Wednesday, December 21, 2011

రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ శకం

మంత్రివర్గం పేర్ల నా చేతే రాయించారు

  రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ శకం ఒకటుంది. తెలుగుదేశం ఏర్పాటు... తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపన దగ్గర నుంచి అనూహ్యంగా సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం దాకా - ఆ శకంలో జరిగినవన్నీ ఆసక్తికరమైన సంఘటనలే. వీటన్నింటిలోను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకమైన పాత్రలు పోషించారు. అలాంటి ఐపీఎస్ అధికారుల్లో హెచ్.జె. దొర ఒకరు. ఆయన ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను క్రోడీకరించి రాసిన పుస్తకమే- 'ఎన్టీఆర్‌తో నేను..' ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే - ఎన్టీఆర్ వ్యక్తిత్వమే కాదు ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వెనకున్న అసలు రహస్యాలు కూడా తెలుస్తాయి. ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం...


రాముని మించిన రాముదు..

గంభీరంగా కనిపించే తారక రామారావులోని లోపలి మనిషి వేరు. నిజానికి ఆయనది చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. భోజనాల దగ్గర అది స్పష్టంగా బయటపడుతుండేది. కుటుంబసభ్యులు వడ్డించకుండా నౌకర్లు వడ్డిస్తే ఆయన కోప్పడేవారు. అది ఆయనకు అస్సలు ఇష్టం వుండేది కాదు. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆయన సతీమణి శ్రీమతి బసవతారకం భోజనం క్యారియర్ తీసుకుని సచివాలయానికి వెళ్లి స్వయంగా వడ్డించేవారు. ఒకసారి ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి మరోచోటుకి బయల్దేరి వెళ్లాల్సిన సందర్భంలో ఇంటినుంచి క్యారియర్ వచ్చింది కానీ, తన కుటుంబసభ్యులు ఎవ్వరూ రాలేదు. దాంతో ఆయన ఇంటికి ఫోన్ చేసి తన ఆఖరమ్మాయితో 'నీవు రానందుకు భోజనం చేయలేదమ్మా' అని చెప్పి అలక ప్రదర్శించుకున్నారు. అంత సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా వుండేవారు ఎన్టీఆర్.

* * * చిత్రం.. భళారే విచిత్రం..
ఎన్టీఆర్‌కి కళలంటే మక్కువ ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా కళాకృతుల మీద, శిల్పాల మీద చూపు వుండేది. అవంటే చాలా ఆసక్తి. కొనడానికి ఎంత డబ్బు అయినా వెనుకాడేవారు కాదు. చాలామంది శిల్పకళాకారులు ఆయనకి తెలుసు. కర్నూలు, ఆళ్లగడ్డ నుంచి తరచూ శిల్పులు వస్తుండేవారు ఆయన దగ్గరకి.. తమిళనాడుకు చెందిన గణపతి స్థపతితో ఎన్టీఆర్ తరచూ సంప్రదిస్తుండేవారు. ముఖ్యమంత్రి అయ్యాక వీరందరికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో విరివిగా అవకాశం ఇచ్చారు. గణపతి స్థపతిని తన ఆస్థాన శిల్పిగా కూడా నియమించుకున్నారు.

చక్కని దస్తూరి ఎన్టీఆర్ సొంతం. ఆయన పేపరు మీద పెన్ను పెడితే అక్షరాలు ముత్యాల్లా మెరిసిపోతుండేవి. పాఠశాల రోజుల్లో సహవిద్యార్థులు తనతో పుస్తకాల అట్టల మీద పేర్లు రాయించుకునేవారని ఎన్టీఆర్ చెప్పుకునేవారు. స్వతహాగా తారకరాముడు మంచి ఆర్టిస్ట్. బాగా బొమ్మలు వేసేవారు. షూటింగ్‌లకోసం స్టూడియోలో సెట్టింగ్స్ నిర్మించేముందు ఎన్టీఆర్ కళాదర్శకులకి ముందే ప్లాన్ గీసిచ్చేవారు. తనకు ఎటువంటి సెట్స్ అవసరమో ముందే పేపర్ మీద ప్లాన్ గీసి ఇవ్వడం వల్ల ఆనక వారికి పని సులభంగా వుండేది. పైగా ఆ ప్లాన్ ప్రకారం అద్భుతమైన సెట్టింగ్స్ వచ్చేవి. భవనాలు, కట్టడాల విషయంలో ఎన్టీఆర్‌కు వెంకట్రామిరెడ్డి కన్సల్టెంట్‌గా వుండేవారు. వీళ్లిద్దరూ కలిశారంటే మయసభ తరహా భవన నిర్మాణాలు రూపుదాల్చేవి. రాష్ట్ర మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో హెడ్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డితో ఎన్టీఆర్ సెక్రటేరియట్‌లోని టెంపుల్ ఆర్కిటెక్చర్ పనులన్నీ శ్రద్ధగా చేయించారు. అలాగే బూర్గుల రామకృష్ణారావు భవనం, తెలుగు లలిత కళా తోరణం నిర్మాణపనులు కూడా ఆయన చేతుల మీదుగానే జరిగాయి.

* * * స్పెషల్ టీ పట్రా..
ఎన్టీఆర్ ఆఫీసు ఫైల్స్ చూస్తున్నారంటే అదొక అష్టావధానమే! రాఘవేంద్రరావు టూకీగా విషయాన్ని చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన దానిపై సంతకం పెట్టేవారు. ఫైల్‌కు ఫైల్‌కు మధ్య గ్యాప్‌లో జోక్స్ పేలుతుండేవి. ఇంతలో నేనో, మరొకరో రంగప్రవేశం చేసేవాళ్లం. మమ్మల్ని చూడ్డంతోనే ఆయన ఈ పూటకి ఇక ఫైల్స్ చాలండీ.. అనేవారు. వంటవాడిని పిలిచి స్పెషల్‌గా టీ చేసి పట్రా.. అని పురమాయించేవారు. ఈ విధంగా ఫైల్స్ చూసే కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయేసరికి ఆఫీసర్లంతా నన్ను తిట్టుకునేవారు. అసలు విషయం ఫైళ్లు చూడటము ఆయనకు అంత ఇష్టముండేది కాదు.

* * * అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేద్దాం...
1994 ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే నాకు ఎన్టీఆర్ నుంచి కబురు వచ్చింది వెంటనే రమ్మని.. నేను మర్యాదపూర్వకంగా వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి అభినందించాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. పదవీ ప్రమాణం చేయడానికి డిసెంబర్ 12వ తేదీ ఉదయం వేళలో ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తాన్ని పెట్టింది బి.వి. మోహన్‌రెడ్డి. ఆయనతోనే ముహూర్తం పెట్టించడం ఎన్టీఆర్‌కు సెంటిమెంట్. లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారమని చెప్పారు. ఆ ప్రదేశం అచ్చి రాలేదని ఇదివరకు ఎన్టీఆర్ అంటుండేవారు. అయినా ఈసారి కూడా అక్కడే ప్రమాణ స్వీకారమని అన్నారు.

సరే, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఎవర్ని పెట్టుకోవాలి? ఎవరైతే బాగుంటుందని నన్ను అడిగారు ఎన్టీఆర్. ఈ విషయం మీద కొంత తర్జనభర్జన జరిగింది. ఇంతకుముందు ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మసలిన ఆఫీసర్లు అందరూ సీనియర్ పొజీషన్లో ఎక్కడెక్కడో వున్నారు. సరైన వారు అని అనుకున్నవారంతా ఢిల్లీలో వున్నారు. వారిని రమ్మనడం సరైనది కాదు. నేను అన్నీ ఆలోచించి సిఎస్‌రావు పేరు సూచించాను. అయితే ఎన్టీఆర్ వెంటనే సుముఖత చూపలేదు. జయప్రకాశ్ నారాయణ్‌ను ఒక కార్యదర్శిగా తీసుకోవచ్చునని చెప్పాను. కానీ ఆయన గవర్నర్‌కు కార్యదర్శిగా వుంటున్నారు. అక్కడినుంచి వత్తిడిచేసి ఆయన్ని తీసుకురావాలి. ముహూర్తం తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే నేను ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి కలిశాను.

రండి.. కూర్చోండి అంటూ ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి చేసిన బందోబస్తు ఏర్పాట్లు గురించి చెప్పాలని నా ప్రయత్నం. కానీ, ఆయన నా మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేరు. మీరు వుండండి అంటూ నన్ను కూర్చోపెట్టేశారు. నాకు ఓ పక్క టెన్షన్ పెరిగిపోతోంది. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. సిటీ కమిషనర్‌గా అవతల బందోబస్తు వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యత నాపై వుంది. నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయి వున్నాను. ఎన్టీఆర్ వుండమంటున్నారు. ఎందుకో ఏమో తెలియదు. తప్పదు కదా! అలానే వుండిపోయాను. ఆయన తనను కలవడానికి వచ్చిన అభిమానులందరినీ పంపించేసి వచ్చి కూర్చున్నారు. ఇంతలో చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్ ఆయనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయారు. ఆయన కూడా చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయారు. బాబు అలా వెళ్లగానే ఎన్టీఆర్ నన్ను రమ్మని తనూ లోపలికి నడిచారు. అక్కడ ఇద్దరం కూర్చున్నాక నన్ను ఒక పేపర్ తీసుకోమని చెప్పారు.

"చెప్పండి.. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకుందాం..'' నేరుగా టాపిక్‌లోకి వచ్చేశారు. ఆశ్చర్యపోతూ అడిగాను- "అదేమిటీ...? ఇవాళ మీరొక్కరే కదా ప్రమాణం చేస్తున్నది..'' వెంటనే ఆయన రిప్లయ్.. "నోనో.. అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేద్దాం.. నాతోపాటు మరికొందరు కూడా ప్రమాణం చేస్తారు. మీరు ముందు పేర్లు రాయండి.''

ఆయన నిర్ణయానికి తిరుగులేదు కదా. జాబితా తయారుచేయడానికి సిద్ధపడ్డాను. అక్కడ మరో వ్యక్తి లక్ష్మీపార్వతి కూడా కూర్చుని వున్నారు. మా ఇద్దరి సంభాషణల మధ్య మూడో వ్యక్తి.. నాకు కాస్త ఇబ్బందిగానే వుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు వివరించే సమయంలో ముఖ్యమంత్రికి, మాకు మధ్య మరెవ్వరూ వుండేవారు కాదు. అసలు బయటి వ్యక్తులు ఎవరున్నా మేం విషయాలు చెప్పం. చివరికి ఆయనే చెప్పడం మొదలు పెట్టారు. ముందు చంద్రబాబునాయుడు పేరు చెప్పి రాసుకోమన్నారు. వివాదాస్పదం కాని వ్యక్తులు బి.వి. మోహన్‌రెడ్డి, అశోక్ గజపతిరాజు పేర్లు రాశాను.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, గుంటూరు జిల్లా నుంచి మాకినేని పెదరత్తయ్య, నల్గొండ జిల్లా నుంచి ఎం నర్శింహులు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇంద్రారెడ్డి, వరంగల్ నుంచి ప్రణయ్ భాస్కర్ (తన అభిమాని) పేర్లు రాశాను. అంతకుముందు ప్రతిపక్షంలో వున్నప్పుడు డిప్యూటీ లీడర్లుగా వ్యవహరించిన కోటగిరి విద్యాధరరావు, ఎ. మాధవరెడ్డి విషయంలో ఆయన పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇష్టం లేనట్టుగా 'తర్వాత చూద్దాం..' అనేశారు. ఈ పేర్లన్నీ టైప్ చేసి ప్రింటవుట్ తీసేందుకు అక్కడ టైపిస్ట్ కూడా ఎవరూ లేరు.

