా హెక్టారుకు రూ.8వేలకు పెంచండి!! ఇదీ.. అదే సమావేశంలో విపక్షాల వినతి!!

రైతు సమస్యలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిసింది! ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు దీక్ష విరమించాలని ఓ విన్నపం.. అండగా ఉన్నాం.. ఆత్మస్థైర్యంతో ఉండండి.. అంటూ రైతులకు ఓ భరోసా.. ఈ రెండు తీర్మానాలు మినహా.. అఖిలపక్షం విఫలమైంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు గతంలో ఇచ్చినట్లుగా లక్షన్నర పరిహారం చెల్లించాలని మంత్రి ధర్మాన చేసిన సూచనకు.. ముఖ్యమంత్రి పరిశీలిద్దామంటూ సానుకూలతను వ్యక్తం చేశారు.

అయితే.. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా.. టీడీపీ, సీపీఐ, సీపీఎంలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు చంద్రబాబు నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. దీక్ష ఏడో రోజు సాయంత్రం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం బాగా విషమించే సూచనలు కనిపిస్తున్నాయని, బలవంతంగానైనా చికిత్స అవసరమని పోలీసులకు తేల్చి చెప్పడంతో నిమ్స్‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.. పెద్ద ఎత్తున బలగాలు ఆస్పత్రిలో, చంద్రబాబు గది వద్ద మోహరించాయి.

వద్దు వద్దంటున్నా.. చంద్రబాబును బలవంతంగా.. 50 మంది పోలీసులు చుట్టుముట్టి కాపలా కాయగా ఐసీయూ గదికి తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా దీక్షను భగ్నం చేశారు. బలవంతాన ఫ్లూయిడ్స్ ఎక్కించినంత మాత్రాన చంద్రబాబు దీక్ష విరమించినట్లు కాదని టీడీపీ ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిరసనగా ఈ నెల 26న హైదరాబాద్‌లో రైతు గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ యోచిస్తోంది.

జాతీయ నేతలందరినీ ఈ సభకు ఆహ్వానించాలని ఆలోచిస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి నుంచి చంద్రబాబు నేరుగా ఆ సభకు వచ్చి.. అక్కడే.. జాతీయ నేతల చేతుల మీదుగా అధికారికంగా దీక్షను విరమించేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోపు ఉద్యమ తీవ్రత తగ్గకుండా శుక్రవారం సచివాలయ ముట్టడికి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

హైదరాబాద్, డిసెంబర్ 23 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షను ఏడో రోజైన గురువారం పోలీసులు భగ్నం చేశారు. గురువారం రాత్రి ఇక్కడి నిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉన్న ఆయనను బలవంతంగా అదే ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. ఆ వెంటనే ఆయనకు ఆస్పత్రి వైద్య బృందం చేతి నరం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలుపెట్టింది.

ఆయనను ఐసీయూకు తరలించే ముందు నిమ్స్ ఆస్పత్రిలో ఉత్కంఠభరిత దృశ్యాలు చోటు చేసుకొన్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తున్న లక్షణాలు కనిపించడంతో ఆయనకు బలవంతంగానైనా చికిత్స మొదలు పెట్టాలని వైద్య బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొన్న తర్వాత మంత్రి శంకరరావు ఆస్పత్రికి వచ్చి చంద్రబాబును పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వెంటనే పెద్ద సంఖ్యలో టాస్క్‌ఫోర్స్ పోలీసులను.. చంద్రబాబు గదికి చుట్టూ మోహరించారు.

చంద్రబాబు చికిత్స కోసం ప్రభుత్వం అధికారికంగా నియమించిన వైద్య బృందంలోని సభ్యులైన డాక్టర్ సోమరాజు, డాక్టర్ నాగేశ్వరరెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో నిమ్స్‌కు వచ్చారు. నిమ్స్ వైద్యులతో కలిసి ముందుగా చంద్రబాబు సతీమణి, కుమారుడి దగ్గరకు వెళ్లారు. తాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చూచాయగా చెప్పారు. పార్టీ నేతలకు కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని చెప్పారు. ఏదో జరగబోతోందని ఊహించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు.

నాయకుల సంఖ్య 60-70గా ఉంటే పోలీసులు సుమారు రెండు వందల మంది అక్కడ మోహరించారు. సాయంత్రం ఆరు గంటలకు రోజువారీ పరీక్షలు పూర్తయ్యాక, ఐసీయూకు తరలించబోతున్నట్లు వైద్య బృందం చంద్రబాబుకు చెప్పింది. కానీ ఆయన నిరాకరించి, తాను బాగానే ఉన్నానని, తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయవద్దని చెప్పారు.బలవంతంగా తరలించక తప్పని పరిస్థితి వచ్చిందని వైద్యులు అభిప్రాయపడి పోలీసు వర్గాలకు అదే విషయం చెప్పారు. అప్పటికే డీసీపీలు స్టీఫెన్ రవీంద్ర, అకున్ సబర్వాల్, కమలాసన్ రెడ్డి తదితరులు అక్కడికి వచ్చారు.

సరిగ్గా 7.20 గంటలకు చంద్రబాబు ఉన్న గది వద్దకు మఫ్టీలో ఉన్న పోలీసులు 50-60 మంది ఒకేసారి దూసుకొచ్చారు. గదికి సమీపంలో వివిధ చోట్ల నిలబడి ఉన్న పార్టీ నేతలను గబగబా అక్కడ ఉన్న గదుల్లోకి నెట్టేసి బయటి నుంచి తలుపులు వేసేశారు. ఆయన గదికి దారి తీసే మార్గాలనూ మూసేశారు. చంద్రబాబును ఆయన పడుకొన్న మంచంతో సహా బయటకు తెచ్చారు. మంచానికి కింద చక్రాలు ఉండటంతో తోసుకొని లిఫ్ట్ వరకూ తెచ్చారు.వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ను మాత్రం అనుమతించారు. చంద్రబాబు బలహీన స్వరంతో వద్దు... వద్దు అంటున్నా పోలీసులు పట్టించుకోలేదు.

ఆ సమయంలో మంచం చుట్టూ 50 మంది పోలీసులు కాపలా కాశారు. వారితోపాటు వైద్యులు సోమరాజు, నాగేశ్వరరెడ్డి, శేషగిరిరావు, శ్రీనివాసన్, దక్షిణామూర్తి ఉన్నారు. పోలీసులు తలుపులు మూయడంతో వాటి వెనుక ఆగిపోయిన టీడీపీ నేతలు కొందరు వాటిని తెరిపించడానికి పోలీసులతో కలబడ్డారు. తర్వాత చంద్రబాబును పై అంతస్తుకు తీసుకెళ్లి ఐసీయూలో చేర్చారు. ఐసీయూలోకి చంద్రబాబు భార్యను కూడా అనుమతించలేదు. గత ఏడాది టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా ఇదే గదిలో ఉంచారు.

ఆరోగ్యం దృష్ట్యా తప్పలేదు: వైద్య బృందం

చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణించడంతో బలవంతంగా చికిత్స మొదలు పెట్టాల్సి వచ్చిందని వైద్య బృందం తెలిపింది. తమ నిర్ణయానికి కారణాలను వివరిస్తూ వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. "సాయంత్రం 6గంటలకు చేసిన పరీక్షల్లో ఆయన రక్తపోటు పడిపోవడం... గుండె కొట్టుకొనే వేగం బాగా పెరిగిపోవడం వెల్లడైంది. బైకార్బొనేట్ నిల్వలు, సోడియం నిల్వలు తరిగిపోవడం మొదలైంది. తక్షణం చికిత్స మొదలు పెట్టకపోతే శరీర భాగాలు విఫలం కావడంతోపాటు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆయన ఆహారం తీసుకోవడానికి, చికిత్స చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు.

అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి కోర్టు ఈ నెల 21వ తేదీనే మాకు అనుమతి ఇచ్చింది. వీటి ఆధారంగా ఆయనను ఐసీయూకు తరలించి చేతి ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఆయన ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నాం'' అని వైద్యులు రమేష్, సోమరాజు, నాగేశ్వరరెడ్డి, శేషగిరిరావు విలేకరులకు చెప్పారు. ఐసీయూకు తరలించాక కూడా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఆయన నిరాకరించారని, బలవంతంగా వాటిని ఆయనకు ఎక్కించామని వైద్యులు వివరించారు.
click here

రైతుల సమస్యల విషయంలో ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి వైఖరులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తన డిమాండ్ల విషయంలో చంద్రబాబు ఎంత పట్టుదలగా ఉన్నారో, వాటిని ఎలాంటి పరిస్థితిలోనూ ఆమెదించరాదని, పంతాన్ని వీడరాదన్న సంకల్పం కిరణ్‌కుమార్‌ రెడ్డిలో గత ఏడు రోజుల నుంచి స్పష్టంగా కనిపించింది.

టీడీపీతో పాటు అన్ని విపక్ష పార్టీలు రైతులకు ఇచ్చే ప్యాకేజీలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేసినా, స్వంత పార్టీ ఎంపీలు ఢిల్లీలో ప్రధానికి వినతి పత్రాలు సమర్పించుకున్నా తాను శాసనసభలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటాను తప్ప ఒక్క అంగుళమైనా వెనక్కి వేసేది లేదని కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏడు రోజులుగా నిరవధిక నిరశన దీక్షలో ఉన్న చంద్రబాబును చివరకు గురువారం రాత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)కు తీసుకు వెళ్ళి బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఎక్కించారు. అయినా తాను నోటి ద్వారా ఆహారం తీసుకోబోనని, కేవలం ఫ్లూయిడ్స్‌ ద్వారానే అదే బెడ్‌పై దీక్ష కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నట్టు సీనియర్‌ నేత నాగం జనార్దనరెడ్డి తదితరులు చెప్పారు.

ఎవరి మాట వారిదే...
సహజంగానే చంద్రబాబు స్వభావం మొండిగా ఉంటుంది. ఏ అంశాన్ని చేపట్టినా దాన్ని తుదకంటా లాగే దాకా ఆయన వదలరన్న చరిత్ర ఉంది. ఇప్పుడు రైతు సమస్యల విషయంలోనూ ఆయన అదే పంథా అవలంబిం చారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడినా, డిమాండ్లు నెరవేరితే చాలునని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మూడు రోజులు గడచిన తర్వాత అర్ధరాత్రి వేళ పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించినప్పుడే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన రోజుల్లో ఆరోగ్యం క్షీణించినా వెనక్కి తగ్గ కుండా బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించేదాకా దీక్ష కొన సాగించారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, సమీప బంధువులు బుధవారం నుంచి ఎంతగా కోరినా ఆయన తన మాట మార్చుకోలేదు. తన మాటను సైతం ఆయన కాదంటున్నారని భువనేశ్వరి కూడా అన్నారు.