పుస్తకం: ఎన్టీఆర్‌తో నేను

రచయిత: హెచ్.జె.దొర, పేజీలు: 189

ధర: 90 రూపాయలు, ప్రచురణ: ఎమెస్కో

ప్రతులకు: 040 23264028

Tuesday, February 1, 2011

సోనియాకు డబ్బు పిచ్చి! వైఎస్ లాంటి అవినీతిపరులను పెంచి పోషించారు మన్మోహ న్ రబ్బర్ స్టాంప్

స్విస్‌బ్యాంక్ వివరాలు బయటకు రావాలి
మాఫియా డాన్‌లా ప్రభుత్వాలు
కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుభవం లేదు:చంద్రబాబు 
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బాగా డబ్బు పిచ్చి పట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ధన వ్యామోహంతోనే సోనియా రాష్ట్రంలో వైఎస్ వంటి వారిని పెంచి పోషించారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాఫియా డాన్‌లా మారాయని ఆరోపించారు. కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కర్నూలు జిల్లాకు వచ్చే ముందు ఆయన గుంతకల్లులో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'వైఎస్ హయాంలో మొదలైన అవినీతితో ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డికి రూ.లక్షకోట్లు సమకూరింది. 'సాక్షి' దినపత్రికకు రూ.1,256 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ప్యాకేజీలు కుదుర్చుకుని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మీడియా మాఫియా కూడా పెరిగిపోతోంది' అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ సోనియాకు రబ్బరు స్టాంపులా మారారని 

విమర్శించారు.

'నల్లధనాన్ని వెలికితీసేందుకు మన్మోహన్, సోనియా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేవలం విదేశీఖాతాల్లో ఉన్న సొమ్ముతోనే ఇంటికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వొచ్చు. స్విస్‌బ్యాంక్ ఖాతాల వివరాలు బయటకు రావాలి. నల్లధనం వెలికితీతపై తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచి భారతదేశ అభివృద్ధికి పోరాడుతుంది' అని బాబు స్పష్టం చేశారు. సేద్యాన్ని నమ్ముకున్న రైతుల కష్టాలపై తాను దీక్షలు, పర్యటనలు చేస్తున్నానని చెప్పారు.

అన్యాయం జరిగినా నోరు మెదపరేం?

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తీరని అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కోర్టుకు ఎ లా అప్పీలు చేయాలన్న దిశగా కూడా ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుభవం లేదన్నారు. 'మన ప్రాజెక్టులకు రావాల్సిన నీటిని ఎగువ రాష్ట్రాలు దోచుకుంటున్నా మన ప్రభుత్వం కనీసం నిలదీయలేకపోతోంది. లేని జలాలను ఉన్నట్టుగా చూపించిన వైఎస్.. జలయజ్ఞం పేరిట రూ.లక్షల కోట్ల మేరకు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో అందజేసి గుడ్‌విల్ దోచుకున్నారు' అని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి..
ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా ముద్రపడిన గుజరాత్, బీహార్ రాష్ట్రాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం రోజురోజుకూ దిగజారి పోతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు, విద్యార్థులకు కష్టాలు, కన్నీళ్లే మిగు లుతున్నాయన్నారు. కాగా పరిటాల రవీంద్రను హత్య చేయించడం వెనుక వైఎస్, ఆయన తనయుడు ఉన్నారని ఆరోపించారు. ఈ కేసులో చివరకు భానుకిరణ్‌ను కూడా చంపేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. మంగలి కృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నేను పిలుస్తా.. మీరు రోడ్లెక్కండి!
సమయం వచ్చినపుడు తాను పిలుపునిస్తానని, అప్పుడు సమస్యలపై రైతులు, విద్యార్థులు రోడ్లెక్కాలని బాబు పిలు పునిచ్చారు. సమస్యల పరిష్కారానికి అలా రోడ్లెక్కితేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. అనంతపురం జిల్లా రైతాంగం వరుస కరువులతో విలవిల్లాడుతుంటే ఆదుకునే ఆలోచనే లేదన్నారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని పీఆర్‌పీ, కాంగ్రెస్ దోస్తీని ప్రస్తావిస్తూ బాబు వ్యాఖ్యానించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు కే.ఈ ప్రభాకర్, కేఈ ప్రభాకర్, ఫరూక్, బీవీ మోహనరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, బీకే పార్థసారథి, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ ఘని, మీనాక్షినాయుడు, ఎమ్మెల్సీ మసాల పద్మజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు పాల్గొన్నారు.

Wednesday, January 12, 2011

ఇది చేతగాని ప్రభుత్వం

 
ఇది చేతగాని, సిగ్గులేని ప్రభుత్వం. అందుకే రైతాంగ సమస్యలపై స్పందిం చటం లేదని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతాం గ సమస్యలపైనా ఏ మాత్రం ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని, తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదు కోవాలని అసెంబ్లీలో పోరాటం చేసినా రైతు సమస్యలపై నిరవధిక దీక్షలు చేసి నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని చంద్రబాబు గుర్తుచేశారు. రైతుకోసం యాత్ర ముగించుకుని బుధవారం సాయంత్రం 3.15గంటలకు చంద్రబా బు ఎర్రుపాలెం చేరుకున్నారు.

టీడీపీ జిల్లా కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లు సండ్రా వెంకటవీరయ్య, ఊకే అబ్బ య్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటే శ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీ నారాయణ, పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమం తరావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎర్రుపాలెం జడ్పీ టీసీ చావా రామకృష్ణ, టీడీపీ నేతలు తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబా బు ఎర్రుపాలెంలో రైతులను, ప్రజలను ద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో ఆయన యాత్ర నిర్వహించి ప్రసంగించారు.

ఆ తర్వాత మధిర రైతు సదస్సులో పా ల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రైతు లు సంక్రాంతి పండుగను కూడా ఆనం దంగా చేసుకునే పరిస్థితి లేదని ఆవేద న వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి వంటి పంటలకు ఎకరాకు రూ.వేలల్లో పెట్టుబడులు పెడితే కనీసం రూ.10 వేలు కూడా పరిహారం అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమె త్తారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో పోరాడినా, నిరవధిక దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా ప్రభుత్వం ఆమోదించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభు త్వం సరైన వాదనలు విన్పించకపో వటం, పొరుగు రాష్ట్ర్లాలతో రాజీపడ టం వలననే ట్రిబ్యునల్ తీర్పు ఈ విధంగా వచ్చిందని, ఆ తీర్పు పర్య వసారాన్ని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు ఆల్మట్టి, ఆత రువాత బాబ్లీపై కొన సాగించిన పోరు ను సదస్సులో వివరిం చా రు. ప్రతిపక్షంలో ఉ న్నా కృష్ణాజలాల పరి రక్షణ కోసం పోరాటం సాగిస్తామని, రైతులు కూడా కదలిరావాలని సూ చించారు. నదీ జలాల్లో వాటా కో ల్పోతే చివరిభూ ములకు నీరు అం దక, రైతాంగం నష్టపోతుందని చెప్పారు.

వైఎస్ హ యాంలో జలయ జ్ఞంలో జరిగిన అవినీ తిని వివరించి, తద్వారా రైతులకు కలుగుతున్న నష్టాన్ని తెలిపారు. రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ పెంచే విషయంలో ము ఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి చొరవ చూపలే కపోతున్నారని, ఆయన ఎంతకాలం ఆ పదవిలో ఉంటారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న టెలి కాం, కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకో ణాలను ప్రస్తావించా రు. అవినీతి క్యా న్సర్‌లా పెరిగిపోతుం దని, యువత చూస్తూ ఊరుకుంటే సమాజం క్షమి ంచదన్నారు.

పెరిగిన నిత్యావసర ధర లను చెప్పుతూ ఉల్లి, వెల్లుల్లి ధరలను ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉల్లి కిలో రూ.4ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ హ యాంలో రూ.40కు అమ్ముతున్నారని, వెల్లులి అప్పుడు రూ.30 ఉంటే ఇప్పుడు రూ.300 అమ్ముతున్నారని వివరించారు. రైతు సదస్సు అనంతరం చంద్రబాబు బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి హైద్రాబా ద్‌కు తిరిగి వెళ్లారు. టీఆర్ఎస్ నిరసనలు.. లాఠీచార్జి చంద్రబాబు పర్యటనను అడ్డుకుం టామని ముందే ప్రకటించిన టీఆర్ఎస్ పని చేసింది. చంద్రబాబు మధిరకు చేరుకుంటున్న తరుణంలో మూలమ లుపు వద్ద వేచి ఉన్న టీఆర్ఎస్ కార్య కర్తలు గులాబీ కండువాలతో అకస్మా త్తుగా కాన్వాయికి అడ్డంగా దూసుకు వచ్చారు. టీడీపీ కార్యకర్తలు కూడా వారిపై దాడికి ప్రయత్నించారు. ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టీఆ ర్ఎస్ కార్యకర్తలను లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిం చారు. మధిర రైతు సదస్సులో కూడా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు నినా దాలు చేస్తూ నిరసన తెలియచే యబోగా, టీడీపీ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను సభాస్థలి నుంచి వెళ్లగొట్టడంతో సద్దు మణిగింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా మధిర నియోజకవర్గంతో పాటు జిల్లాలో పలు చోట్ల టీఆర్ఎస్ నాయకులను ముందుగానే అదుపు లోకి తీసుకున్నారు. 

అల్లుడికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్నంగా ఇచ్చాడు

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తన అల్లుడికి కట్నం కింద ప్రభుత్వ భూమి అయిన 1.50లక్షల ఎకరాల్లో ఖనిజసంపదను కట్నం కింద ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి బోనకల్ వచ్చిన చంద్రబాబు రోడ్‌షో కార్యక్రమంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 9సంవత్సరాలు పాటు సీఎంగా ఉన్న తనకు ఏ కోరికలు లేవని, మీ హృదయాల్లో చిరస్థాయిగా ఉండేందుకు ఈ పోరాటం చేస్తున్నానని తెలిపారు.

పేదరికం లేని సమాజాన్ని రూపొందించేందుకు కృషి చేస్తారన్నారు. ఢిల్లీలో దీక్ష చేసే అర్హత జగన్‌కు లేదని విమర్శించారు. ఢిల్లీని గజగజలాడించిన ఏకైక ఎన్టీఆర్ అని గుర్తు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తమ ప్రభుత్వ హయాంలో వెలుగెత్తి చాటామని తెలిపారు. సోనియాగాంధీకి డబ్బుపిచ్చి పట్టిందని, ఆ డబ్బుతో ఏంచేస్తుందో అర్థంకావటం లేదన్నారు.

సమాజంలో అన్ని సమస్యలకు కారణం అవినీతినని, ఇది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనని, వారి వద్దనున్న అవినీతి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. యువత అవినీతిపై విజృంభించాలని, నేను ముఖ్యమంత్రి కావటం కంటే రాష్ట్రం బాగుంటమే ముఖ్యమని తెలిపారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాను దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి మీ ఇంటికి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఒక్కసారి ఆలోచించిన తర్వాత నచ్చితే మీరు పదిమందికి చెప్పండి అని, ఆ పది మంది మరో పది మందికి చెప్పేటట్లు చేయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణపల్లి గ్రామానికి లిఫ్టు మంజూరు చేస్తా - చంద్రబాబు
మండలంలోని కలకోట, బ్రాహ్మణపల్లి, పెద్దబీరవల్లి,జానకీపురం గ్రామా ల్లో రోడ్‌షో ద్వారా కొద్దిసేపు బుధవారం రాత్రి ప్రజలనుద్ధేశించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. కలకోట గ్రామంలో ఓ పెద్దాయనను చూసి వయస్సు మీదపడినప్పటికీ ఎంతో ఓపికగా చల్లిలో జెండా పట్టుకుని ఎదురుచూస్తున్న ఆయన ఎదో కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు అనటంతో ఒక్కసారిగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు.

మరో మహిళను చూయిస్తూ ఆ ఆడబిడ్డ పాపాను ఎత్తుకుని ఎదురుచూస్తుందని అలాంటి పిల్లలను చదివించే బాధ్యతలను స్వీకరిస్తానని తెలిపారు. తమ పంటలపొలాలకు సాగునీరు కరువైందని, తమ గ్రామానికి లిఫ్టుమంజూరు చేస్తే పంటలకు నీరందుతుందని రైతులు చెప్పగా స్పందించిన చంద్రబాబు తప్పకుండా బ్రాహ్మణపల్లి గ్రామానికి చేస్తానని, ఆ బాధ్యతను తొందర్లోనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
Click Here!

సోనియాగాంధీకి డబ్బు పిచ్చి
babu-speak 
యూపీఏ అధినేత్రికి డబ్బుపిచ్చి పట్టిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, మధిర ప్రాంతాల్లో పర్యటించిన చంద్ర బాబు పంట నష్టం జరిగిన రైతులను ఓదార్చారు. అనం తరం మధిరలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడుతూ యూిపీఎ ప్రభుత్వం హయాంలో దేశం అవినీతిమయమైందన్నారు. టెలిఫోన్‌ కుంభకోణంలో 1.76 లక్షల కోట్ల అవినీతి బయటపడ్డా పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. కార్గిల్‌ అమరుల కుటుం బాలకు కేటాయించిన భూములను సైతం ఆక్రమించు కునేందుకు కాంగ్రెస్‌ నాయకులు పూనుకోవడం క్షమించరాని నేరం అన్నారు. పంటలు చేతికొచ్చే స్థితిలో నీటమునిగిన రైతులను ఆదుకోలేని దిక్కుమాలిన స్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరం అన్నారు.

తనతండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ మొత్తంలో దండుకున్న వైఎస్‌ జగన్‌ ఆ డబ్బుతో పరిశ్రమలు స్థాపించుకొని రాష్ట్రంలోని ప్రధాన వనరులను దోచుకుంటున్నా డన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిపై కమిటీ వేసి అడ్డుకట్టవేయకపోతే దేశసంపద అంతా అక్రమార్కుల చేతిలోకి చేరే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులు కృష్ణట్రిబ్యునల్‌తో ఎడారిగా మారే అవకాశం ఉందని, సాగు నీరు, తాగునీరుకు ఇబ్బంది కల్గుతుందని అన్నారు. నిత్యావ సర వస్తువులు ధరలు పెరగడంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యవసా యంపై అవగాహనలేదన్నారు. నాడు బాబ్లిగురించి పోరాడి తే కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు చేసుకున్నారని, కాంగ్రె స్‌ నాయకుల అసమర్థత వల్లనే కృష్ణా ట్రిబ్యులన్‌ తీర్పు వచ్చిందని అన్నారు.

ఈ తీర్పు మూలంగా కాంగ్రెస్‌ నాయ కులను చరిత్ర క్షమించదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతం పోరాటం సాగిస్తానని, చివరి రక్తం బొట్టు ఉన్నతం వరకు రైతుకోసం తపిస్తానన్నారు. పేదరికంలేని సమాజం చూడాలనేది తన తపన అన్ని బాబు అన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంిపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మె ల్యేలు తుమ్మల నాగేశ్వర్‌రావు, సండ్రావెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వర్‌రావు, బాలసాని లక్ష్మినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వర్‌ రావు, షోడే రామయ్య, కోనేరు నాగేశ్వర్‌రావు స్థానిక ఎంపిపి ఎ. లక్ష్మి, మద్దినేని బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.

Tuesday, January 11, 2011

రైతుకోసం పోరాటం

  'కృష్ణా జలాల విషయంలో మనకు అన్యాయం జరిగింది... న్యాయం కోసం పోరాటం చేస్తా. కొల్లేరు సమస్యలు పేదల కొంపలు ముంచు తున్నాయి... వాటి పరిష్కారానికి దారి చూపుతా. రాష్ట్రాన్ని అవినీతి తిమింగళాలు సర్వ నాశనం చేస్తున్నాయి... అవినీతిని పబ్లిక్ గానే కడిగి పారేద్దాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. '' అంటూ కృష్ణాజిల్లా పర్యటనలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై పైన, జగన్, సోనియా గాంధీల పైన ఆయన నిప్పులు చెరిగారు. బాబు కృష్ణాజిల్లా పర్యటనకు ఆనూహ్య స్పందన లభిం చింది. కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు, నియోజక వర్గాల్లో జరిపిన పర్యటనల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వైఎస్ అవినీతి పాలనతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలను తూర్పార పట్టారు. చంద్ర బాబు ప్రజలు, యువత, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తేనే సమస్యలు పరి ష్కార మవుతాయని, ప్రజాసమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ముందుం టుందని పేర్కొన్నారు.

తొలుత చంద్ర బాబు మాగంటి బాబు నివాసంలో తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంపై కొద్ది సేపు రోడ్ షో నిర్వహించారు. తరువాత స్థానిక పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండిపై రోడ్డుషోలో పాల్గొన్నారు. . కొల్లేటి వాసుల వెతలపై సభలో ఎమ్మెల్యే జయ మంగళ, మాగంటి బాబులు కొల్లేటి వాసులు ఎదుర్కొ ంటున్న సమస్యలను ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబును తగిన విధంగా స్పందించాలని కోరారు. ఆల్మట్టీ ఎత్తు పెంచేందుకు గతంలో దేవేగౌడ ప్రయత్నించారని, అయితే ఇతర రాష్ట్రాలనుంచి నిపుణులను రప్పి ంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆల్మట్టీ ఎత్తును 5119 మీటర్లకు పరిమితం చేశామని చంద్రబాబు తెలిపారు. టూజిస్పెక్ట్రం విషయంలో కేంద్రం సరైన విధంగా స్పందించలేదని, విమర్శిం చారు. 2జి కుంభకోణం విలువలో ఐదు వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించినా రైతులకు న్యాయం జరిగేదని చంద్ర బాబు పేర్కొన్నారు. కలిదిండి, సింగ రాయపాలెం, అల్లూరు, కోరుకొల్లు, డోకిపర్రు, వడ్ల మన్నాడు, ప్రాంతాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, వైఎస్ పాలనపై విమ ర్శలుగుప్పించారు.

డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు. 2004లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న వైఎస్ కుటుంబం ఇటీవల రూ.86 కోట్ల అడ్వాన్స్ టాక్స్ చెల్లించే స్థితికి ఎలా వచ్చిందని ప్రశ్నిం చారు. వైఎస్ అక్రమ సంపాదతో జగన్ ఎమ్మెల్యేలను కొంటున్నారని, లోబర్చు కునేందుకు ప్రయత్నిస్తున్నా రని విమర్శి ంచారు. సింగరాయి పాలెంలో చంద్రబాబు వైఎస్ రాజ శేఖరరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో తేదేపా ఎమ్మెల్యే లను, రోజాను పలు కారణాలతో కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేశారని, దేశం పార్టీని ఫినిష్ చేస్తాననీ వైఎస్ వ్యాఖ్యా నించారని, అయితే ఎంత మంది వైఎస్‌లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చెయ్యలేరని బాబు అన్నారు.

కొల్లేటి వాసుల హక్కుల కోసం రాజీలేని పోరాటం

 కొల్లేటి ప్రాంత వాసుల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో రైతు కోసం యాత్రలో భాగంగా మంగళవారం ఆయన కైకలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కైకలూరులోని టౌన్‌హాల్ ఆవరణలో శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆవేశపూరితంగా మాట్లాడుతూ కొల్లేటివాసులకు ఉపాధిని దూరం చేసిన పాపం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిదేనని ధ్వజమెత్తారు. తమ హయాంలో సుప్రీం కోర్టునుంచి ఎన్నిసార్లు నోటీసులు వచ్చినా కొల్లేటి ప్రాంత పేద ప్రజల నోటి వద్ద కూడు తీయడం సరికాదని ఆపరేషన్ కొల్లేరు కార్యక్రమాన్ని చేపట్టకుండా అభయారణ్యంపై మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. 2004లో కొల్లేటి ప్రజల దురదృష్టవశాత్తు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మానవత్వం లేకుండా ప్రవర్తించి పేద ప్రజలను భయబ్రాంతులను చేసి చేపల చెరువులను ధ్వంసం చేశారని అన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా వైఎస్ అండ చూసుకుని దుర్మార్గంగా ప్రవర్తించి కొల్లేటి పేదలను బజారున పడేశారని అన్నారు.

కొల్లేటి వాసులకు న్యాయం జరిగేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని ప్రకటించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) మాట్లాడుతూ కొల్లేటి వాసులకు వైఎస్ తీరని అన్యాయం చేశారని అన్నారు. తెలుగుదే««శం పార్టీ వచ్చే ఎన్నికల్లో అదికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొల్లేటి పేద ప్రజల హక్కులను కాపాడేందుకు తొలి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాను కొల్లేటివాసులకు అండగా ఉంటున్నానన్న కారణంగా కొందరు కాంగ్రెస్ నాయకులు తన మంత్రి పదవి పోయేందుకు కూడా పరోక్షంగా కుట్ర పన్నారని అంటూ కొల్లేటి వాసులకు న్యాయం చేసేంతవరకు తాను పోరాటం చేస్తానని ప్రకటించారు. శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఆపరేషన్ కొల్లేరు ద్వారా వైఎస్‌కు లక్షలాది మంది పేద ప్రజల ఉసురు కొట్టిందని, ప్రస్తుతం వైఎస్ పై లోకాల్లో నరకం అనుభవిస్తున్నాడని అన్నారు. తాము శాశ్వతంగా ఉపాధి కోల్పోతున్నామని కొల్లేటి వాసులు ప్రాధేయపడినా పట్టించుకోకుండా వారి జీవన భృతిపై దెబ్బ కొట్టారని అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో కొల్లేరు సరస్సు ఏరియాలోని ప్రజలు సుఖశాంతులతో జీవించారని అన్నారు. ఎమ్మెల్యే తన ప్రసంగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై పలు శాపనార్దాలు పెట్టారు. ఈ సభలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య, కొడాలి నాని, దాసరి బాలవర్దనరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చిన్నం రామకోటయ్య, శ్రీరాంతాతయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉండి శాసనసభ్యుడు వేటుకూరి శివరామరాజు,పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు బచ్చుల అర్జునుడు, చలమలశెట్టి రామానుజయ, నియోజికవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం చంద్రబాబు సభాప్రాంగణంలోకి రాగానే మహిళలు ఘనస్వాగతం పలికారు. బాబు మాజీ మంత్రి మాగంటి బాబు నివాసం నుంచి ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. నియోజకవర్గంలోని మండలాల పార్టీ శాఖల అధ్యక్షులు ఎర్నేని లక్ష్మణ ప్రసాద్, మత్తే సూర్యచంద్రరావు, అల్లం శ్రీనివాసరావు, ఫణి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
Click Here!

పీఆర్పీ కార్యకర్తలు దేశంలో చేరిక

కోరుకొల్లు, బొమ్మినంపాడు గ్రామా ల్లో కాంగ్రెస్ పీఆర్పీ నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు, చంద్ర బాబు సమక్షంలో తెలుగుదేశం సభ్య త్వం తీసుకున్నారు. రైతు సమస్య లకు సంబంధించి చంద్రబాబు జిల్లాలో పలు దఫాలు ఇప్పటికే క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ఈ పర్య టనలో చంద్రబాబు అసెంబీ ్లలోను, బయట ఆందోళనలను ఉధృతం చేశా రు. మలి దఫా జిల్లాలో బాబు రైతు కోసం యాత్ర చేపట్టడంతో పార్టీ శ్రేణు ల్లో ఉత్సాహం తొంగి చూస్తోంది. రైతు ఉద్యమం 'దేశం'కి అనూహ్య స్పందన రావడంతో తాజాగా బాబు పర్యటన జిల్లాలో దేశం మరింత బలపడటానికి టానిక్ నిచ్చి నట్లయ్యింది.

అర్థరాత్రి వరకు చంద్రబాబు పర్యటన

 రైతుకోసం యాత్రలో భాగంగాజిల్లాలో సోమవారం చంద్రబాబు యాత్ర అర్ధరాత్రి వరకు జరిగింది. ఉదయం 9కు ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు బాబు కైకలూరులో మాగంటి బాబు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అది దాదాపు గంటా 40ని.వరకు ప్రారంభం కాలేదు. అక్క డ నుంచి కైకలూరుబహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహాన్ని చూసి ఎక్కువసేపు ప్రసంగించడంతో మూ డున్నర గంటలు ఆలస్యమైంది. సా యంత్రం 5 కల్లా ముగియాల్సిన యాత్ర అర్ధరాత్రి 12 వరకూ సాగడం విశేషం. అంతరాత్రిలోనూ ఆయన ఉద్విఘ్నంగా ప్రసంగించారు.
tdp-babu 
వైఎస్‌ హయాంలో జరిగిన జలయజ్ఞం... ఆయన కుటుంబానికి, అనుచరులకు ధనయజ్ఞంగా మారిందని, ఆ డబ్బుతోనే వైఎస్‌ తనయుడు జగన్‌ ‘దీక్ష’ల జల్సా చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ అవినీతి సొమ్ముతోనే జగన్‌, ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.రాష్ట్రానికితీరని అన్యాయం చేసి, కుక్కలు చింపిన విస్తరిని చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

‘రైతుకోసం’ యాత్రలో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ జగన్‌పై త్రీవ ఆరోపణలు చేశారు. ఆపరేషన్‌ కొల్లేరుతో సర్వం కోల్పోయి జీవనోపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్న కొల్లేటి ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అదనంగా కొట్టేసిన భూములను తిరిగి అప్పగించే వరకు నిద్రపోమని చంద్రబాబునాయుడు అన్నారు. భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో బాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొల్లేటి ప్రజల పొట్ట కొట్టిందని వారి బతుకుల్లో వెలుగులు నిండాలంటే ఆపరేషన్‌ కొల్లేరు కింద ధ్వంసం చేసిన 7,500 ఎకరాల అదనపు భూములను తిరిగి పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు.