ఇటువైపు కిరణ్‌...
ఇక ఇటువైపు కిరణ్‌కుమార్‌ రెడ్డి సైతం తన పద్ధతి తనదే అనే పంథా అనుసరిస్తూ వచ్చారు. శాసనసభలో రైతు సమస్యలపై ప్రకటించిన ప్యాకేజీకి మించి దమ్మిడీ పైసా విదిల్చేది లేదని పదే పదే తేల్చి చెప్పారు. ఢిల్లీ వెళ్ళినప్పుడూ అదే మాట అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిసినప్పుడు మంత్రుల బృందాన్ని పంపించి దీక్ష విరమణ యత్నాలు చేయించారే తప్ప ప్యాకేజీపై మరో మాట లేదని కరాఖండిగా తేల్చారు. జడ్చర్లలో బుధవారం జరిగిన బహిరంగ సభ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు దీక్షపై ఎద్దేవా చేసే పద్ధతిలో మాట్లాడారు. రైతు బాంధవుడు అని పేరు తెచ్చుకోవాలన్న సంకల్పం సిద్ధించిందని, ఇక దీక్ష విరమిస్తే మంచిదన్నారు.

kiran-kumar-reddyతొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలనలో చంద్ర బాబు వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. సమయం, సందర్భం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణం అని కాంగ్రెస్‌ నేతలే కొందరు అంతర్గత చర్చల్లో అంగీకరించారు. రైతు సమస్యలపై నిలదీయాలని పబ్లిక్‌ గార్డెన్స్‌ గేటు వద్ద ఎదురు చూసిన టీడీపీ ఎమ్మెల్యేల కంట పడకుండా మరో ద్వారం గుండా వెళ్ళిపోయి క్యాంప్‌ ఆఫీసుకు చర్చలకు ఆహ్వానించారు. చివరకు ఎమ్మెల్యేలు ధర్నాకు దిగటంతో రాజీకి వచ్చి సరే అన్నారు.

గురువారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా సైతం కిరణ్‌కుమార్‌ రెడ్డి విపక్ష నేతల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్ని పార్టీల వారూ ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చించటానికి వస్తే తనకన్న ఎక్కువగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో మాట్లాడించినట్టు సమాచారం. చివరకు అసలు సమస్య పక్క దోవ పట్టి ఎవరి హయాంలో ఏమి చేశారో చెబుతుంటే యనమల తదితరులు జోక్యం చేసుకుని మళ్ళీ దారిలోకి తీసుకు వచ్చారంటున్నారు. ఒక దశలో ఆయన తానేమీ కోరికోరి అఖిలపక్షాన్ని పిలవలేదని, పిలవాలని అడిగితే కాదనలేక ఒప్పుకున్నానే తప్ప ఆహ్వానించి మాట్లాడాలన్న ఉద్దేశమేమీ తనకు లేదన్న రీతిలో మాట్లాడటం ముఖ్యమంత్రి జగమొండి వైఖరికి పరాకాష్ఠ అని విపక్ష నేతలు ఘాటుగా విమర్శించారు.

ఇంతకీ విజయం ఎవరిది?
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య ఒక ప్రధాన సమస్యపై సాగిన దీక్షాస్త్ర సమరంలో విజయం ఎవరిదనేదానికి మాత్రం సమాధానం లేదు. విపక్షాల ఒత్తిడికి లొంగకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నానని ముఖ్యమంత్రి ఒకవైపు సంబర పడుతుంటే, ఏడు రోజులైనా చెక్కు చెదరకుండా చేసిన నిరశన దీక్షతో బాబు రైతు లోకాన్ని ఉత్తేజితం చేస్తున్నారు.

Wednesday, December 22, 2010

పట్టువీడని సీఎం.. మెట్టు దిగని బాబు * గురువారంతో 7రోజుకు దీక్ష.. ఆరోగ్య పరిస్థితి విషమం

 

చిక్తిసకు ససేమిరా.. కుటుంబ సభ్యులు కోరినా నో...
ఐసీయూలో చేరేందుకూ నిరాకరణ

ప్రమాదం పొంచి ఉందన్న డాక్టర్లు
దీక్షపై దిగిరాని ప్రభుత్వం
విరమిస్తేనే చర్చలని మెలిక
సీఎంను అడ్డుకోబోయిన టీడీపీ
మరో దారిలో వెళ్లిపోయిన కిరణ్
క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రితో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
వాడివేడిగా తీవ్ర వాగ్యుద్ధం
గురువారం నాడు అఖిలపక్ష భేటీకి సీఎం హామీ
రాష్ట్ర వ్యాప్తంగా 'కలెక్టరేట్ల ముట్టడి'
ప్రధానిని కలిసిన మిత్రపక్షాల నేతలు
రెండు రోజుల్లో చెబుతామన్న సీఎం
గురువారం నాడు రైల్, రాస్తా రోకోలు
చంద్రబాబు పట్టు వీడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెట్టు దిగడంలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకూ దీక్ష విరమించేది లేదని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. నష్టపోయిన రైతులకు ఇప్పటికే మంచి ప్యాకేజీ ఇచ్చామని, కొత్తగా ఇవ్వగలిగేది ఏమీ లేదని ప్రభుత్వం అంతే గట్టిగా చెబుతోంది. సర్కారు స్పందిస్తేనే దీక్ష విరమిస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తుండగా... దీక్ష విరమించిన తర్వాతే ఏదైనా ఉంటే చర్చిస్తామని సర్కారు వాదిస్తోంది.

ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు కేంద్రం స్థాయిలో విపక్షాల విన్నపాలకు స్పందన కరువవుతోంది. టీడీపీ, లెఫ్ట్ ఇతర విపక్షాల అగ్రనేతలు ఢిల్లీలో ప్రధానిని కలిసి పరిస్థితి వివరించారు. రైతులకు మరింత సహాయం ప్రకటించాలని, బాబు దీక్షను విరమింప చేయాలని కోరారు. అయితే... ఒకటి రెండు రోజుల్లో కేంద్ర బృందం నివేదిక రాగానే మరింత సహాయం ప్రకటించడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. దీంతో... చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పీటముడిలా బిగుసుకుంటోంది.

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బుధవారంతో ఆరో రోజు పూర్తయింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు, పార్టీ ముఖ్యనేతలు, చివరికి కుటుంబ సభ్యులు కోరినా... ఆయన చికిత్సకు ససేమిరా అన్నారు. తన భర్త ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, అయినా చికిత్సకు నిరాకరిస్తున్నారని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాపోయారు.

నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న చంద్రబాబును టీడీపీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు కలిశారు. రైతుల సమస్యలపై వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిద్దామని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి దీక్ష విరమణ గురించి ఆలోచించాలని వారు కోరారు. ఈ విజ్ఞప్తిని చంద్రబాబు తోసిపుచ్చారు. "నా ఆరోగ్యంకన్నా రైతుల సమస్యలకు పరిష్కారం లభించడమే నాకు ముఖ్యం. గత కొన్ని రోజులుగా రైతుల మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్ప నేను దీక్ష విరమించేది లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం!'' అన్నారు.

వైద్యులు చెప్పినా...

చంద్రబాబు శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల్లో బాగా హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నందున మూత్రపిండాలు, గుండెపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స చేయించుకుని, తమతో సహకరించాలని బుధవారం ఉదయం నుంచి పదే పదే అభ్యర్థించారు. అయినా... బాబు ససేమిరా అన్నారు. దీంతో వైద్యులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌కు పరిస్థితి వివరించారు. వారు చంద్రబాబును కలిసి చికిత్సకు అంగీకరించాల్సిందిగా కోరారు.

అయినా... ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిమ్స్ వైద్యులు టీడీపీ ముఖ్య నేతలను సంప్రదించారు. 'పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే చికిత్సకు ఒప్పించండి' అని కోరారు. బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు మరోసారి చంద్రబాబును కలిసి దీక్ష విరమించాలని కోరారు. అప్పటికీ చంద్రబాబు పట్టు వీడలేదు. కనీసం ఐసీయూలో చేర్చేందుకైనా అంగీకరించాలని వైద్యులు కోరినా.. ఆయన ససేమిరా అన్నారు. దీంతో బీపీ, కార్డియో యంత్రాలను ఆయన గదికే తెప్పించారు. వీటితో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నివేదికల విశ్లేషణకు ప్రత్యేకంగా ఓ డాక్టరును ఏర్పాటు చేశారు.

బుధవారం రాత్రి చంద్రబాబు పరిస్థితి బాగా దిగజారింది. ఓపిక లేకపోవడంతో మాట్లాడడం కూడా తగ్గించారు. ఒకటి రెండు మాటలు మాట్లాడినా... అవెక్కడో నూతిలోంచి వచ్చినట్లున్నాయి. బుధవారం ఆయనను చూసేందుకు మీడియా ప్రతినిధులను అనుమతించారు. అభివాదం చేసేందుకు కూడా ఓపిక లేకపోవడంతో కళ్లతోనే పలకరించారు. భువనేశ్వరి, లోకేష్‌లు బుధవారం పూర్తిగా ఆస్పత్రిలోని ఆయన గదివద్దే ఉండిపోయారు. చంద్రబాబు సోదరీమణులు, మేనకోడలు, భువనేశ్వరి సోదరి కూడా ఆయనను పరామర్శించారు.

సర్కారు తీరుతో కలవరం

రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు దీక్షపై దిగి రావాల్సిన అవసరం లేదనే ధోరణిలో ఉంది. మహబూబ్‌నగర్‌లో సీఎం వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైంది. తాము ప్రతిపక్షం డిమాండ్లకు అంగీకరిస్తే రాజకీయంగా వారికి లాభం చేసినట్లు అవుతుందని... రెండురోజులు ఓపిక పడితే దీక్ష అదే ముగిసిపోతుందని ఆంతరంగిక సంభాషణల్లో మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పుడు చేసిన దీక్షలకు టీడీపీ స్పందించిందా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిణామాలు టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీక్ష కొనసాగిస్తే చంద్రబాబు ఆరోగ్యం మరింత దిగజారుతుందన్న భయం వారిలో వ్యాపిస్తోంది. 'రైతుల కోసం ఆయన చేస్తున్న దీక్ష ఎంత ముఖ్యమో, ఆయన ఆరోగ్యం మాకు అంతే ముఖ్యం. ఇప్పటిదాకా ఆయన చురుకుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఏదైనా అయినా మా పార్టీ చాలా నష్టపోతుంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా అదే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే మొండిగా వ్యవహరిస్తున్నాయి.

మేం ఈ పరిణామాలపై తీవ్రంగా చర్చిస్తున్నాం' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు బుధవారం రాత్రి వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో, ఆ తర్వాతి టీడీఎల్పీ భేటీలో బాబు ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతల మధ్య తర్జనభర్జనలు జరిగాయి. డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే, మరోపక్క దీక్ష విరమణకు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం కూడా చేయాలని నేతలు నిర్ణయించారు.

సర్కారుపై ఒత్తిడి చేయడంలో భాగంగా బుధవారం జూబ్లీహాల్‌లో సీఎంను నిలదీసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. సీఎం వారితో మాట్లాడకుండా... మరో మార్గం నుంచి వెళ్లిపోయారు. దీంతో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి చర్చ జరిగినట్లు తెలిసింది. చివరికి... ఈ చర్చలు విఫలమయ్యాయి. కిరణ్ స్పందన అవమానకరంగా ఉందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాత్రంతా సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత కొద్దిసేపటికి సీఎం వారి వద్దకు వచ్చి... గురువారం అఖిల పక్షం ఏర్పాటు చేస్తామనడంతో, నిరసనను ఉపసంహరించుకున్నట్లు టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు... విపక్షాల ఉమ్మడి నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ, లెఫ్ట్ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లను దిగ్బంధించారు.

టీడీపీ నేత దేవేందర్ గౌడ్, సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రాఘవులుతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. తమ ఆందోళనల ఉద్దేశాన్ని సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
click here
ఇలాగైతే.. కోమాలోకే ?
రైతులకు ఇంకా మరింత మెరుగయిన ప్యాకేజీ ప్రకటిం చాలన్న డిమాండ్‌తో గత ఆరురోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం ప్రాణాపాయంగా మారుతోంది. గురువారం సాయంత్రం లోగా బాబు ఫ్లూయిడ్స్‌ తీసుకోకపోతే ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు బాబు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. గత ఆరు రోజుల నుంచి ఎలాంటి ఘన పదార్థం తీసుకోకుండా దీక్ష కొనసాగి స్తున్నందున ఇప్పటికే ఆయన కిడ్నీ దెబ్బతినే పరిస్థితి చేరిం దని, అది కోమాకు తీసుకువెళ్లేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. బాబు నేటి సాయంత్రం లోగా ఫ్లూయిడ్స్‌ తీసుకోక పోతే కోమాలోకి వెళ్లే అవకాశాలు కొట్టేయలేమని నిమ్స్‌ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమ పరిస్థితి కూడా ఇరకాటంలో ఉందని, ఫ్లూయిడ్స్‌ తీసుకోకపోతే బాబు పరిస్థితి కోమాలోకి వెళుతుందని, తీసుకోమని తాము ఎంత బలవంతం చేస్తున్నా ఆయన వినడం లేదని, కనీసం వైద్య పరీక్షకే ఆయన రెండు గంటల పాటు ప్రతిఘటిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తాముచెప్పినా ఆయన వినడం లేదని బాబు సతీమణి భువనేశ్వరి కూడా బయటకొచ్చి వాపోయారు. హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం ఎంత నచ్చచెప్పినా వినలేదు. ఆయన టీడీపీ కార్యకర్తల గురించి దీక్ష చేయడం లేదు. రైతుల కోసం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. BABU2
మరోవైపు.. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం గురించి కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చేలా గట్టిగా పోరాడాలని తనను కలిసిన నాయకులకు బాబు స్పష్టం చేస్తున్న క్రమంలో నేతలు నిస్సహాయంగా బయటకు వస్తున్నారు.

‘నా జీవితం ఇక రైతులకే అంకితం. ఎవరికైనా ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరగక తప్పదు. ప్రభుత్వం దిగివచ్చి, రైతులకు న్యాయం జరిగే వరకూ నా దీక్ష ఆగదు. రైతులకు మంచి చేయడమే నా జీవిత లక్ష్యం. మీరంతా వచ్చి నన్ను దీక్ష విమరించమని చెప్పవద్ద’ని తనకు ఆప్తులయిన నాయకులతో బాబు స్పష్టం చేస్తున్నారు. తన పరిస్థితి చూసి కళ్లనీరు పెట్టిన వారికి బాబు ధైర్యం చెబుతున్నారు.‘ నీవే అధైర్య పడితే ఎలా? నాకేం కాదు. ధైర్యంగా ఉండండ’ని హితవు పలుకుతున్నారు. బాబుతో మాట్లాడుతున్న సమయంలో నాయకులు ఆయన నోరు వద్ద చెవి పెట్టవలసి వస్తోంది. బాబుకు కొన్ని సంవత్సరాల నుంచి రక్షణగా ఉంటున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన పరిస్థితిని చూసి కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. సార్‌ పరిస్థితి దారుణంగా ఉంది. మీరయినా చెప్పి విరమింపచేయండంటూ నాయకులను అభ్యర్థిస్తున్నారు.

Tuesday, December 21, 2010

బుధవారం నాడు ఆరో రోజుకు దీక్ష.. విరమణకు బాబు... ససేమిరా దిగజారుతున్న ఆరోగ్య పరిస్థితి

 
ఫలించని మంత్రుల బృందం చర్చలు
బలవంతంగా సెలైన్ ఎక్కించాలని సర్కారు నిర్ణయం!
అనుమతి ఇచ్చిన న్యాయస్థానం


 "మీ ఆరోగ్యంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీక్ష విరమించండి''- మంత్రుల బృందం.

"నా ఆరోగ్యం ముఖ్యం కాదు. రైతులకు సంబంధించి మా డిమాండ్లు ఆమోదిస్తేనే విరమిస్తా''- చంద్రబాబు స్పష్టీకరణ.

వరుసగా ఐదోరోజూ... ఆస్పత్రిలోనూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరింత నీరసించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బలవంతంగానైనా బాబుకు సెలైన్ ఎక్కించి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహ రచన చేశారు. మరోవైపు, పార్టీ నేతలు, మంత్రులు కోరినా దీక్ష విరమణకు చంద్రబాబు ససేమిరా అన్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా మారితే ఏం చేయాలన్న దానిపై మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజులతో ముఖ్యమంత్రి చర్చించారు. ముగ్గురు మంత్రుల బృందాన్ని చంద్రబాబు వద్దకు పంపారు. ఈ బృందం మంగళవారం చంద్రబాబుతో చర్చలు జరిపింది.

దీక్ష విరమించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన చంద్రబాబు.. రైతాంగ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత, టీడీపీ నేతల వద్ద కూడా మంత్రుల బృందానికి ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేయలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

దీంతో.. విపక్ష ఆందోళనల కన్నా ముందే స్పందించి ప్రభుత్వం మంచి ప్యాకేజీయే ఇచ్చిందని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత భారీఎత్తున నష్ట పరిహారాన్ని చెల్లించడం లేదని స్పష్టం చేసింది. ఈ వాదనతో టీడీపీ నేతలు విభేదించారు. మంచి ప్యాకేజీ అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని నిలదీశారు. కచ్చితమైన ప్రతిపాదనలతో వస్తే తప్ప దీక్ష విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో, చేసేది లేక మంత్రుల బృందం వెనుదిరిగింది.

చంద్రబాబు డిమాండ్లను మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని విలేకరుల వద్ద వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీకి అదనంగా ప్రకటించేదేమీ లేదని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఇక, ఆరోగ్యం దిగజారుతున్నా వైద్య చికిత్స తీసుకోవడానికి చంద్రబాబు ససేమిరా అంటుండడంతో.. ఆయనకు వైద్య చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

బలవంతంగానైనా బాబుకు చికిత్స చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాలను వారు నిమ్స్ వైద్యులకు అందజేశారు. ఈ నేపథ్యంలోనే.. మంగళవారం రాత్రి బలవంతంగా అయినా చంద్రబాబు దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యూహరచన చేశారు. దీక్ష భగ్నానికి ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని, మంత్రుల బృందం చర్చలు ఇందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.

దీంతో.. బలవంతంగానైనా వైద్య చికిత్సను మొదలుపెట్టి.. సెలైన్ కూడా ఎక్కించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ యత్నాలను ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు కూడా సన్నద్ధమయ్యారు. ఆస్పత్రిలోనే మకాం వేశారు. సెలైన్ ఇచ్చినప్పటికీ, నోటి ద్వారా ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగించాలని కొందరు నేతలు సూచించారు. పూర్తి స్థాయిలో సెలైన్ తీసుకుంటూ గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో పది రోజులు దీక్ష చేసిన విషయాన్ని వారు ఉదహరించారు.

కానీ, మరి కొందరు నేతలు ఈ ప్రతిపాదనతో విభేదించారు. సెలైన్ పెట్టిన తర్వాత దీక్షకు పవిత్రత ఉండదని, అలా చేసేకంటే విరమించడం మంచిదని వాదించారు. అనంతర పరిణామాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవా లని వారంతా నిశ్చయించారు. కాగా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, కె.నారాయణలతోపాటు ఆర్ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అవనీరాయ్ తదితరులు మంగళవారం చంద్రబాబును పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
click here
బాబు ఆరోగ్యం విషమం
doctor
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ గత ఐదు రోజుల నుంచి నిరధిక నిరాహార దీక్ష చేస్తూ, రెండురోజుల నుంచి నిమ్స్‌లో కూడా నిరాహారదీక్ష కొనసాగిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నాగం జనార్దన్‌రెడ్డి వంటి నేతలు పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నప్పటికీ, మంగళవారం అర్ధరాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రానికి పరిస్థితి ఆందోళన కరంగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

గత ఐదురోజుల నుంచి ఎలాంటి ఆహారం లేకుండా దీక్ష కొనసాగిస్తోన్న చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నం దున ఆయన దీక్ష విరమించేలా చూడాలని వైద్యులు ఆయన కుటుంబసభ్యులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. వైద్యుల సలహాలను బాబుకు ఆయన కుటుంబసభ్యులు వివరించినప్పటికీ చివరకు కుటుంబసభ్యుల సలహాలు కూడా బాబు బేఖాతరు చేస్తు, దీక్ష కొనసాగించడంతో నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. నాయకులు నిరాహారదీక్ష చేసే సందర్భాల్లోఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉన్నప్పుడు సహజంగా ఫ్లూయిడ్స్‌ వాడుతుంటారు. ఇది అగ్రనేతల దీక్షల సందర్భంగా ఇది రుజు వయింది. దానివల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండకపోగా, చాలాకాలం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే, గత ఐదురోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును ప్రభుత్వం అరెస్టు చేసి నిమ్స్‌లో చేర్చిన తర్వాత చాలా నీరసంగా, బలహీనంగా కనిపిస్తున్నారు. ఫ్లూయిడ్స్‌ తీసుకోకపోతే ఆరో రోజుకు ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

babu-walk
అయితే, ప్రభుత్వం ఎంతకూ దిగిరాక పోవడం, మంగళవారం చర్చలకు వచ్చిన మంత్రులు ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోవడంతో ఇక ప్రభుత్వం మొండివైఖరితో ఉందన్న విషయం స్పష్టమయిందని పార్టీ సీనియర్లు బాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో తమకు మీ ఆరోగ్యం, ప్రాణాలు ముఖ్యమయినందున దీక్ష విరమించి, మరొక రూపంలో పోరాడదామని నాయకులు ఎంత నచ్చచెబుతున్నప్పటికీ బాబు ససేమిరా అంటున్నారు.