ఒకప్పుడు చేపల సాగు చేసుకొని అభివృద్ధి చెందండి అని ప్రోత్సహించిన ప్రభుత్వం నేడు వారి బతుకుల్లో చీకటి నింపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తిరిగి వారి భూములను వారికి పంచకపోతే ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని ఆయన అన్నారు. ధ్వంసం చేసిన భూములను తిరిగి ఇవ్వకపోగా చిత్తడి నేలల సంరక్షణ చట్టన్ని కొత్తగా వెలుగులోకి తెచ్చి కొల్లేటి ప్రజలకు ఆవాసం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ జీవోను అమలు చేస్తే కేంద్రంపై అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో మాజీ ప్రధాని దేవగౌడ ఉండగా కర్ణాటకలో ఆల్‌మట్ట డాం ఎత్తు పెంచేందుకు ప్రయత్నం చేశారని, తాము ఢిల్లీ వెళ్లి వ్యతిరేకించి 519 అడుగులకే ఉండేలా పోరాటం చేశామన్నారు.

నేడు బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది అందుకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగాని తనమే అన్నారు. ట్రిబ్యునల్‌ వాదనలో ప్రభుత్వం పనికి రాని న్యాయమూర్తులను నియమించిదన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్నా కష్టాలను ప్రత్యక్షంగా చూసివెళ్ళలని ఈ యాత్ర చేపట్టనని ఈ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం పై విరుచుకుపడతాదన్నారు. చివరిగా పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవితాశయమని, రైతురాజ్యం రావాలని ఆయన ఆశయాలన్నారు. మొలకెత్తిన ధాన్యానికి సైతం మద్దతు ధర ఇవ్వాలని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని, కొల్లేటి ప్రజలకు 7,500 ఎకరాలను 16 వేల కుటుంబాలకు పంచాల్సిందేనని, చిత్తడి నేల చట్టన్ని రద్దు చేయాలని లేకపోతే తమ సత్తా చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రజల ఉసురుతోనే  వై. యస్ మృతి 
 కొల్లేరును ధ్వంసం చేసింది దివంగత ముఖ్య మంత్రి వై. యస్ నని ఆయన కోట్ల రూపాయాలు నొక్కేసి ప్రజ ల ఉసురు పోసుకున్నాడని, ఆ ఉసురు తగిలే అర్ధాంతరంగా చనిపోయాడని ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మా ట్లాడుతూ విమర్శించారు. రెైతు కోసం యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బలవంతంగా చెరువులను ధ్వంసం చేసి నిరాశ్రయులను చేసిందని ఆవేదన వ్యక్తం చే శారు. కొల్లేరు ముంపునకు చెరువులు కారణం కాదని 1900సం ప్రాంతంలోని ఎగువ ప్రాంతాల నీరు కొల్లేరు లోకి చేరి వరద తాకిడికి గురెైందని విషయాన్ని ప్రభుత్వాల కు తెలిపినా పట్టంచుకోలేదని వాపోయారు. వెై.ఎస్‌ ప్రభు త్వమే కొల్లేరు ప్రజల కొంప కొట్టిందన్నారు. జీవనాధారం లేక అల్లాడుతున్న కొల్లేటి ప్రజలకు అండగా వుండి, అసెంబ్లీలో పోరాటం చేసి తమ ప్రజలకు ఆధారం చూపాలని తమ అధినేత చంద్రబాబుకు విన్నవించారు. కొల్లేరు పెద్దలతో కలిసి వినతి పత్రం అందించారు.

ఆదుకోండి సారూ...: ఆపరేషన్‌ కొల్లేరులో చెరువులు కో ల్పోయి, జీవనోపాధి కరవెై ఆదరించాల్సిన బిడ్డలు కడుపు చేతపట్టి ఊరు వదిలి వలస పోయారు. పట్టెడన్నం లేక అర్ధా కలితో గడుపుతున్నాం. వండుకోలేక వెళ్లలేక ఉండిపోయిన మమ్మల్ని ఆదరించండి మహాప్రభో అంటూ మండలంలోని శృంగవరప్పాడుకు చెందిన బి.వరలక్ష్మీ, చంద్రావతిలు సభ లో దేశం అధినేత చంద్రబాబును వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి వెం కటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వ రరావు, ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యేలు దాసరి బాల వర్ధనరావు, శ్రీరాంతాతయ్య, చిన్నం రామకోటయ్య, చింతమనేని ప్రభాకర్‌రావు, గొరంట్ల బుచ్చయ్యచౌదరి అను రాధ, బచ్చుల అర్జనుడు, అర్బన్‌ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్‌, నాయకులు మత్తె సూర్యచంద్రరావు, చలమలశెట్టి రామానుజయ, కమతం విశ్వసం, సూర్యనారాయణ రాజు, త్రినాధ్‌రాజు, కమినేని శ్రీరామకృష్ణప్రసాద్‌, పొలవరపు ల క్ష్మిరాణి, పావులూరి హేమలత, ‌ ఎంపిపి జయమంగళ చిన సుబ్బారాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

గజినీ, ఘోరీలను తలపించేలా
కొల్లగొడుతున్నారు
కాంగ్రెస్ నేతలపై చంద్రబాబు ధ్వజం
సోనియా మౌనానికి కారణం ముడుపుల బాగోతమే!

కాంగ్రెస్ నేతలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఘోరీ, మహ్మద్ గజనీలను తలపించేలా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా పర్యట నలో భాగంగా మంగళవారం కైకలూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఘోరీ, గజనీలు భూమిపై సంపదను కొల్లగొడితే వై.ఎస్.రాజశేఖరరెడ్డి గనులను కొల్లగొట్టుకోమని అయినవారికి అప్పగించారన్నారు.

గాలి బ్రదర్స్ ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకుని వైఎస్‌ను డబ్బుకట్టలతో సంతృప్తి పరచారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరినా సోనియాగాంధీ మౌనంగా ఉండటం వెనుక ముడుపుల బాగోతం దాగుందన్నారు. అవినీతి కేన్సర్ కన్నా ప్రమాదకరమని, రూ.లక్ష కోట్ల వైఎస్ అవినీతిపై మడమ తిప్పని పోరాటం చేస్తానని ప్రతిన బూనారు. వైఎస్ దోచుకున్న ఆ సొమ్మును వారసత్వంగా చేజిక్కించుకున్న జగన్మోహనరెడ్డి ఢిల్లీలో రైతుల పక్షాన ధర్నా చేయడం రాజకీయమేనని విమర్శించారు.

టీడీపీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను లొంగదీసుకుని సంతలో పశువులు మాదిరిగా బేరమాడి తీసుకెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను డబ్బుతో కొని అధికారం దక్కించుకోవాలని జగన్ ఆరాటపడుతున్నారని తెలిపారు. అతని ఆటలు సాగనివ్వబోమని.. అవినీతి సొమ్మును కక్కించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని అసమర్ధత ప్రభుత్వంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

చిత్తడి నేలల చట్టం దారుణం
ఆపరేషన్ కొల్లేరు పేరిట వైఎస్ తీసుకున్న చర్యలతో కొల్లేరు వాసులు దెబ్బతిని కోలుకుంటున్న దశలో చిత్తడి నేలల చట్టంలోకి కొల్లేరును తీసుకురావడం వారి కడుపుపై కొట్టడమేనని బాబు పేర్కొన్నారు. చిత్తడి నేలల చట్టం వల్ల కొల్లేరులో 5.50లక్షల ఎకరాలకు ముప్పు పొంచి ఉందని, దీంతో మూడు లక్షల మంది ఉపాధికి ఆటంకం ఏర్పడనుందన్నారు. అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానంటూ కొల్లేరు ప్రజలకు భరోసా ఇచ్చారు. సభలో మాజీ ఎంపీ మాం గటి వెంకటేశ్వరరావు(బాబు), టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవినేని ఉమామహేశ్వరరావు, అంబటి బ్రహ్మణయ్య, కైకలూరు ఎమ్మె ల్యే జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.
Click Here! 
ఉమా ,వంశీలకు బాబు క్లాస్

జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్‌లకు చంద్రబాబు క్లాస్ పీకారు. పార్టీ ఏ ఒక్కరిదీ కాదనీ, అందరూ కలిసి కట్టు గా పనిచేస్తేనే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలమని హితబోధ చేశారు. వన్‌మ్యాన్ షో కార్యక్రమాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, వ్యక్తిగత ప్రతిష్టకు పో కుండా నేతలందరూ ప్రతి కార్యకర్తను కలుపుకుని పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎనిమిది మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ ఉన్నారని, ఇలాంటి చోట ఐక్యమత్యంగా ఉండాల్సింది పోయి ఎవరి కి వారు భేషజాలకు పోవడం సబబు కాదని చురక వేశారు.  ఈ నేపథ్యంలో  స్పందించిన బాబు కైకలూరులో మాగంటిబాబు ఇంట్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు.

జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరి సమక్షంలో చంద్రబాబు ముందు సానుకూలంగానే చర్చించా రు. తరువాత పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, వాటి ఫలితా లు, జిల్లా, నగరంలో పార్టీ తీరుతెన్ను లు, పోకడలు తదితర అంశాలకు సం బంధించి ఎమ్మెల్యేల ఎదుట ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పది మంది కి మంచిచెడ్డలు చెప్పాల్సిన జిల్లా నేత లు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని మసకబార్చడందారుణమైన విషయం గా పేర్కొన్నారు. దీనితో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. ముందుగా ప్రజా ప్రతినిదులందరూ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడంతోపాటు పార్టీ పరంగా పిలుపునిచ్చే కార్యక్రమాలకు దూరం గా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేనిపై చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారు.
ముందు సీరియస్‌గా స్పం దించిన ఆయన తరువాత సుతిమెత్తగా వంశీని సూటిగా ప్రశ్నించారు. సీపీ సీతారామాంజనేయులు ఫోన్‌ట్రాప్ లో వంశీ పేరు వినిపించడాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులతో సమస్యలు తెచ్చుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని సూచించినట్టు సమాచారం. అదే సందర్భంలో జిల్లా, అర్బ న్ నేతలు దీనిపై స్పందించకపోడాన్నీ ప్రశ్నించినట్లు తెలిసింది. బయటకు వచ్చిన పార్టీ నేతలు ఈ వ్యవహారానికి సంబంధించి వంశీపై సీరియర్ అయినట్లు చెబుతున్నారు. తరువాత చంద్రబాబు తన కోపాన్ని జిల్లా అధ్యక్షుడు దేవినేనిపై చూపించారు. పార్టీనంతా ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తరువాత దేవినేని, వంశీలను పక్క గదిలోకి తీసుకెళ్లి కొద్ది సేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు భేటీలో జిల్లా పార్టీ, అర్బన్ పార్టీ మధ్య జరుగుతున్న పొరపచ్చా లు, ఒంటెద్దు పోకడలపై తీసుకోవాల్సి న చర్యలపై బాబు వీరికి సూచించినట్లు తెలిసింది.

ఇదే సందర్భంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు వంశీ మోహన్ చూసే పార్టీ కార్యక్రమాలను కూడా జిల్లా పార్టీ నేతలు, అర్బన్‌నేతలు పాల్గొని విజయ వంతం చేయాలని ఉమాకు సూచించినట్లు తెలుస్తోంది. అర్బన్ పరంగా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని దీనిపై ఉమా తీసుకునే కార్యక్రమాలు కూడా అర్బన్ నుంచి అంతే సహకారం ఉండాలని, ఇటు అర్బన్, అటు జిల్లా పార్టీకి రెండు కళ్ళు వంటివని ఇందులో ఎవరికి వారు భేషజాలకు పోకుండా ఉభయులు పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం.
Click Here!

నేనంటే...అంతే * బాట, మాట రైతుల వైపేనంటూ చంద్రబాబు

 
  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పశ్చిమలో ఒక రోజు యాత్ర వినూత్నంగా సాగింది. రాజకీయంగా యువనేత జగన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రా సొమ్ములకు కక్కుర్తిపడ్డారంటూ ఆరోపణలు విసిరారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ తక్కువేమీ తినలేదంటూ ఆక్షేపించారు. కిరణ్‌కుమార్ సర్కార్ పనికిరాని సర్కార్ అంటూ నిందలు మోపారు. కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలంటూ శాపనార్థాలు పెట్టారు. రైతుల కోసం అంతో ఇంతో చేయాల్సి వస్తే మేమే చేస్తామని, వర్గాలకు, ఇతరత్ర వాటికి దూరంగా కలిసికట్టుగా తమ పోరాటాలకు తరలిరావాలని రైతులకు పిలుపునిచ్చారు.
అక్కడక్కడ రైతుల నుంచే నేరుగా అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు జరుగుతుందా, లేదా అంటూ ఆరా తీశారు. మీరెలా కష్టాలు పడుతున్నారంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అవినీతిని పదేపదే ప్రస్తావిస్తూ దీనిపై పోరాటం తప్పదని ప్రకటించారు. అంతలోనే పార్టీపరంగా తాము ఎలా శ్రమపడ్డామో బాబ్లీ దగ్గర నుంచి నిమ్స్ వరకు సాగిన నిరాహార దీక్ష వ్యవహారాన్ని అందరికీ గుర్తుకు తెచ్చే ప్రయత్నమూ చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు చంద్రబాబు పశ్చిమలో తన పర్యటనను కొనసాగించారు. రాత్రి పొద్దుపోయిన తరువాత దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వలిలో జరిగిన రైతు సదస్సులో ఆత్మహత్యలకు పాల్పడినా, గుండెపోటుతో మృతి చెందినా కౌలు రైతు కుటుంబాల్లో ఒక్కొ కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

ప్రభుత్వం పట్టించుకోకపోయినా తమ బాట, మాట రైతుల వైపేనంటూ చంద్రబాబు అందరికీ నచ్చచెప్పే ప్రయత్నము తుది వరకు కొనసాగించారు. వాస్తవానికి చంద్రబాబు రెండు రోజుల క్రితమే జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ పనులు, పండుగ సీజన్ అడ్డు వస్తున్నా ఖాతర్ చేయకుండా కృష్ణా జలాల వినియోగం, జరిగిన నష్టం, తదితర అంశాలనే తీసుకుని నేరుగా రైతుల వద్దకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఆయన తొలి అడుగు పశ్చిమలో మోపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఆయన యాత్రకు బయలుదేరారు. పెద్ద తాడేపల్లిలో ఆయన ఎడ్ల బండి ఎక్కి ఆ ఊరి రైతులకు కాస్తంత ఊరటనిచ్చారు.

రైతులు పడుతున్న కష్టం, నష్టం అంతా తనకు తెలుసునని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అత్యంత ఘోరమంటూ ఆరోపణలు గుప్పించారు. రైతులకు అండగా ఉంటానంటూ గట్టి భరోసా ఇచ్చారు. పనిలోపనిగా జలయజ్ఞం పనులను ప్రస్తావించారు. ఈ పనుల్లో రైతులకు ఒరిగిందేమీలేదని, వైఎస్ సర్కార్ అంతా దోచుకుందని ఆరోపించారు. తాడిపూడి కాల్వకు సమాంతరంగా పోలవరం కాల్వను తవ్వి కొత్త అక్రమాలకు తెరలేపారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడబోమని ఆక్షేపించారు. పనిలోపనిగా తాడేపల్లిగూడెం-నల్లజర్ల మధ్యన నిర్మాణంలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులను స్వయంగా చూశారు. ఈ పనుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.

జలయజ్ఞం కాదు అంతా ధన యజ్ఞమేనని అభివర్ణించారు. ఆ తరువాత నల్లజర్లలో జరిగిన పొగాకు రైతుల సదస్సులో కూడా కాసేపు పాల్గొన్నారు. మెట్ట ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు మాత్రమే ఈ సదస్సులో పాల్గొన్నారు. పొగాకు రైతులు పడుతున్న పాట్లను ఆయన ప్రస్తావిస్తూ పొగాకు రైతులకు ఇచ్చిన రుణంపై మారటోరియం ప్రకటించాలని, అదనంగా కొత్త రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావని బాధను వ్యక్తం చేశారు. ఈవిషయంలో తాను వెనుకంజ వేసేదిలేదని, అండగా నిలుస్తానని ప్రకటించారు. అలాగే ఇంకోవైపు పామాయిల్ రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ పామాయిల్‌కు కనీస మద్దతు ధరను 8 వేల 500 రూపాయలుగా ఉండాలని డిమాండ్ చేఉశారు. నష్టపోయిన పామాయిల్ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

నల్లజర్లలో ఇంజనీరింగ్ విద్యార్థితోపాటు మిగతా విద్యార్థులు కూడా రైతు సదస్సుకు తరలివచ్చారు. తాము ఎదుర్కొన్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. రైతాంగ సమస్యలతోపాటు వారి కుటుంబాలకు చెందిన విద్యార్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకాదని, ఈ విషయంలో తాను అన్ని విధాలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పేర్కొన్నారు. నల్లజర్ల నుంచి భీమడోలు, గుండుగొలను, దెందులూరు, దోసపాడు మీదుగా ఆయన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కొవ్వలికి చేరుకున్నారు. మార్గమధ్యలో కౌలు రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వై.ఎస్ హయాంలో జరిగిన అవినీతిని నేరుగా ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా వదలకుండా దోపిడీ చేశారని ఆరోపించారు.

వై.ఎస్ ఏకంగా తన కొడుకుకి, బంధువులకు లక్ష కోట్లు దోచిపెట్టారని నిందించారు. వీటితోనే దినపత్రిక, చానల్ పెట్టడంతోపాటుగా మిగతా పరిశ్రమలను అడ్డగోలుగా స్థాపించి దండుకునే ప్రయత్నం చేశారన్నారు. పనిలోపనిగా ఉల్లి, కూరగాయల ధరలను కూడా ప్రస్తావిస్తూ అసలు వీటి సంగతి మీరు పట్టించుకుంటున్నారా అంటూ మహిళలనుద్దేశించి ప్రశ్నించారు. తామంతా ఉల్లిపాయ కోసి చాలాకాలమైందని, ధరలు అందుబాటులోలేవని కొందరు నేరుగా చంద్రబాబుకే తేల్చిచెప్పారు. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ కేడర్‌పై అనవసరంగా కేసులు బనాయిస్తున్నారని, ఇది గనుక జరిగితే కాంగ్రెస్ నేతలు మాడి మసైపోతారంటూ శాపనార్ధాలు పెట్టారు. అధికారం ఉందికదా అని విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కొవ్వలిలో జరిగిన రైతు సదస్సుకు భారీగా రైతులు, స్థానికులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.

అంతుకుముందు చాలాచోట్ల చంద్రబాబుపై కొందరు అమిత అభిమానాన్ని ప్రదర్శించారు. కొందరు పువ్వులు చల్లి ఆనందం ప్రకటించగా, మరికొందరు హారతులతో ఎదురేగారు. చంద్రబాబు మాత్రం ఎక్కడా కూడా వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని, వైఎస్.జగన్ చేష్టలను చెప్పకుండా మాత్రం ప్రసంగం ముగించిన దాఖలాలులేవు. ఆయన లక్ష్యం యావత్తు జగన్‌వైపే కనిపించింది. ఎక్కడా కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ అంశాలను ప్రస్తావించకుండా జాగ్రత్త వహించారు. నేతలను కూడా ఆమేరకు కట్టడి చేసినట్టే కనిపించింది. కొవ్వలిలో జరిగిన రైతు సదస్సుకు మాత్రం అపూర్వమైన మద్దతు కనిపించింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ రాష్ట్ర నేత మాగంటి బాబులు అద్భుతంగా సభను నిర్వహించారు. 
రాష్ట్ర సంపదను వైఎస్‌ కుటుంబం కొల్లగొట్టింది
రాష్ట్రంలోని భూగర్భ ఖనిజ సంపదను వైఎస్‌ కుటుంబం కొల్లగొట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్థానిక ఆర్‌ అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేకర్లతో సోమవారం మాట్లాడారు. ఓబుళాపురం బయేటీస్‌ గనులు,బాక్సెడ్‌ గనులను లక్ష ఎకరాలను వైఎస్‌ అల్లుడుకి కట్టబెట్టేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో భూమి సేకరణ కోసం రైతుల వద్ద నుంచి ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నారని మండిపడ్డారు. రెండు పంటలు పండే భూములను తక్కువ ధరకు తీసుకున్నారని అన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు దీనస్థితిలో ఉన్నారని, రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో పంటను రైతులు నష్టపోయారన్నారు. అసల ప్రభుత్వం ఉన్నదా... అనే విధంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని, జలయజ్ఞం ధనయజ్ఞనంగా మారిందని విమర్శించారు. తాళ్ళపూడి, పోలవరం కాలువలు నిరుపయోగంగా మారాయన్నారు. ఎస్‌ ఇజెడ్‌ పేరుతో రైతుల పొలాలను లాక్కున్నారన్నారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను ఒక కుటుంబానికి చెందిన వారే చేజిక్కించుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ దీక్ష ఢిల్లీలో కాదని, ఇడుపులపాయలో చేయాలని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి మయమైందన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో రూ. 1.76లక్షల కోట్ల అవినీతి జరిగినట్టు చెప్పారు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయందని చంద్రబాబు నాయడు దుయ్యబట్టారు.

సోనియా గాంధీకి ముడుపులు అందుతున్నందు వల్లే లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందన్నారు. భోఫోర్స్‌ కుంభకోణంలో కత్రోచిని కాపాడేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు అమ్మేసి వాటిని రియల్‌ ఎస్టేట్‌ పేరుతో కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో జరిగిన కుంభకోణాల్లో సోనియా గాంధీకి వాటాలు అందాయని ఆరోపించారు. అందువల్లే ఆమె వీటిని పట్టించుకోవటంలేదని తెలిపారు. కాంగ్రెస్‌ పాలన రైతులపాలిట శాపంగా మారిందన్నారు. రైతుకు ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రభుత్వం వేలకోట్ల అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవటంలేదన్నారు. పెంటపాడు మండలంలో రైతులు పూర్తిగా పంటనష్టపోయి ఉన్నారని, రంగుమారి,మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారన్నారు. దోచుకో... దాచుకో...అన్న రీతిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్‌జగన్‌ అడ్డాన్స్‌ ట్యాక్స్‌గా రూ. 87కోట్లు చెల్లించారంటే ఎంత ఆస్థిని కూడబెట్టారో అర్ధమవుతుందన్నారు.