‘నేను నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. రైతుల కోసం చివరి వరకూ పోరాడుతానని మాటిచ్చా. ఇప్పుడు నాకేదో అయిపోతుందని మధ్యలో దీక్ష విరమించమనడం మీకూ మంచిది కాదు. ఈ జీవితంలో ఇక ఇంతకు మించిన తృప్తి మరేం ఉంటుంది. మీరు నా గురించి ఆలోచించవద్దు. జిల్లాల్లో ఆందోళనలను ఇంకా ఉధృతం చేయండి. ప్రభుత్వం ఇంకా ఎంత పట్టుదలకు పోతుందో నేనూ చూస్తా’నంటూ తనపై ఒత్తిళ్లు చేస్తున్న నాయకులకు స్పష్టం చేస్తున్నారు. దీనితో నేతలు నిస్సహాయంగా బయటకు వస్తున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చాలా నిదానంగా, నీరసంగా కనిపిస్తున్నారు.

బాబు ఆరోగ్య పరిస్థితి చివరకు ఎంత విషమ పరిస్థితికి చేరిందంటే.. ఆయన కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం శరీరం సహకరించడం లేదు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌, సిబ్బంది ఆయనను నడిపిస్తున్నారు. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. నీరసంగా ఉంటున్నందున ఆయనతో మాట్లాడేందుకు ఎవరినీ ఎక్కువ సేపు అనుమతించడం లేదు.కాగా, దీక్ష విరమించాలని బాబు నచ్చచెప్పడానికి పార్టీ సీనియర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు ఆయన తనయుడు లోకేష్‌కు నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు.

‘మనకు రైతులు ఎంత ముఖ్యమో, సార్‌ కూడా అంతే ముఖ్యం. మీరైనా దయచేసి ఆయనకు నచ్చచెప్పండ’ని అభ్యర్థించారు. అయితే, దానికి స్పందించిన లోకేష్‌ ‘నేను కూడా మీ అందరి మాదిరిగానే సైనికుడి లాంటివాడినే. ఆయన చెప్పిన దానిని ఫాలో చేయవలసిందే. మీరు చెప్పినా, నేను చెప్పినా ఆయన మాట వినరు. ప్రభుత్వం మళ్లీ స్పందించే వరకూ ఆయన దీక్ష విరమించనంటున్నారు’ అని వారికి స్పష్టం చేశారు. గత రెండురోజుల నుంచి బాబును పరామర్శించేందుకు వస్తున్న నాయకులకు లోకేషే ఆరోగ్య పరిస్థితి వివరిస్తున్నారు.

బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నాయకులకు లోకేష్‌ ఎదురు ధైర్యం చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతర్గతంగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, నాయకులు పరామర్శకు వచ్చినప్పుడు మాత్రం చాలా మనోధైర్యంగా కనిపిస్తున్నారు.తానే వారికి ధైర్యం చెబుతున్నారు. పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, నాగం జనార్దన్‌రెడ్డి, దేవేందర్‌ గౌడ్‌, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వేణుగోపాలచారి, రేవంత్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, ప్రభాకర్‌, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేష్‌, తీగల కృష్ణారెడ్డి, వర్ల రామయ్య తదితర నేతలు ఉదయం నుంచీ రాత్రి వరకూ నిమ్స్‌లోనే ఉంటున్నారు.

నాగం జనార్దన్‌రెడ్డి తరచూ వైద్యులతో మాట్లాడి బాబు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.
గత పదేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా యోగా, ఇతర ఎక్సర్‌సైజులు చేస్తుండటం వల్లే ఆయన ఇప్పటివరకూ శారీరకంగా-మానసికంగా ధైర్యంగా ఉంటూ, అనారోగ్యాన్ని అధిగమించ గలుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ అయిదురోజులూ ఆయనను అవే కాపాడినప్పటికీ, ఇకపై అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పలేమని, కనీసం ఫ్లూయిడ్స్‌ కూడా తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం విషమంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

నేతల ఆందోళన- లోకేష్‌ అనునయింపు
కాగా నిమ్స్‌కు చేరుతున్న వివిధ జిల్లాల నేతలు బాబును పరామర్శించేందుకు వచ్చిన సమయంలో భావోద్వేగానికి గురయి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా నేతలయితే బాబు ఆరోగ్య పరిస్థితి చూసి విలపిస్తున్నారు. అయితే, అక్కడే ఉన్న ఆయన కొడుకు లోకేష్‌ మాత్రం వారికి ధైర్యం చెబుతున్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్ల ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ధైర్యం చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్లు కూడా ఆయనను కలిశారు. రాష్ట్ర మహిళా నేతలు షకీలారెడ్డి, కుసుమ, సుప్రియ తదితరులు బాబు ఆరోగ్యంపై కలత చెందిన సందర్భంలో అక్కడే ఉన్న లోకేష్‌ వారికి ధైర్యం చెప్పారు.

లోకేష్‌ అరంగేట్రం * ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌

Lokeshతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ బాబు రాజకీయ రంగ ప్రవేశానికి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన దీక్షా శిబిరం వేదిక అయిందా? ఇక లోకేష్‌ పార్టీలో క్రియాశీల పాత్రకు రంగం సిద్ధమయిందా? కాంగ్రెస్‌-తెలుగుదేశం-పీఆర్పీకి చెందిన యువనేతలను ఆకర్షిస్తోన్న జగన్‌కు పోటీగా లోకేష్‌ తెరపైకి రానున్నారా? గత రెండురోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ వాదన నిజ మనిపిస్తోంది.

తండ్రి చంద్రబాబునాయుడు రైతుల కోసం నిరవధిక దీక్ష చేస్తున్న ఒకరోజు తర్వాత ఆయన తన యుడు లోకేష్‌ దీక్షా శిబిరానికి వచ్చి, తండ్రికిమద్దతుగా శిబిరంలో కూర్చుకున్నారు. రాత్రంతా ఆయన అక్కడే ఉండటంతో.. బాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహ రించే కొందరు నాయకులు ఇక ఇంటికి వెళ్లమని సూచించినా లోకేష్‌ వినకుండా అక్కడే ఉన్నారు. పార్టీ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఏర్పాట్లను కూడా స్వయంగా సమీక్షించారు. తండ్రి ఆరోగ్యం గురించి డాక్టర్లను వాకబు చేశారు. జిల్లాల నుంచి వచ్చిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబును నిమ్స్‌కు తరలిం చిన తర్వాత కూడా ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయన ఎమర్జెన్సీ వార్డు వద్దనే ఉన్నారు.

ఎప్పుడూ పార్టీ నాయకులతో దూరంగా ఉండి, తన వ్యాపారాలకే పరిమితమయిన లోకేష్‌ దీక్షా శిబిరం వద్ద మాత్రం నాయకు లందరితో కలియదిరిగారు. సన్నిహితంగా వ్యవహరించారు. బాబు దీక్ష సందర్భంగా మిగిలిన పక్షాలు చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై ప్రతిస్పందించాల్సిన వ్యూహం గురించి సీనియర్లు చేసిన విశ్లేషణలలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా.. తన తండ్రిని తెల్లవారు ఝామున పోలీసులు మూకుమ్మడిగా వచ్చి అరెస్టు చేసిన సమయంలో లోకేష్‌ ప్రతిఘటించిన తీరు, యువ నేతలతో కలసి పోలీసు వ్యూహాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. ఆ సమయంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బాబు అరెస్టును అడ్డుకున్నందుకు లోకేష్‌ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లోకేష్‌ రాజకీయ అరంగేట్రానికి ఈ ఘటనే పునాది వేసిందని పార్టీకి చెందిన యువ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటివరకూ కేవలం వ్యాపారాల్లోనే ఉంటూ, ఎన్నికల సమయంలో మాత్రం తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన లోకేష్‌.. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ‘నగదు బదిలీ హామీ’ పథకానికి మూలకర్తగా నిలిచారు. పార్టీలో నేరుగా క్రియాశీల పాత్ర పోషించకపోయినప్పటికీ, యువ నేతలతో మాత్రం సన్నిహితంగా వ్యవహరిస్తూ క్షేత్ర స్థాయి సమాచారాన్ని తెప్పించుకున్నారు. గత ఎన్నికల్లో సర్వే నివేదికలు కూడా తెప్పించి, ఆ మేరకు వ్యవహరించటంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని లోకేష్‌ నిర్ణయించుకున్నట్లు పార్టీ యువ నేతల సమాచారం.

పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణతో లోకేష్‌ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ త్వరలో ఏర్పాటుచేయబోయే రాష్ట్ర కమిటీలో లోకేష్‌కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వచ్చంటున్నారు.
కాగా, లోకేష్‌ రాజకీయ అరంగేట్రంతో తెలుగుదేశంలో యువతరానికి ప్రాధాన్యం పెరగనుంది. ఇప్పటికీ 1982 నాటి నాయకులే పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తుండటం, అంతా పాత ముఖాలే కనిపిస్తుండటం ప్రతిసారీ వారికే అన్ని అవకాశాలు దక్కడంతో ద్వితీయ శ్రేణి, ప్రధానంగా యువకులు పార్టీలో చురుకయిన పాత్ర పోషించేందుకు నిరాశతో ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఎన్నికల్లో టికెట్లు, రాజ్యసభ-ఎమ్మెల్సీల్లో కూడా పాత తరం వారికే ప్రాధాన్యం ఇస్తుండటం, మరోవైపు, జగన్‌ కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తూ, అందులో యువ తరానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో తమ పార్టీ కూడా కాలానికి తగినట్లు యువకులకు అవకాశాలు ఇవ్వకపోతే ప్రస్తుతం కొంత ఆశతో ఉన్న యువ నాయకులు కూడా జగన్‌ పార్టీ వైపు వెళ్లే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది.