దేశంలో అవినీతి పెరిగిపోయిందని దీనిని అరికట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై తాను రాజీలేని పోరాటం చేస్తానన్నారు. కృష్ణానది జలాలపై మనకు రావాల్సిన వాటాను రాబ ట్టేందుకు ట్రిభ్యునల్‌ ఎదుట సరియైన వాదనలు వినిపించకపోవటం వల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో ఎంపిలు అసమర్థులుగా వ్యవహరించారన్నారు. తెలంగాణా విషయమై విలేకర్లు ప్రస్థావించగా కేవలం రైతుల విషయమై మాట్లాడడానికి వచ్చానని సమాదానం దాటవేశారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముళ్ళపూడి బాపిరాజు,గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, మాగంటి బాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు(శివ),ఎమ్మెల్సి బొమ్మిడి నారాయణరావు, దేశం సీనియర్‌నాయకులు గాదిరాజు బాబు, ఉంగుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గన్ని వీరాంజనేయులు, నాయుడు రామచంద్రరావు,మెంటే పార్థసారది, బడేటి బుజ్జి, తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాళ్ళు కొండ్రెడ్డి హైమావతి, మాధవరపు బాజీ, కిల్లాడి ప్రసాద్‌,గొర్రెల శ్రీధర్‌, బొద్దాని శ్రీనివాస్‌, బడుగు వెంకటేశ్వరరావు, దాసరి అప్పన్న,పెంటపాడు జడ్పిటీసి సభ్యుడు తెన్నేటి సంజాయ్‌ఖాన్‌, మాజీ జడ్పిటిసి సభ్యుడు ఆకుతీగపాడు బాబు, రంపా చింతన్న, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఎస్‌ కృష్ణమోహన్‌, ఈదుపల్లి వాసు, పద్మనాభుని మురళీ,రెడ్డి చందు, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండల టిడిపి అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, బాలం కృష్ణ, పెంటపాడు మండల తెలుగుయువత అధ్యక్షుడు కొల్లూరి నాగరాజు,టిడిపి సీనియర్‌ నాయకులు గూడెపు సత్యనారయణ, కొయ్యలమూడి బ్రహ్మానందం తదితరులు ఉన్నారు.

Click Here!

Sunday, January 9, 2011

'టీ' కప్పులో తుపాను * తెలుగుదేశంలో భగ్గున మండి.. చప్పున చల్లారిన సంక్షోభం

 

నాగం పోటీ భేటీపై బాబు గుస్సా
తెలంగాణ నేతలతో సమావేశం
నాగం, కడియం, ఎర్రబెల్లికి అందని ఆహ్వానం
నేతల జోక్యంతో చల్లబడ్డ చంద్రబాబు
ప్రత్యేక శాఖకు ససేమిరా.. ఉద్యమాలకైతే ఓకే
తెలుగుదేశంలో 'తెలంగాణ' చిచ్చు రగిలింది! చప్పున చల్లారింది. అలకలు, ఆగ్రహాలతో సంక్షోభం సలసలా కాగింది! సాయంత్రానికి అంతా సర్దుకుంది! ఉదయం నుంచి సాయంత్రంలోపే... విషయం అనేక మలుపులు తిరిగింది. నాగం జనార్దన రెడ్డి కేంద్రంగా హైడ్రామా నడిచింది. ఆదివారం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరైన నాగం, కడియం, ఎర్రబెల్లి పోటీ సమావేశం ఏర్పాటు చేయడంతో వేడి మొదలైంది. ఈ భేటీకి హాజరైన ఇతర నేతలందరినీ పిలిచి మాట్లాడిన చంద్రబాబు... ఆ ముగ్గురిని మాత్రం పిలవకుండా కఠిన వైఖరి ప్రదర్శించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

చివరికి... ఇతర నాయకులు సర్ది చెప్పడంతో ఆయన నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలిచారు. 'ఇదేం పద్ధతి?' అంటూ ప్రశ్నించారు. తాను ఎంతగా సహకరిస్తున్నప్పటికీ, ఇలా ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని నిలదీశారు. చివరికి... పార్టీలో తెలంగాణ కోసం ప్రత్యేక శాఖ ప్రకటించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తే అభ్యంతరం లేదని తెలిపారు. వెరసి... తెలుగుదేశంలో ఉదయం రగిలిన తుపాను సాయంత్రానికి చప్పున సద్దుమణిగినట్లయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశంలో ఒక్కసారిగా చిచ్చు రగిలింది. భగభగమని మండింది. తర్వాత... చప్పున చల్లారింది. ఉదయం విషయం పార్టీలో చీలిక దాకా వెళ్లింది. రాత్రికి... అంతా సర్దుకుంది. మొత్తానికి... రోజంతా హైడ్రామా నెలకొంది. తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలైన నాగం జనార్దన రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి కేంద్రంగా వివాదం నడిచింది. నాగం కోరుతున్నట్లుగా తెలంగాణకు ప్రత్యేక శాఖ ప్రకటించడం సాధ్యంకాదని... ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించవచ్చని తేల్చిచెప్పారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అసలేం జరిగిందంటే...

ఆదివారం రాత్రి మూడు జిల్లాల పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు... దానికి ముందు తాజా రాజకీయ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన తొమ్మిది మంది నేతలను తన నివాసానికి ఆహ్వానించారు. వీరిలో పొలిట్‌బ్యూరో సభ్యులు, శాసనసభాపక్షం ఉప నేతలు, ముఖ్యులు ఉన్నారు. నాగం, కడియం, ఎర్రబెల్లి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పైగా... సరిగ్గా అదే సమయంలో నాగం గచ్చిబౌలిలోని తన నివాసంలో మరో సమావేశం నిర్వహించారు. దానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచారు.

హరీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉమా మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జైపాల్ యాదవ్, గంప గోవర్దన్, పి.రాములు, ఎల్లారెడ్డి, కెఎస్ రత్నం, కడియం శ్రీహరి తదితరులు నాగం నివాసానికి వచ్చారు. ఎర్రబెల్లి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరై... అదే సమయంలో పోటీ సమావేశం ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. పార్టీ అధినేతపై వీరు తిరుగుబాటు జెండా ఎగురవేశారని, తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తోందని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ఊహాగానాలు సాగాయి. పైగా... పార్టీ అధినేత అనుసరిస్తున్న వైఖరితో తాను విభేదిస్తున్నానని నాగం ఈ సమావేశంలో చెప్పారు.

తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేక రాష్ట్ర కమిటీ వేసేందుకు ఆయన అంగీకరించడం లేదని, ఉద్యమాలు చేయడంలో స్వేచ్ఛ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఊహాగానాలకు మరిన్ని రెక్కలు తొడిగినట్లయింది. ఈ నేపథ్యంలో నాగం విలేకరులతో మాట్లాడారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని... తమ నాయకుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ సాధన కోసం ప్రత్యేక శాఖ కావాలని కోరుతున్నామన్నారు.
బాబు గుస్సా...

తాను పిలిచిన సమావేశానికి రాకపోగా అదే సమయంలో నాగం, కడియం కలిసి మరో సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. వారి విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాగం ఇంట్లో జరిగిన సమావేశానికి వెళ్లిన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నగరంలో అందుబాటులో ఉన్న మరి కొందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులను ఆయన మధ్యాహ్నం తన నివాసానికి పిలిపించి వారితో భేటీ అయ్యారు.

నాగం, కడియం, ఎర్రబెల్లిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ పరిణామం ముగ్గురు నేతలకు దిగ్భ్రమ కలిగించింది. తన నివాసానికి వచ్చిన తెలంగాణ నేతలతో చంద్రబాబు సుమారు మూడు గంటలపాటు సమావేశం అయ్యారు. ఇక్కడి రాజకీయ పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. "తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీలో నేను స్వయంగా మూడు రోజులపాటు డిమాండ్ చేశాను. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ మాట్లాడాను.

శ్రీకృష్ణ నివేదికపై కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాలని కోస్తా ప్రాంత నేతలు కొందరు కోరినా... వారిని వారించి మీరు కోరిన ప్రకారం ఆ సమావేశానికి వెళ్లలేదు. శ్రీకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నప్పుడు తామూ చేస్తామని సీమాంధ్ర నేతలు నాతో చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని వారికి నచ్చజెప్పి ఆపాను. నేను మీ గురించి ఆలోచిస్తున్నంతగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ నేతలు ఏనాడూ సోనియా గాంధీ ప్రస్తావన తేరు.

మీరు ప్రతిదానికి నా ప్రస్తావన తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తాము రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాల్సి ఉందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై బాబు స్పందిస్తూ... "నిరభ్యంతరంగా ఉద్యమించవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అయితే, ఎవరికి వారుగా కాకుండా ఒక కమిటీ వేసుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి.

గందరగోళానికి తావివ్వవద్దు'' అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి పార్టీలో విడిగా ఒక శాఖ ఏర్పాటు మాత్రం సాధ్యం కాదని బాబు తేల్చిచెప్పారు. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐగానీ... కాంగ్రెస్ పార్టీ గానీ తెలంగాణకు ప్రత్యేక శాఖలు పెట్టాయా? ఎక్కడా లేని శాఖ మన వద్ద కావాలని కోరడం సరికాదు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయి. దాని బదులు మీరంతా కలిసి ఏదైనా ఒక కమిటీ వేసుకొని దాని ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి'' అని సూచించారు.
నా బాధ్యత కాదా?

ఈ సమావేశం జరుగుతుండగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు రంగ ప్రవేశం చేశారు. ఏ సమస్య ఎలా ఉన్నా భేటీకి నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలవకపోవడం సరికాదని... వారిని కూడా పిలవాలని చంద్రబాబును కోరారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. ఆ ముగ్గురినీ తన నివాసానికి ఆహ్వానించారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారు బాబు వద్దకు వచ్చారు. వారితో ఆయన సూటిగానే మాట్లాడారు. "మీరు ముగ్గురూ పొలిట్‌బ్యూరో సభ్యులు.

ఉదయం నేను పిలిస్తే రాకపోగా, అదే సమయంలో మరో సమావేశం నిర్వహిస్తే చూసే వారికి ఎలా ఉంటుంది? సీనియర్లుగా మీరు నన్ను గైడ్ చేయాలి. నా దగ్గరకు వచ్చి ఎంతైనా కొట్లాడండి. తప్పులేదు. కానీ, సమావేశాలకు రాకపోవడం ఏం పద్ధతి? ఇలా అయితే పార్టీ నడుస్తుందా?'' అని ఆయన వారిని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి వద్దామనుకొన్నామని కడియం, ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. మరి ఎందుకు రాలేదని చంద్రబాబు అడిగినప్పడు వారు మౌనం వహించారు. పార్టీని రక్షించుకోవడానికే తాపత్రయపడుతున్నామని నాగం అన్నారు.

"పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా నాకు లేదా? ఏమీ పట్టకుండా ఉంటానా? నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఒకసారి నాది తప్పు కావచ్చు. మరోసారి మీది తప్పు కావచ్చు. అంతమాత్రాన ఎదుటివారు అన్నీ తప్పులే చేస్తున్నారని నిందలు వేయడం సరికాదు. మీరు ఒక కోణంలో చూస్తే నేను నాలుగు కోణాల నుంచి చూస్తుంటాను'' అని బాబు వ్యాఖ్యానించారు.

తాను జిల్లాల పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి కూర్చుని విపులంగా చర్చించుకొందామని... రైలుకు సమయం సమీపిస్తోందని బాబు చెప్పడంతో చర్చ అంతటితో ముగిసింది. తాము ఈ నెల 13వ తేదీన మరోసారి కూర్చుని అన్నీ చర్చించుకొంటామని ఈ సమావేశం తర్వాత ఎర్రబెల్లి విలేకరులతో చెప్పారు. నాగం మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే... నాగంలో సంతృప్తి కనిపించలేదని, ఆయన వైఖరి అస్థిమితంగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. వ్యవహారం 'టీ కప్పులో తుపాను'గా ముగిసిందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. 
పోతే.. పోండి
babu-rash 
కాంగ్రెస్‌ నాయకత్వం లోని యుపీఏ సర్కారు వేసిన శ్రీ కృష్ణ కమిటీ తన నివేది లో అస్పష్ట వైఖరి ప్రద ర్శించిన సమయంలో అంతా కలసి కాంగ్రెస్‌పై దాడి చేయవలసిన సమయంలో సొంత పార్టీ నేతలే అభద్రతా భావానికి గురయి సొంత నిర్ణయాలు తీసుకుంటే అవస రమైతే అలాంటి వారిని వదులుకోవడా నికి సైతం సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశా రు. తెలంగాణపై అవసరమైతే ఇంకా ఉధృత మైన ఉద్యమాలు చేయాలని, అంతే గానీ పార్టీ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహిం చేది లేదని బాబు హెచ్చరించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణపై గం దరగోళంలో ఉంటే, ప్రాంతీయ పార్టీ అయిన మనం ఇంకెంత ఆచితూచి నిర్ణయం తీసుకోవా లో మీరే ఆలోచించండన్నారు.

ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో జరిగిన సంఘటనలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన సీనియర్‌ నేతలయిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాత్రి సమయంలో బాబును కలసి, తామంతా పార్టీలోనే ఉంటామని, మీరు జిల్లా పర్యటనలు పూర్తి చేసుకుని రావాలని కోరడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న వ్యవహారాలు చివరకు ‘టీ’ కప్పులో తుపానులా ముగిశాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకా రం... శనివారం నాగం నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలసి ఉస్మానియాలో మోహరించిన బలగాలను తొలగించాలని కోరిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలకు ఆదివారం తన నివాసంలో బ్రేక్‌ఫాస్టుకు రావాలని నాగం ఆహ్వానించారు.

అయితే, అదే సమయంలో బాబు తన నివాసంలో పది మంది సీనియర్లను ఆహ్వానించారు. వారిలో నాగం, కడియం, ఎర్రబెల్లి కూడా ఉన్నా రు. అయితే, తాను ఆసుపత్రికి వెళుతున్నందున సమావేశానికి రానని దయా కర్‌ చెప్పగా, తాను-నాగం కలసి అర్ధగంటలో వస్తామని కడియం చెప్పారు. నాగం మాత్రం తాను రాలేనని చెప్పారు. అప్పటికే బాబు నివాసంలో టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, రమేష్‌ రాథోడ్‌, మోత్కుపల్లి నర్శింహులు, దేవేందర్‌గౌడ్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ వంటి నేతలు చేరుకున్నారు.

kadiamఅదే సమయంలో నాగం తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణకు ప్రత్యేక శాఖ కావల్సిందేనని, ఆ మేరకు బాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే, నాగం తన నివాసంలో సీఎంను కలసిన ఎమ్మెల్యేలకు తాను బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తున్నట్లు బాబుకు చెప్పలేదు.అదే సమయానికి బాబు నివాసంలో భేటీ అయిన సీనియర్లు శ్రీ కృష్ణ కమిటీ, కాంగ్రెస్‌పై ఎదురుదాడి అంశంపై చర్చిస్తున్న సమయంలోనే ప్రత్యేక శాఖకు తెలంగాణ టీడీపీ నేతలు పట్టుపడుతున్నారని, బాబు పిలిచినా నాగం, దయాకర్‌, కడియం వెళ్లలేదని, టీడీపీ రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చిందంటూ న్యూస్‌ చానెళ్లలో వార్తలు రావడంతో సమావేశం వేడెక్కింది.

తనకు రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవలసిన అవసరం ఉందని, శ్రీ కృష్ణ కమిటీ తన అస్పష్టమైన తీర్పు ద్వారా రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిన వైనాన్ని వినియోగించుకుని కాంగ్రెస్‌పై కలసికట్టుగా దాడి చేయవలసిన సమయంలో మన వాళ్లే టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో పడితే ఎలాగని బాబు వ్యాఖ్యా నించారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించకూడదని, అవసరమైతే కొందరు పార్టీని వీడినా ఫర్వాలేదని బాబు వ్యాఖ్యానించారు.మిగిలిన నాయకులు కూడా మనం కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు ఇదే తగిన సమయమన్నారు. ఉదయం నుంచి మూడు గంటల వరకూ టీవీలలో వస్తున్న స్క్రోలింగులు, వార్తా కథనాలను సమావేశం లోనే చూసిన నాయకులు దీనివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయకపోతే తమ దారి తాము చూసుకుంటామని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వేడిపుట్టించాయి. టీఆర్‌ఎస్‌ నేతలు జితేందర్‌రెడ్డి, విజయరామారావు ఆ ముగ్గురుతో మాట్లాడారన్న వార్తలతో ఒక్కసారిగా వాతావరణం సీరియస్‌గా మారింది.

మళ్లీ అదే సమయంలో తామంతా బాబు నాయతక్వంలోనే పనిచేస్తామని, తాము పార్టీని వీడేది లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఉండాల్సిందేనని నాగం కడియం స్పష్టం చేశారు. తమపై బాబు సీరియస్‌ అయి.. పార్టీలో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారని వ్యాఖ్యానించారంటూ స్క్రోలింగులలో రావడంతో ఆ ముగ్గురూ సీరియస్‌ అయ్యారన్న వార్తలతో దృష్టి అటు మళ్లింది. తెలంగాణలో పార్టీని పటిష్ఠం చేసుకునేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించగా, బాబు దానికి సానుకూలంగా స్పందించారు. దీనిపై తాను జిల్లాల పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాత చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు.

పార్టీ తీసు కోవలసి నిర్ణయాలపై నాగం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి, సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఆ సమావేశానికి నాగం, కడియం, ఎర్రబెల్లిని ఆహ్వానించలేదు. అది టీవీ చానెళ్లకు ఒక వార్తగా మారింది. ఇదిలాఉండగా, బాబు సీనియర్‌ నాయ కులతో భేటీ అయిన తర్వాత మూడు గంటల సమయంలో ఎర్రబెల్లి దయాకర్‌ ఒక్కరే వచ్చి బాబుతో ఏకాంతంగా కలసి, ఉదయం నాటి పరిణామాలను వివరించడం గమనార్హం. తాను మీతోనే ఉంటానని, తనకు సొంత అజెండా లేదని, టీవీ వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు గంటల కు తెలంగాణ ఎమ్మెల్యేలంతా బాబు నివాసంలో భేటీ అయ్యారు.

ఉదయం నా గం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేంతా ఈ సమావేశానికి హాజరుకా డం గమనా ర్హం. వారితో బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ‘మనం ఉస్మానియా విద్యార్థులపై పెట్టిన కేసులు తొలగించాలని అసెంబ్లీలో గొడవ చేశాం. నేను వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని నిలదీశా. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయా లని డిమాండ్‌ చేశా. అయినా ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎంపీలు ఒక్కరోజు దీక్ష చేస్తే విద్యార్థులపై కేసులు తొలగించింది. మనం కౌన్సిల్‌ను వ్యతి రేకించినా కాంగ్రెస్‌ సాధించుకుంది. నేను 9 రోజులు రైతుల కోసం దీక్ష చేస్తే స్పందించని ప్రభు త్వం, ఆ తర్వాత ఏదో కొన్ని ప్యాకేజీలిచ్చింది. దీన్ని బట్టి కాంగ్రెస్‌ రాజకీయ ప్ర యోజనాల మేరకే పనిచేస్తుందని అర్థమవుతోంది. వ్యక్తిగ తంగా నేను తెలంగా ణకు వ్యతిరేకం కాదు. అసలు తెలంగాణను తెచ్చే శక్తి గానీ, అడ్డుకునే శక్తి గానీ మనకు లేదు.

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీనే ఇబ్బందిలో పడింది. కాంగ్రెస్‌ను తిట్టా లో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ పరిస్థితిని మనం వినియోగించుకుని కాంగ్రెస్‌ -టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయవలసిన సమయంలో, మన వాళ్లే టీఆర్‌ఎస్‌ వాళ్ల ట్రాప్‌లో పడితే ఎలా? తెలంగాణ కోసం ఇంకా ఎన్ని ఉద్యమాలయినా ఉధృతంగా చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పార్టీ ప్రయో జనాలు కాదని, వ్యక్తిగత అజెండాలు పెట్టుకుంటే సహించేది లేదు. కాకపోతే కొంతమంది పార్టీ నుంచి వెళతారు. వెళ్లనీయండి. నాకు పార్టీ ముఖ్యం. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? చెప్పండి! నేను చేస్తున్నది కరెక్టా కాదా మీరే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు.

దీనితో ఉదయం నాగం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరు ఉదయం సమావేశానికి మీ అనుమతి ఉందని చెప్పే నాగం తమను పిలిచారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. నిజానికి తాము అక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా ఏమీ లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఉంటే బాగుంటుందని, అప్పుడే తమను ప్రజలు తమను నమ్ముతారని మాత్ర మే చర్చ జరిగిందన్నారు. తామంతా మీ తోనే ఉంటామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని, పార్టీ బాగుంటునే తాము బాగుంటామన్నారు. అదే సమ యంలో.. బాబు ఆ ముగ్గురిపై ఆగ్రహం వ్యక్తం చేశారని, పార్టీలో ఉంటే ఉండండి, పోతే పొండన్నారంటూ టీవీ స్క్రో లింగులు రావటం కూడా అబద్ధమ ని ఉదయం బాబు భేటీలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలకు స్పష్టం చేయటంతో పరి స్థితి సర్దుమణిగింది.

ఈ క్రమంలో నాగం, ఎర్రబెల్లి, కడియం శ్రీహరిని కూడా మీటింగుకు పిలవాలని రేవూరి ప్రకాష్‌రెడ్డి సూచించగా, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ దానిని బలపరిచారు. ఆ దశలో జోక్యం చేసుకున్న చంద్రబాబు నాయుడు ‘నేను వారిని ఉదయం పదిమంది తో పాటు ఆహ్వానించా. కానీ రాలేదు. అది చానళ్లలో వేరే సంకేతాలు వెళ్లాయి, చంద్రబాబు పిలిచినా వాళ్లు రాలేదన్న సంకేతాలు వెళ్లాయి. అందుకే ఇప్పుడు ఈ సమావేశానికి వారిని పిలవలేదు. ఒక వేళ మళ్లీ పిలిచినా వాళ్లు రాకపోతే నాకు ఎలాంటి గౌరవం ఉంటుందో, ఎలాంటి సంకేతాలు వెళతాయో మీరే ఆలో చించండి. వారిని అవాయిడ్‌ చేయాలని నాకు లేదు. వాళ్లు పొలిట్‌బ్యూరో సభ్యు లన్న గౌరవంతోనే ఉదయం పిలిచా. ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి పిలు స్తున్నా’నని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత బాబు ఆ ముగ్గురితో ఫోన్‌లో మాట్లాడి, సమావేశానికి రావాలని ఆదేశించారు. దానితో ఆ ముగ్గురూ సమా వేశానికి హాజరయ్యారు. బాబు మీపు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు అబద్ధ మని అక్కడే ఉన్న సీనియర్లు ఆ ముగు ్గరికీ స్పష్టం చేశారు. వచ్చీ రాగానే నాగం తెలం గాణకు ప్రత్యేక శాఖ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయి తే ఆయనతో పాటు వచ్చిన కడియం శ్రీహరి మాత్రం నాగంతో విభేదించారు. ‘మీరు ఈరోజు టూర్‌కు వెళుతున్నారు కదా సార్‌. టూర్‌ పూర్తి చేసుకుని 13న వస్తారు కాబట్టి అప్పుడు కూర్చుని నిర్ణయిద్దాం’ అని స్పష్టం చేయడంతో నాగం మౌనం వహించారు. నాగం తీరు తెలంగాణ శాఖపై అప్పటికప్పుడు ఏదో ఒకటి తేల్చాలన్న ధోరణిలోనే ఉందని నేతలు చెప్పారు. కడియం శ్రీహరి సూచ ననను అంతా అంగీకరించడంతో 13న మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశం ముగిసి, బాబు పశ్చిమ గోదావరి జిల్లా యాత్రకు వెళ్లేందుకు సిద్ధమ యేందుకు కారు వద్దకు వెళ్లగా, కడియం శ్రీహరి ఆయనతో కొద్దిసేపు మంతనాలు జరపడం ప్రస్తావనార్హం. 

టీడీపీలో తెలంగాణ హైడ్రామా
‘నాగం’ బుస.. బాబు రుసరుస
‘స్పెషల్’ ఎఫెక్ట్
శ్రీకృష్ణ నివేదికపై చర్చకు ఇంటికి రమ్మన్న బాబు
తెలంగాణ టీడీపీ శాఖ కోసం నాగం వర్గం పట్టు
బాబు నివాసానికి వచ్చేందుకు ససేమిరా...
ప్రత్యేక శాఖ ఇస్తేనే వస్తామని పేచీ
నో అన్న బాబు.. ఉద్యమాలు చేసుకోండి, శాఖ అక్కర్లేదని సూచన... వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని
మీడియాకు లీకులు
చంద్రబాబు, నాగంల సారథ్యంలో రెండు గ్రూపులుగా
సమావేశాలు... తెరపైకి సమన్వయ కమిటీ
తర్వాత బాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన నాగం వర్గం... ఎటూ తేలని భేటీ; మళ్లీ 13న చర్చ


తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వేడి మరింత రాజుకుంది. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఆదివారం రోజంతా హైడ్రామా నడిపారు. ఉదయం నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం రక్తి కట్టించింది. రోజంతా జరిగిన హైడ్రామాలో నాగం వర్గాన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సన్నిహితుల నుంచి సంకేతాలు వెళ్లడం తెలంగాణ నేతల్లో కలకలం రేపింది. నాగం వర్గం డిమాండ్ చేసినంత మాత్రాన తెలంగాణకు ప్రత్యేక శాఖ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఇతర ప్రాంతాల నేతలు ప్రశ్నించడంతో చివరకు తెలంగాణ ఆందోళన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కథ తాత్కాలికంగా వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు... జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు నిర్వహించాల్సిన పాత్ర, పార్టీ తరఫున కార్యాచరణ తయారుచేసేందుకు గాను తన నివాసానికి రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోని ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు.

ఈ సమావేశానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్‌రాథోడ్, సీనియర్ నాయకుడు దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. అయితే పార్టీ సీనియర్లు నాగం, కడియం, ఎరబ్రెల్లిలు తాము ఈ సమావేశానికి రావడం లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తేనే వస్తామంటూ పేచీ పెట్టారు. నాగం నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పోటీ భేటీకి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఉమామాధవరెడ్డి, గంపా గోవర్దన్, హరీశ్వర్‌రెడ్డిలతోపాటు మాజీ మంత్రి కె. విజయరామారావు, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ విషయం మీడియాకు లీకవడంతో వాతావరణం వేడెక్కింది. రెండుగంటల పాటు ఇరుపక్షాలు వేర్వేరుగా చర్చలు జరిపాయి. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తేనే తాము అంగీకరిస్తామని నాగం బృందం పట్టుబట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయవద్దని బాబు వద్ద ఉన్న నేతలు అధినేతను కోరారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన మధ్యేమార్గంగా సమన్వయకమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు మీడియాకు ముందుగా లీక్ చేశారు. అందుకు కూడా నాగం వర్గం ఒప్పుకోకపోవడంతో ఏమీ తేల్చకుండానే లంచ్ విరామం ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు బాబు నివాసంలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా అందుబాటులో ఉన్న పార్టీ నేతలందరికీ వర్తమానం అందింది. ఈ సమావేశానికి నాగం తదితరులు వస్తారని, అప్పుడు మాట్లాడుకుంటారని ప్రచారం జరిగింది.

మాకు వేరే ఉద్దేశం లేదు
చంద్రబాబు ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చిన నాగం తదితరులు తమ అలక వెనుక కారణాలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ‘మాకెలాంటి ఉద్దేశం లేదు, మీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కాబట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు భేటీ అయ్యాం’ అని చంద్రబాబుతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు స్పందించిన చంద్రబాబు మీ ఆలోచన ఎలా ఉన్నా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి కదా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అవసరమైతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వచ్చిన వార్తలపై చంద్రబాబును నాగం ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు తప్పని బాబు వారికి సమాధానమిచ్చినట్లు సమాచారం.

అసలు ఆహ్వానం ఉందా?
సాయంత్రం బాబు నివాసంలో జరిగిన భేటీకి నాగం తదితరులకు ఆహ్వానం ఉందా? అన్న దానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. నాగం జనార్దనరెడ్డి, కడియం శ్రీహరి, ఎరబ్రెల్లి దయాకర్‌రావు మినహా మిగిలిన వారికి ఆహ్వానమిచ్చారని, అందుకే వారు రాలేదని కొందరు పేర్కొన్నారు. ‘సాయంత్రం సమావేశానికి మాకు ఆహ్వానం లేదు. ఆహ్వానం వచ్చిన వాళ్లు వెళ్లారు. మాకు రాలేదు కాబట్టి మేం వెళ్లలేదు’ అంటూ నాగం మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, ఆ ముగ్గురికి కూడా ఆహ్వానం ఉన్నా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే రాలేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు.

నాలుగున్నర గంటల ఎపిసోడ్
ఉదయం నాగం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయిన నాయకులు కూడా బాబు నివాసానికి చేరుకోవడంతో నాగం కూడా వస్తారని భావించారు. అయితే, సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన భేటీకి కూడా నాగం, కడియం, ఎరబ్రెల్లిలు హాజరుకాలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని, అవసరమైతే వారిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని, ఇష్టం లేని వాళ్లు కూడా వెళ్లిపోవచ్చని సమావేశంలో ఘాటైన వ్యాఖ్యానాలు చేశారని పార్టీ నేతలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నాగం కూడా ‘మమ్మల్ని వదులుకుంటామన్నారా? ఆయనకే అంత ఉంటే మాకెంత ఉండాలి. మాలాంటి వాళ్లను వదులుకుంటే తెలంగాణ ప్రాంతంలో పార్టీ జెండా దిమ్మెలు కూడా మిగలవు’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో నాగం వర్గం పార్టీ సీనియర్ నేత కె. విజయరామారావు నివాసంలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయిన నేతలు నాగం వర్గాన్ని కూడా పిలిపించాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో లేనప్పటికీ బాబుకు ఫోన్ చేసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

దీంతో చంద్రబాబు అంగీకరించి వారికి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించారు. చంద్రబాబే ఫోన్ చేయడంతో నాగం, కడియం, ఎరబ్రెల్లి సాయంత్రం 7:40 గంటల సమయంలో సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఆ సమయంలో చంద్రబాబు తన మూడురోజుల పర్యటనకు బయలుదేరేందుకు నివాసంలోని తన గదిలోకి వెళ్లిపోవడంతో కొంతసేపు నేతలంతా ఎదురుచూశారు. సమావేశ మందిరానికి వచ్చిన తరువాత ఓ ఐదు నిమిషాలు నాగంతో మాట్లాడిన చంద్రబాబు తాను వెళ్లాల్సిన రైలుకు సమయం కావడంతో 13వ తేదీన మరోసారి కూర్చుని మాట్లాడుకుందామంటూ వెళ్లిపోయారు.

తెలుగుదేశంలో తెలంగాణ కుంపటి
babu-gunt 
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులలో నెలకొన్న గందరగోళానికి తెరదింపేందుకు తెలంగాణ సమన్వయ సంఘాన్ని (టీడీపీటీసీసీ) ఏర్పాటుచేయనున్నారు. పార్టీని కాపాడు కోవడం, అదే సమయంలో తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలు నిర్వహిం చడం, ప్రత్యర్థి పార్టీల దుష్ర్పచారాన్ని అడ్డుకుని తిరిగి ప్రజలకు చేరువయ్యేందుకు సమన్వయ సంఘం ఏర్పాటుచేయాలన్న సీనియర్ల డిమాం డును బాబు అంగీకరించారు. ఇకపై తెలం గాణకు సంబంధించి చేయనున్న ఆందోళనలు, ఉద్యమాలు, నిర్ణయాలు ఈ బ్యానర్‌ పక్షానే నిర్వహించనున్నారు. ఈనెల 13న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నగరానికి వచ్చిన తర్వాత నేతలతో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

బహుశా సంక్రాంతి రోజున కమిటీ విధివిధానాలు, సభ్యుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు ప్రత్యేక శాఖ కావాలని నలుగురయిదుగురు సీనియర్లు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, మెజారిటీ నేతలు మాత్రం కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న టీఆర్‌సీసీ మాదిరిగానే తమకూ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటుచేయాలని గత కొద్దిరోజుల నుంచి బాబుకు సూచిస్తూ వస్తున్నారు. దీని ద్వారా తాము తెలంగాణపై కలసి కట్టుగా పని చేయవచ్చని, దానితోపాటు కొందరు నాయకులు సొంత అజెండాతో పనిచేస్తున్నారన్న అపవాదును కూడా ఈ కమిటీ ఏర్పాటుతో పోగొట్టి, అంతా సమిష్ఠిగా ఉన్నామన్నసంకేతాలు పంపించవచ్చని బాబుకు వివరిస్తూ వస్తు న్నారు. ఇదే సమయంలో తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల్లో ప్రత్యర్ధులు నాటిన దురభిప్రాయాన్ని కూడా తొలగించవచ్చని సూచించారు. దానికి స్పందించిన బాబు మీరంతా కలసికట్టుగా ఒక మాట మీద ఉంటే అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దానితో టీడీపీటీసీసీ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. అయితే, ఇప్పటికే ఉన్న టీడీపీ తెలంగాణ ఫోరంను యథాతథంగానే కొనసాగించనున్నారు.

దానిని మరింత బలపరిచి, సమిష్ఠి నిర్ణయాలు తీసుకునేందుకు దానికీ ఒక కమిటీని వేయాలని పలువురు ఎమ్మెల్యేలు బాబుకు సూచించారు. అంటే నాగం జనార్దన్‌రెడ్డిని కన్వీనర్‌గా కొనసాగిస్తూనే మిగిలిన వారిని కో కన్వీనర్లను నియమించాలని యోచిస్తున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణతో పాటు, గ్రేటర్‌ హైదరాబాద్‌- రంగారెడ్డి నుంచి కూడా ఒకరిని కో కన్వీనర్లుగా నియమించే అవకా శం ఉంది. ముగ్గురు కో కన్వీనర్లను నియమించే అవకాశా లున్నాయంటున్నారు. దీని ద్వారా సమిష్ఠి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అప్పుడు సమిష్ఠి బాధ్యత కూడా పెరిగి, ప్రత్యర్థి పార్టీలపై సమర్థవంతంగా దాడులు చేయవచ్చని పలువురు తెలంగాణ సీనియర్లు బాబుకు సూచించారు. ఇక టీడీపీటీసీసీకి బీసీ లేదా ఎస్సీ నేతకు కన్వీనర్‌ బాధ్యతలు అప్పచెప్పవచ్చని తెలుస్తోంది.

బీసీ అయితే దేవేందర్‌గౌడ్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎల్‌.రమణలో ఒకరిని; ఎస్సీలయితే మోత్కుపల్లి నర్శింహులును నియమించవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి కన్వీనరు ఉండాలా ? లేక అంతా సభ్యులే ఉండాలా అన్నది ఇంకా నిర్ణయం కాలేదంటున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పకపోయినా ఆ పార్టీ నాయకులు ఎక్కడా సోనియాగాంధీ ప్రస్తావన తీసుకురావడం లేదని, ఆమెపై ఒత్తిడి చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. కానీ తమ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం బాబుపై ఒత్తిడి చేయడం వల్ల ప్రజల్లో పార్టీ అప్రతిష్ఠ పాలవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇకపై తాము కూడా టీడీపీటీసీసీని ఏర్పాటుచేసుకుని కాంగ్రెస్‌ వైఖరినే అనుసరిస్తామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో చిక్కుకో కూడదని, ఇప్పటివరకూ సమిష్ఠి నిర్ణయాలు లేకపోవడం వల్లే తాము ప్రత్యర్థులకు దొరికిపోతున్నామని విశ్లేషించా రు. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం, టీడీపీటీసీసీలకు కమిటీలు ఏర్పాటుచేసుకోవడం వల్ల సమిష్ఠి నాయకత్వా నికి చోటు కల్పించటంతో పాటు, ఇకపై ఎవరికీ సొంత అజెండాను అమలుచేసే అవకాశాలు ఉండవని తెలంగాణ సీనియర్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఈ కమిటీని ఎవరైనా అంగీకరించవలసిందేనని, లేకపోతే వారికి కచ్చితంగా సొంత అజెండాలు ఉన్నట్లుగానే మిగి లిన వారు భావించవలసి ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక శాఖ వల్ల పార్టీ నిలువునా చీలిపోయిందన్న భావన ఏర్పడుతుందని, జాతీయ పార్టీలయిన కాంగ్రెస్‌-బీజేపీకి సైతం ప్రత్యేక శాఖ లేనప్పుడు, ప్రాంతీయ పార్టీ అయిన మనకు ప్రత్యేక శాఖ ఉండాలన్న వాదన సమంజసంగా ఉండదని కొట్టిపారేస్తున్నారు. టీఆర్‌ఎస్‌టీసీసీ-ఫోరం సంయుక్తంగానే ఉద్యమాలు చేపట్టే వెసులుబాటు ఉన్నం దున, ఆ మేరకు పోరాట కార్యక్రమాలు రూపొందించు కుంటామని సీనియర్‌ నేతలు చెబుతున్నారు.