జగన్‌ పార్టీ నేపథ్యంలో.. తాము కూడా యువకులకే ఇకపై ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, సీనియర్లను లోక్‌సభ- రాజ్యసభకు, పొలిట్‌బ్యూరోకు పరిమితం చేసి, మిగిలిన అన్ని అవకాశాలూ యువకు లకే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. అందులో భాగంగా, యువకుడయిన లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా.. పార్టీపై యువ ముద్ర వేసే యోచనలో ఉంది. లోకేష్‌ను పార్టీలోకి తీసుకువచ్చి, యువనేత లను ప్రోత్సహిస్తే యువరక్తం పార్టీ వైపు ఆకర్షితులవుతుందని భావిస్తోంది. 1982 నాటి తరహాలో పార్టీకి యువరక్తం అవసరమని గ్రహించింది.

ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌
జగన్‌ అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీల్లోని యువ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నందున.. ఆ ప్రభావాన్ని అడ్డు కోవడంతో పాటు, కొత్త తరాన్ని ఆకర్షిం చాలని టీడీపీ నాయకత్వం చాలాకాలం నుంచీ యోచిస్తోంది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది. రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ నాయకత్వం ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మాదిరిగానే.. లోకేష్‌కూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమంగా పార్టీలో క్రియాశీల పాత్ర పోషించేలా చూస్తున్నారు.

అదే సమయంలో... ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్ల కుమారులను కూడా తెరపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడు చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే సీనియర్లు విశ్రాంతి తీసుకుని కుమారులకు బాధ్యతలు అప్పచెప్పాలని తరచూ సూచిస్తున్నారు. ఇప్పుడు లోకేష్‌ను తెరపైకి తీసుకురావడం ద్వారా ఇక నాయ కుల కుమారులను కూడా పార్టీలోకి తెచ్చేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదారు సార్లు పోటీ చేసిన సీనియర్లు, 60 సంవత్స రాల వయసు వచ్చిన నాయకుల కుమారు లను రాజకీయాల్లోకి తీసుకు రావడం ద్వారా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలతో వెళ్లాలని నిర్ణయించింది.

Monday, December 20, 2010

భీష్మించిన బాబు

నిమ్స్‌లోనే దీక్ష కొనసాగింపు... నాటకీయ ఫక్కీలో అరెస్ట్, ఆస్పత్రికి తరలింపు... చికిత్సకు సహకరించని బాబు... పరిస్థితి తీవ్రమే: వైద్యులు... 309 సెక్షన్ కింద కేసు .... పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ.....
హైదరాబాద్, డిసెంబర్ 20: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రైతులకు న్యాయం చేయాలంటూ గత నాలుగు రోజుల నుంచి నూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష జరుపుతున్న చంద్రబాబునాయుడును సోమవారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకుని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో దీక్ష కొనసాగుతున్నట్టు బాబు ప్రకటించారు. వైద్య చికిత్సకు ఆయన సహకరించడం లేదు. బాబు ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా బిపి, షుగర్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. చికిత్సకు సహకరించాలని కోరారు. తన దీక్ష కొనసాగుతుందని తనను కలిసిన పార్టీ నాయకులతో బాబు తెలిపారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి నుంచే దీక్షా భగ్నానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ కార్యకర్తలు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టిడిపి నాయకులు తర్జనభర్జనలు పడుతుండగా, అర్ధరాత్రి వెనక్కి వెళ్లిన పోలీసులు తెల్లవారు జామున నాలుగున్నర ప్రాంతంలో వెనక గేటు నుంచి పెద్ద సంఖ్యలో శిబిరం వద్దకు ప్రవేశించారు. కొంత మంది నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి టిడిపి అధినేతను ప్రత్యేక అంబులెన్స్‌లోకి చేర్చి నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాబు పోలీసులతో కొద్దిసేపు పెనుగులాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందంటూ ఆస్పత్రికి రావడానికి నిరాకరించారు. దాంతో పోలీసులు బలవంతంగా ఆయన్ని ఎత్తుకెళ్లి స్ట్రేచర్‌పైకి చేర్చారు. ఈ దశలో జరిగిన పెనుగులాటలో బాబు స్ట్రెచర్ పైన కాకుండా కింద కూలబడ్డారు. పోలీసులు బాబును స్ట్రెచర్‌పై పడుకోబెట్టి బలవంతంగా ప్రత్యేక అంబులెన్స్‌లో నిమ్స్‌కు తరలించారు. ఇదే సమయంలో బాబు కుమారుడు లోకేశ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం తోపులాటలో కింద పడ్డారు. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దశలో కొందరు కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలు విసిరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ జరిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కింద చంద్రబాబుపై 309 సెక్షన్ కింద, మిగిలిన కార్యకర్తలు, నాయకులపై 353 సెక్షన్ కింద సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అయితే టిడిపి నాయకులు మాత్రం చంద్రబాబును అమానుషంగా లాక్కెల్లారని, ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ చేశారని ఆరోపించారు.
చంద్రబాబు దీక్షను భగ్నం చేసినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని టిడిపి మిత్రపక్షాల నాయకులు నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన టిడిపి మిత్రపక్షాల సమావేశంలో సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమవారం మండల కార్యాలయాల్లో కార్యకలాపాలను స్థంబింపజేయాలని నిర్ణయించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోతే గురువారం రాష్ట్రంలో అన్ని రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించినట్టు దేవేందర్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, సిపిఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈనెల 23న లక్షలాదిగా జనం రోడ్లపైకి వచ్చి రహదారులను దిగ్బంధం చేయాలని, పాలనను స్థంబింపజేయాలని పిలుపును ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం తాము డిమాండ్లకు మద్దతు ఇస్తున్నాం కానీ ఆందోళనలో పాల్గొనడం లేదని లోక్‌సత్తా తెలిపింది. సోమవారం జరిగిన బంద్‌ను లోక్‌సత్తా వ్యతిరేకించింది అయితే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొని డిమాండ్లకు మద్దతు తెలిపింది.
ఆస్పత్రి వద్ద హంగామా....
నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న చంద్రబాబును చూసేందుకు వివిధ జిల్లాల నుంచి టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో నిమ్స్‌కు తరలి వచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్దన్‌లు పార్టీ శ్రేణులతో కలిసి నిమ్స్‌కు వచ్చారు. పోలీసులు వీరిని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నిమ్స్ ముందు గుమికూడడంతో రోగులు లోనికి బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం దీక్షను భగ్నం చేయడానికి ముందు కనీసం ఒక మంత్రిని ప్రతినిధిగా పంపి డిమాండ్లపై చర్చలు సాగించాల్సిందని టిడిపి నాయకులు ఎర్రంనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు సూచించారు. నిమ్స్‌లో ఉన్న చంద్రబాబును పలువురు నాయకులు పరామర్శించారు. అజిత్‌సింగ్, బిజెపికి, జెడియుకు చెందిన బీహార్ నాయకులు నిమ్స్‌కు వచ్చి బాబును కలిశారు. ఎజిపి నాయకుడు జోసెఫ్, ఆర్‌ఎస్‌పి ఎంపీ అబానీరాయ్, మంద కృష్ణ మాదిగ నిమ్స్ ఆస్పత్రిలో చంద్రబాబును పరామర్శించారు. పాంథర్స్‌పార్టీ నాయకులు భీమ్‌సింగ్ , బిజెపి ఎంపి కల్‌రాజ్ మిశ్రా ఇతర పార్టీల నాయకులు నిమ్స్‌కు వచ్చారు.
చికిత్సకు ససేమిరా...
నిమ్స్ డాక్టర్లు అందిస్తున వైద్య సేవలను చంద్రబాబు తిరస్కరిస్తున్నారు. రైతులకు సరైన న్యాయం చేసే వరకు దీక్ష విరమించేది లేదని చంద్రబాబు నిమ్స్ డాక్టర్లకు తేల్చి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన వైద్యం చేయించుకునేందుకు సహకరించడం లేదని నిమ్స్ డైరెక్టర్ పివి రమేష్ వెల్లండించారు. ఆయన వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకుని, అవసరమైన మందులు వేసుకోవాలని లేదంటే పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని ఆయన మీడియాతో చెప్పారు. డాక్టర్ శ్రీనివాస్ జనరల్ మెడిసిన్, డాక్టర్ వై. సత్యనారాయణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ శేషగిరి రావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కెవి దక్షిణామూర్తి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అజిత్ కుమార్‌ల బృందం పర్యవేక్షిస్తోందని అన్నారు.

‘దేశం’ అవిశ్వాస అస్త్రం ?

sleeping
రైతు సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అవమానకర రీతిలో భగ్నం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్ధమవు తున్నారు. అధికార పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను సద్వినియోగం చేసకుని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం భేటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్‌ నాయకులు వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

అంతర్గత కలహాలు, అధిపత్యపోరు సమస్యల్లో కూరుకు పోయి ఉన్న కాంగ్రెస్‌పై ఇక మానసిక యుద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రైతు సమస్యల నేపథ్యంలో వారి పక్షాన ఆందోళన కార్యక్రమా లను మరికొంత కాలం కొనసాగించాలని పార్టీ నాయ కత్వం నిర్ణయించింది. బాబు నిరాహారదీక్ష ద్వారా రైతాం గం నుంచి పెరుగుతున్న మద్దతును వినియోగించుకునే క్రమంలో, అటు కాంగ్రెస్‌-ఇటు జగన్‌ను ఏకకాలంలో దెబ్బతీయడంతో పాటు.. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు మానసిక మద్దతుదారులుగా ఉన్న టీఆర్‌ఎస్‌, పీఆర్పీని కూడా ఇరుకున పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

babu-deeksh 

ఫిబ్రవరిలో జరగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కాంగ్రెస్‌ లోని కుమ్ములాటను పరిశీలించి, దాని ఫలితంతో సరైన అంచనాతో వ్యూహరచన చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వం కూలిపోతుం దన్న బలమైన విశ్వాసం లేకపోయినప్పటికీ.. దాని ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకోవచ్చన్నది టీడీపీ వ్యూహంలాకనిపిస్తోంది.

ప్రధానంగా.. జగన్‌ ఆలోగా పార్టీ పెడతారని ఆశిస్తున్న టీడీపీ నాయ కత్వం.. తాను అసెంబ్లీలో సర్కారుపై అవిశ్వా సం పెడితే కాంగ్రెస్‌లో ఉన్న జగన్‌ మద్దతు దారులు అనివార్య పరిస్థితిలో కాంగ్రెస్‌కు వ్యతిరేక ఓటు వేయక తప్పదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. సుమారు 40-45 మంది ఎమ్మెల్యేలు సర్కా రుకు వ్యతి రేకంగా వ్యవహరించవచ్చని లెక్కలు వేస్తోం ది. ఒకవేళ జగన్‌ మద్దతు దారులయిన ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌కు వ్యతిరేక ఓటు వేయకపోతే అది జగన్‌కే నష్టమన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున, దానివల్ల తమకొచ్చే అదనపు నష్టమేమీ లేదని భావిస్తోంది.

babu-deeఇక వైఎస్‌ జీవించి ఉండగా, కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉన్న మజ్లిస్‌ సభ్యులు ఆయన మృతి చెందిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి అవలం బిస్తున్నారు. మజ్లిస్‌ నాయకత్వం జగన్‌తో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. అదే నిజ మయితే, సభలో అవిశ్వాస తీర్మాన సమ యంలో సర్కారుకు చిక్కులు తప్పక పోవచ్చం టున్నారు. పీఆర్పీ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి, సర్కారు ఆపదలో పడితే తాము రక్షిస్తామని రోశయ్య సీఎంగా ఉండగనే చిరంజీవి ప్రకటించినందున.. ఆ పార్టీ అవిశ్వాస సమయంలో కాంగ్రెస్‌కు అను కూలంగానే ఉంటుందని అంచనా వేస్తోంది.

అది కూడా ఒకందుకు తమకే మంచిదని, రానున్న ఎన్నికల్లోగా ఇక పీఆర్పీ ప్రతిపక్షం కాదని, దానికి రైతాంగ సమస్యలపై ఆసక్తి లేదని, అది అధికారపార్టీకి తొత్తేనన్న ప్రచా రం చేసేందుకు అసెంబ్లీ ఒక మంచి వేదికగా పనికి వస్తుందని టీడీపీ నేతలు విశ్లేషిస్తు న్నారు. అదీగాక.. అసలు పీఆర్పీలోనే జగన్‌ వైపు 12 మంది వెళతారన్న వార్తలను కూడా టీడీపీ పరిగణనలోకి తీసుకుంది.

babu-deeksha 

టీఆర్‌ఎస్‌ కూడా అవిశ్వాస సమయంలో కాంగ్రెస్‌కు అనుకూలంగానే వ్యవహరిస్తుం దని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తమపై ఉందని కేసీఆర్‌ గతంలోనే ఢిల్లీలో స్పష్టం చేసినందున, అవిశ్వాసం సమ యంలో టీఆర్‌ఎస్‌ తమ వైపు ఉంటుందని భావించడం కూడా అవివేకమంటున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ అవిశ్వాస సమయంలో సర్కారుపై మొగ్గు చూపినా తమకే లాభ మంటున్నారు. కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగుకు ఇదే నిదర్శనమని, టీఆర్‌ఎస్‌కు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న ప్రచారం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. 294 మంది ఉన్న సభలో వైఎస్‌ విజయలక్ష్మి రాజీనామాతో 293 మంది ఉన్నారు.

వారిలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ బలం 155, తెలుగు దేశం 91, పీఆర్పీ 18, టీఆర్‌ఎస్‌ 11, మజ్లిస్‌ 7, సీపీఐ 4, బీజేపీ 2, లోక్‌సత్తా 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ల బలం 3 ఉన్నాయి. వీరిలో జగన్‌కు మద్దతుదారు లుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 40గా భావి స్తున్నారు. అంటే కాంగ్రెస్‌ బలం 155 నుంచి 115కి పడిపోతుంది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షానికీ-కాంగ్రెస్‌కూ 24 మాత్రమే తేడా ఉంటుంది. అయితే ప్రస్తు తం ప్రచారం జరుగుతున్నట్లు 18 మంది ఉన్న పీఆర్పీ ఎమ్మె ల్యేలు 12 మంది జగన్‌ వైపు వెళితే కాంగ్రెస్‌కు 6గురు ఎమ్మెల్యేల బలం పెరుగుతుంది. అప్పటికీ కాంగ్రెస్‌ బలం 121 మాత్రమే. అప్పుడు కూడా టీడీపీ-కాంగ్రెస్‌ మధ్య తేడా 30 ఉంటుంది.7 గురు సభ్యులున్న మజ్లిస్‌ పార్టీ కనుక కాంగ్రెస్‌కు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే జగన్‌ మద్దతు దారుల బలం 59కు పెరుగు తుంది. వామ పక్షాలు, బీజేపీ కలిపితే టీడీపీ బలం 91 నుంచి 98కి పెరుగుతుంది. ముగ్గురు ఇండి పెండెంట్లు, ఒక లోక్‌సత్తా కలిపితే 161 కాంగ్రెస్‌కు వ్యతిరేకం, 121 అనుకూలంగా బలాలు తారుమారవుతాయి.

babu-deeksha-5
 
ఒకవేళ టీఆర్‌ ఎస్‌ గనుక కాంగ్రెస్‌కు మద్దతు నిస్తే దాని బలం 132కు మాత్రమే పెరిగే అవ కాశం ఉంది. నిజంగా ఇదంతా జరిగితే కాం గ్రెస్‌ ప్రభుత్వం 29 ఓట్లతో కుప్పకూలి పోవ డం ఖాయమన్న విశ్లేషణలు జరుగు తున్నా యి. ప్రధానంగా.. జగన్‌ వర్గం అవిశ్వాస తీర్మాన సమయంలో ఆత్మ ప్రబోధానుసారం మేరకు ఓటు వేయాలని పిలుపునిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడక తప్పదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. గతంలో వివి గిరి ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ కూడా ఇలాంటి పిలుపునే ఇచ్చి.. తాను నిలబెట్టిన నీలం సంజీవరెడ్డిని ఓడించిన విషయం తెలిసిందే. రేపు శాసన సభలో కూడా జగన్‌ ఇలాంటి ఎత్తుగడ అను సరిస్తారని టీడీపీ నాయకత్వం ఆశిస్తోంది.

ఇద్దరూ కలిస్తే కాంగ్రెస్‌ కొంప కొల్లేరే ....

 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభు త్వంపై టీడీపీ అవిశ్వాసం పెట్టే సమయంలో జగన్‌ వర్గం, ఆయనకు మద్దతునిస్తున్న 40 మంది ఎమ్మెల్యేలు (ప్రస్తుతానికి), 7 మంది మజ్లిస్‌, 12 మంది పీఆర్పీ, ఐదుగురు వామ పక్షాలు, ఇద్దరు బీజేపీ, ముగ్గురు స్వతం త్రులు, ఒక లోక్‌సత్తా కలసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రైతుల కోసం ఒక కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ వ్యతిరేక కోణంలో టీడీపీ- జగన్‌ మద్దతుదారులు ఒక తాటిపైకి వస్తారా అన్నదే సందేహం. దానిపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది.

నేను రైతు బిడ్డను * నేను అనని మాటలను అంటగట్టారు.. * అన్నదాతకు దూరం చేసే యత్నమిది

నా తల్లిదండ్రులు నేల తల్లిని నమ్ముకున్నారు..
వారి రుణం తీర్చుకునేందుకే ఈ పోరాటం
న్యాయం జరిగేదాకా వెనక్కి తగ్గేది లేదు..
అంకెల గారడీతో దగా చేస్తున్న ప్రభుత్వం
రుణాల రీషెడ్యూల్‌పై మాయమాటలు..
2007 నాటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పుడిచ్చారు
పనలపై తడిసిన ధాన్యానికి బీమా వర్తిస్తుందా?..
రాయితీ కోరితే రాజకీయం చేసినట్లా?
సర్కారుపై చంద్రబాబు ధ్వజం.. రైతులకు బహిరంగ లేఖ
" నేను అనని మాటలను నాకు అంటగట్టారు. నన్ను రైతుల నుంచి దూరం చేసే దుర్మార్గం చేశారు. నా తల్లిదండ్రులు ఆఖరి శ్వాస వదిలే వరకు నేల తల్లిని నమ్ముకున్నారు. అన్నదాతల ఆక్రోశం కలచి వేస్తోంది. ఒక రైతు బిడ్డగా వారి రుణం తీర్చుకునేందుకే నా పోరాటం. అందుకే గాంధీజీ చూపిన బాటలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను '' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.

రైతుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. శనివారం సీఎం కిరణ్‌కుమార్ రాసిన లేఖలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ 'ఇవీ అసలు వాస్తవాలు' అని అంకెలతో సహా వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు, బాధితులకు సరైన పరిహారం లభించే వరకు తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. మనో స్థైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇదీ బాబు లేఖ సారాంశం...

"ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల వర్కింగ్ గ్రూపు ప్రధానికి సమర్పించిన నివేదికలో ఎకరాకు రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని, పెట్టుబడికి 50 శాతం అదనంగా లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, 4 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని సిఫార్సు చేశాయి. మేమూ ఇవే డిమాండ్లు చేస్తున్నాం. మాది రాజకీయం అవుతుందా? వరి పనలు పొలం మీద ఎండుతున్నప్పుడు వర్షానికి పాడైతే బీమా వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏవిధంగా, ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలి.

కరవు వచ్చినప్పుడు 30 శాతం రుణాలు కూడా రీషెడ్యూల్ చేయించలే ని ప్రభుత్వం... మరోసారి రీ షెడ్యూల్ అంటూ మభ్యపెడుతోంది. టీడీపీ హయాంలో అమలు చేసిన సంస్కరణలు, ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్లే ఉచిత విద్యుత్తుకు ఆలంబన అయ్యాయి. కానీ, కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సంస్థలను దివాలా తీయించారు. అందుకే... 9 గంటల ఉచిత విద్యుత్ ఒక మిథ్యగా మారింది. ఎన్టీఆర్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం... దేశంలో మొదటిసారిగా రుణాలు రద్దు చేసిందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల వరకు ధాన్యం తడిసిందని అంచనా.

ప్రస్తుతం 4 నుంచి 10 శాతానికి మాత్రమే సడలించారు. మా హయాంలో 24% సడలింపు ఇచ్చి, మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేశాం. ఇప్పుడు అలా ఎందుకు చెయ్యరు? కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, గోదాములు ఖాళీ చేయించకుండా, ఎగుమతులకు అనుమతులు తెప్పించకుండా మొత్తం ధాన్యాన్ని కొంటామంటూ రైతులను దగా చేస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలద్వారా పత్తి క్వింటాలుకు రూ.4500 చెల్లించాలన్నా దిక్కులేదు.

చెరుకుకు టన్నుకు రూ.2500 చెల్లించాలని సిఫార్సు చేసిన సమాధానం లేదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ చర్యలు తీసుకున్నా... ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడంలేదు? 2007లో చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పుడు ఇచ్చారు. చేనేత, మత్స్య, గీత, ఇతర చేతి వృత్తుల వారికి ఎన్యుమరేషన్ చేయకుండానే పరిహారం పెంచామంటున్నారు. రైతు పుట్టెడు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా పార్టీ మీటింగులని, పదవులని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.

గత ఆరున్నరేళ్లలో జలయజ్ఞం, మేఘమథనం, విత్తనాల స్కామ్, మిక్సింగ్ ప్లాంట్ల అక్రమాలు, ఆదర్శ రైతులు బాగోతం, బయో డీజిల్ మొక్కల పెంపకం అన్నింటిలోనూ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ధాన్యం తడిసి, రంగుమారి, మొలకలు వచ్చి ముక్కిపోతుంటే కొనే నాధుడు లేక రైతు మనోనిబ్బరం కోల్పోతున్నాడు. ఈ మొండి ప్రభుత్వం మెడలు వంచే దాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు''.
click here

రైతుకు న్యాయం జరిగేవరకూ నిరాహారదీక్ష ఆగదు...

నన్ను బలవంతంగా ఎత్తుకువచ్చారు,
ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం,
ప్రభుత్వపద్ధతిపై చంద్రబాబు ఆగ్రహం.

రైతు సమస్యలు తీరేవరకూ నిరాహారదీక్ష ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు స్పష్టం చేశారు. సోమవారం తె ల్లవారుఝామున పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకువచ్చారని, ఇది పోలీసుల దమననీతికి నిదర్శనం అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రే మూడుసార్లు ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు తమ వ్యూహాన్ని వాయిదా వేసుకున్నారు. అనంతరం తెల్లవారుఝామున పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులమధ్య బాబును అరెస్టు చే సి నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో సైతం బాబు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష విరమించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆయన త్రోసిపుచ్చారు. రైతులకు న్యాయం జరిగేవరకూ దీక్ష కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఆస్పత్రినుంచే బాబు రైతులకు ఒక బహిరంగా లేఖ రాస్తూ ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని, తెలుగుదేశం మీ వెన్నంటి ఉంటుంది అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని సంఘటితంగా ఎదిరించి డిమాండ్లు సాధించుకుందాం అని కూడా ఆయన ఆ లేఖలో పిలుపు ఇచ్చారు.

హైడ్రామా నడుమ చంద్రబాబు దీక్ష భగ్నం, అరెస్టు
క్షీణించిన ఆరోగ్యం.. నిమ్స్‌కు తరలింపు

రైతు సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. అనంతరం అరెస్ట్ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణంచటంతో నిమ్స్‌కు తరలించారు. చంద్రబాబును తరలిస్తున్న సమయంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.

నేతలు పోలీసులను అడ్డుకోవడంతో స్వల్ప లాఠీచార్జీ జరిగింది. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు గాయాలయ్యాయి. ఈ తోపులాటలో చంద్రబాబు తనయుడు నారాలోకేష్ నాయుడుని కూడా పోలీసులు ఈడ్చీవేశారు. దీంతో లోకేష్ నుదిటిపై స్వల్పగాయమయింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పోలీసులు నిర్లక్షంగా ప్రవర్తించడంతో ఆయనను స్ట్రెచర్‌పై తరలిస్తుండగా జారిపడ్డారు.

బాబుపై ఐపీసీ సెక్షన్ 309 కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయగా, అరెస్ట్‌ను అడ్డుకున్నందుకుగాను నారా లోకేష్, దీక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి నుంచి దీక్షా శిబిరం వద్ద పోలీసులు జరిగిన ఘటనకు, అరెస్టులు, కేసుల నమోదుకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, సోమవారం రాష్ట్రవ్యాప్తబంద్‌కు పిలుపునిచ్చారు.

కాగా చంద్రబాబు అరెస్ట్‌ను సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్ పార్టీ నేతలు ఖండించారు. ఈరోజు బంద్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నారాయణ, రాఘవులు, మందకృష్ణ మాదిగలు పిలుపు నిచ్చారు.
 బాబు దీక్షా శిబిరం మహోద్రిక్తం
Babu-sleep 
చంద్రబాబు దీక్ష ఆదివారం అర్థరాత్రి మహోద్రిక్తానికి దారి తీసింది. దీక్ష మూడు రోజులు పూర్తి కావడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి కాలేయానికి, మూత్రపిండానికి సంబంధించిన వ్యాధులకు పరిస్థితి దారి తీయవచ్చని, పరిస్థితి చేయి దాటక ముందే ఆస్పత్రికి తరలించడం మంచిదన్న హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెనువెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో సంప్రదింపులు జరిపిన పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారు.

press-corwdఇందుకు సీఎం, ఉప సభాపతి సమ్మతించడంతో దీక్ష భగ్నం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో బాబును ఆస్పత్రికి తరలించేందుకు చకచకా ఏర్పాట్లలో మునిగి తేలారు. పోలీసుల చర్యలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకూ తమ అధినేతను ఇక్కడి నుండి తరలించేందుకు వీల్లే దంటూ భద్రతా వలయంగా ఏర్పడి పోలీసులకు తీవ్ర ఆటంకం కల్గించారు. అర్దరాత్రి 12 గంటల ప్రాంతంలో దీక్ష శిబిరానికి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. అంతే కాకుండా దీక్షా శిబిరం నుండి ఒక్కొక్కరినీ ఖాళీ చేయించే యత్నాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అటు పోలీసులు, ఇటు దేశం నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది.బాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తాము దీక్షను భగ్నం చేస్తున్నామని, అందుకు సహకరించాలంటూ పోలీసులు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను అభ్యర్థించడం కనిపించింది.

Jr-ntr 

అయితే పోలీసుల విజ్క్షప్తిని తోసిపుచ్చిన ప్రజాప్రతినిధులు దీక్షను కొనసాగనివ్వండంటూ అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో పరిస్థితి మహోద్రిక్తంగా మారింది. ఏ క్షణంలోనైనా దీక్ష భగ్నం కావచ్చన్న సంకేతాలను పోలీసులు తమ చర్యల ద్వారా స్పష్టం చేయడం గమనార్హం. అయితే పోలీసులు లాఠీ ఛార్జీ చేసినా, మరేదైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొక తప్పదన్న పరిస్థితి దీక్షా శిబిరం వద్ద నెలకొంది. మొత్తం మీద దీక్ష భగ్నం ఉదంతంలో ఏ లాంటి హింసకు పాల్పడకుండానే చంద్రబాబు ఆస్పత్రికి తరలిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

Sunday, December 19, 2010

బాబుపై రైతు ముద్ర

babu-showingకాలం చాలా విచిత్రమయింది. అందులో రాజకీయాల్లో ముద్రలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. వాటిని చెరిపేసు కోవడం, నిలబెట్టుకోవడం ఆయా నేతల వ్యూహాలు, ఎత్తు గడ, వైఖరి బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలో ఇది నిజమవుతోంది. ఒకప్పుడు వైఎస్‌ వ్యూహాత్మక దాడి పుణ్యాన రైతు వ్యతిరేకిగా, ఎక్కడా అధికారికంగా వ్యవ సాయం దండుగ అని ప్రకటించకపోయినప్పటికీ, దాదాపు ఆరేళ్లు అలాంటి అపవాదు ఎదుర్కొన్న బాబు.. ఇప్పుడు ఆ వ్యతిరేక ముద్రను తొలగించుకుని, రైతుల కోసం పోరాడే నేతగా ముద్రపడేందుకు చేసిన శ్రమ ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొంగిచూస్తోంది.

గత 15 నెలల నుంచి రాష్ట్రంలో వరస వరస వెంట వచ్చిన తుపాన్లు, వరదలు, భారీ వర్షాలతో గుండెకోతకు గురయిన రైతాంగం కోసం బాబు పోరాడటం ప్రారంభిం చారు. ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందుగా వర్షం బాధితుల వద్దకు వెళ్లి వారి పక్షాన నిలుస్తుండటంతో క్రమంగా తనపై ఉన్న రైతు ముద్రను తొలగించుకోవడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్‌ ప్రభు త్వం కూడా రాజకీయ అంతర్గత కలహాలలో మునిగి, రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుండటం టీడీపీకి కలసివచ్చింది.

babu-readఅయినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ గతంలో బాబుపై తాను వేసిన రైతు వ్యతిరేక ముద్రను తరచూ గుర్తు చేసి, ఎదురుదాడి చేసినప్పటికీ, బాబు రైతాంగం వద్దకు వెళ్లిన ప్పుడు అక్కడ ఆయనకు సానుకూల స్పందన లభించటం తో అధికార పార్టీ ఎదురుదాడికి పస లేకుండా పోయింది. బాబు వ్యవసాయం దండుగ అన్నారని కాంగ్రెస్‌ నేతలు దాడి చేయడం, ఆ వ్యాఖ్య ఎప్పుడు చేశారో చెప్పాలని టీడీ పీ ఎదురుదాడి చేసినా కాంగ్రెస్‌ నేతలు మౌనంగా ఉండ టమే రైతుల్లో వచ్చిన మార్పునకు కారణంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ స్థాయిలో వ్యక్తిగత ఆక ర్షణ, ఇమేజ్‌ లేకపోయినా, ఇటీవల కురిసిన జల్‌ తుపాన్‌ బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన బాబుకు ఉభయ గోదావరి వంటి జిల్లాల్లో రైతాంగం తెల్లవార్లూ ఆయన కోసం ఎదురుచూసి, ఆయనను తమ పొలాల్లోని నడిపించిన వైనం పార్టీ నేతలనే విస్మయపరి చింది. దానిని పరిశీలిస్తే బాబుపై గతంలో ఉన్న రైతు వ్యతిరేక ముద్ర పూర్తిగా చెరగడమే కాకుండా, రైతులు బాబుపై ఆశలు పెంచుకున్నట్లు స్పష్టమవుతుంది.

తాజాగా శాసనసభ వేదికగా అధికారపార్టీ- తెలుగు దేశం పార్టీకి మధ్య జరిగిన రైతు యుద్ధంలో టీడీపీ వీల యినంత ఎక్కువ మైలేజీ సాధించే ప్రయత్నంలో విజయం సాధించింది. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బాబు సభలో చేసిన హడావిడి, ఆ తర్వాత ప్రారంభించిన నిరాహార దీక్షతో రైతాంగంపై తన ముద్ర వేసేలా సఫలీకృ తులయ్యారు.

Tdp-mlasగత రెండురోజుల నుంచి బాబు ప్రారంభిం చిన దీక్షకు తెలంగాణ రైతాంగం నుంచి విపరీతమైన స్పం దన వ్యక్తం కావడం పరిశీలిస్తే.. బాబుపై రైతు ముద్ర ప్రారంభమయిందని స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నాటి ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం టీడీపీకి వ్యతిరేంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తెలంగాణ రైతాం గం స్వచ్ఛందంగా బాబు దీక్షా శిబిరానికి తరలిరావడం వారిలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తెలం గాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌, తెలంగాణ బీసీ ఫ్రంట్‌, తెలం గాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక వంటి ప్రజాసం ఘాలు బాబు దీక్షకు మద్దతునివ్వటం కొత్త పరిణామం.

బాబు దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాం గ్రెస్‌- పీఆర్పీ విమర్శించినప్పటికీ, దీక్షా శిబిరానికి హాజ రవుతున్న రైతాంగం, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘా ల నాయకులు దీక్షక మద్దతునిస్తున్నారు. బాబుకు వ్యక్తి గత మద్దతు కంటే రైతాంగం కోసం ఆయన ఎన్నుకున్న మార్గానికే ఇంత అనూహ్య స్పందన లభిస్తుందనేది నిర్వి వాదం. దీక్షా శిబిరానికి జాతీయ నాయకులయిన ప్రకాష్‌ కరత్‌, బర్దన్‌, దేవెగౌడ, రాజా వంటి ప్రముఖులు హాజరై, బాబు ఒంటరివాడు కాదని, రైతు సమస్యలు పరిష్కరిం చకపోతే బంద్‌కూ పిలుపునివ్వక తప్పదని హెచ్చరించిన తీరు.. బాబుకు జాతీయ స్థాయిలో కూడా రైతునేతగా ఆద రణ పెరుగుతున్న విషయాన్ని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tdp-mlas,-ledyబాబు దీక్షతో తమ పార్టీకి గ్రామ స్థాయిలో రైతాం గం దగ్గరవుతోందని, జిల్లాల్లో బాబుకు మద్దతుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ రైతులు ఆందోళన కార్యక్రమాల్లో హాజరవుతుండటం సా నుకూల పరిణామాలేనని పార్టీ సీనియర్లు వివరిస్తున్నారు. గతంలో రైతుల పక్షాన తాము చేసిన పోరాటాలకు తమ పార్టీకి చెందిన సానుభూతిపరులు మాత్రమే హాజరయ్యే వారని, ఇప్పుడు సాధారణ రైతులు, రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధం లేని రైతులు కూడా రావడం తమ పార్టీకి గ్రామ స్థాయిలో అదనపు బలం ఇచ్చినట్టయిందన్న ఉత్సాహంతో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు.

ఈ మౌనం దారుణం

Babu-laughఆంధ్రప్రదేశ్‌లో రైతుల సమస్యలపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మౌనం పాటిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో ఘాటుగా విమర్శించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 62 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో 42 మంది ఆత్మహత్యలు గత మూడు రోజుల్లోనే చోటు చేసుకున్నాయని బాబు తన లేఖలో పేర్కొన్నారు. ‘తుపాన్‌లు, భారీ వర్షాలవల్ల ఈ ఖరీఫ్‌లో రైతాంగం బాగా దెబ్బతిన్నదన్నారు. ‘రైతులకు ధైర్యం చెప్పేందుకు నేను ఇటీవల రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాను. వారింత దైన్యస్థితిలో ఉండడం ఇదివరకెన్నడూ చూడలేదు. నేను వెళ్లిన ప్రతిచోటా రైతులు కన్నీళ్లు లపెట్టుకొన్నారు. పాడైన పంటను చూపించారు.

వారి పరిస్థితి చూసి చలించిపోయాను. రైతుల్ని ఆదుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. ఇందుకు నిరసనగా నేను 2010 డిసెంబర్‌ 17 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లోవ్యవసాయంపై వ్యయం పెరిగిందని, కానీ రైతు ఆదాయం కుంటుపడిందని వివిధ సర్వేల వల్ల తెలిసిందన్నారు. వ్యవసాయానికి కావలసిన ముడి సరకులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించడంలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్ని పునః పరిశీలించాల్సిన అవసరముందన్నారు.

వ్యవసాయం ఆదాయాన్ని చేకూర్చే రంగంగా మారకపోతే, జాతీయస్థాయిలో ఆహార భద్రతకే సవాల్‌ కాగల ప్రమాదముందని చంద్రబాబునాయుడు ఆ లేఖలో హెచ్చరించారు.వ్యవసాయాభివృద్ధికి స్వామినాథన్‌ కమిషన్‌ వంటి కమిటీలు చేసిన సిఫార్సుల్ని బాబు ప్రశంసించారు. ఇటీవలి కాలంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని, ఇందువల్ల వ్యవసాయాన్ని ఆదాయాన్నిచ్చే వృత్తిగా మార్చే అవకాశం ఉందని బాబు ప్రధానికి సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇస్తున్న నష్టపరిహారం, సబ్సిడీలు ఏమాత్రం సరిపోవడం లేదని, మారిన కాలానికి అనుగుణంగా, అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు అందించే నష్టపరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని బాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం రైతు ప్రకృతి దయమీద, వడ్డీ వ్యాపారుల పైనా, వ్యవసాయంలో పురాతన పద్ధతుల మీదా ఆధారపడాల్సి వచ్చేది, స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రైతు మళ్లీ అదే పరిస్థితికి దగ్గరవుతున్నాడని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కష్టంలో ఉన్న రైతును ఆదుకోవాలని, సహాయ ప్యాకేజీని పెంచాలని ప్రభుత్వానికి నచ్చచెప్పేందుకు మేం ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కనుక, రైతుల్ని ఆదుకోవాలని, వారిని సంక్షోభం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మరో విషయం...వ్యవసాయం లాభదాయకమని రైతులు తెలుసుకొని, చైతన్యం పొందేందుకు, దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులపై చర్చకు పిలుపునివ్వాల్సిందిగా కోరుతున్నాను’ అని చంద్రబాబునాయుడు ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

చాలా చేశాం ఇంకా చేస్తాం
CM-Kiran-Kumar-Reddyహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడతాయని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫ లం అయిందని ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ రాజకీయాలని ఆయన స్పష్టంచేశారు. రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని, సేద్యం దండుగ కాదు పండుగ అని నిరూపించిన వ్యక్తి రైతు బాంధవుడు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చూపిన బాట, చెప్పిన మాట మాకు ఆదర్శమని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులపై ప్రభుత్వం తీసు కుంటున్న సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రైతు సోదరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం మీడియాకు విడుదల చేసింది.

గత 15 నెలల్లో వరుసగా ఐదుసార్లు సంభవించిన వరదలు, భారీ వర్షాలు, తుఫానుల వల్ల రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టంవాటిల్లిందని, వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం స్వేదాన్ని ధారపోసి చేసిన సేద్యం పంట ఫలాలు నీటిపాలయ్యాయని ఇటాంటి పరిస్ధితుల్లో రైతులు ఆత్మస్ధైర్యంతో ఉండాలన్నారు. ఇది రైతు ప్రభుత్వం, రైతు మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వమని రైతు సంక్షేమంపై దృష్టిపెడుతుందని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దాదాపు 28 లక్షల రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, రూ.1250 కోట్ల విద్యుత్‌ బకాయిలు రద్దుచేయడం జరిగిందన్నారు. గ్రామం ఒక యూనిట్‌గా పంటలభీమాను అమలు చేస్తున్నామన్నారు. 2004-05 నుంచి ఇప్పటివరకు 36.5 లక్షల రైతులకు లబ్ధి చేకూరేలా మొత్తం రూ.2700 కోట్లు పంట భీమా కింద చెల్లించామని, రైతులకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేసి 2004-05 నుంచి ఇప్పటివరకు 5.83 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.1,61,100 కోట్లు చెల్లించా మని లేఖలో పేర్కొన్నారు.

(2004లో రూ.13620 కోట్లు, 2009లొ రూ.37574 కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో (2010-11) ఇప్పటివరకు రూ.27,652 కోట్లు పంటరుణాలు ఇచ్చామన్నారు. రుణమాఫీ కింద 2008-09లో 64 లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభు త్వం రూ.11350 కోట్లతో రైతులకు లబ్దిచేకూర్చిం దన్నా రు. కేంద్ర వడ్డీ మాఫీ, రుణ మాఫీ వర్తించని 32 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల మేరకు ఆర్ధికసాయం అందిం చింది. వీటితోపాటు రైతు మెచ్చే జలయజ్ఞం ద్వారా భవిష్యత్తులో కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని సీఎం లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఈ పధకం కిం ద దాదాపు 20 లక్షల ఎకరాల ఆయకట్టు ను లతఅభివృద్ధి చేశామన్నారు. వీటి కారణం గానే రికార్డుస్ధాయిలో 204 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ దిగుబడులకు సాధ్య మైందన్నారు. అయితే దురదృష్టవశాత్తు పలు పర్యాయాలు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మనకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయినా ఆత్మవిశ్వా సంతో రైతు సం క్షేమంకోసం మరింతగా కృషిచేస్తున్నా మని, రైతులకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యతగా సీఎం తెలిపా రు. ఇదిలాఉంటే గత టీడీపీ హయాంలో వరి, ప్రత్తి, వేరుశనగ, మిరప, కూరగాయలు, ఉల్లి, బొప్పాయి, కర్బూజ వంటి పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు రూ.1500 గా ఉండేదని, రూ.4500 లకు పెంచామన్నారు.

కాగా ఇప్పుడు జరిగిన పంటనష్టం చూసిన తరువాత హెక్టారుకు రూ.6000 గా నిర్ణయించా మన్నారు. ఇదీ రైతు వ్యతిరేకులైనవారికి, రైతు శ్రేయోభి లాషులకు మధ్య తేడా అని సీఎం లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే రైతుల కోసం పాత బకాయిలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.695 కోట్లు విడు దల చేసిందన్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులం దరికీ కూడా పెట్టుబడి రాయితీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని, రబీ సీజన్‌లో సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామని సీఎం తెలిపారు. ఈ కఠోర వాస్తవాలు ఇలా ఉంటే రైతులు ఇబ్బందులో వున్నప్పుడు వారికి మనోస్థైర్యం చెప్పి రైతు లకు ఆసరాగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు చేస్తు న్న నిర్వాకమేమిటని సీఎం ప్రశ్నించారు.