తెలుగుదేశం అధినేత చంద్రబాబు పశ్చిమలో ఒక రోజు యాత్ర వినూత్నంగా సాగింది. రాజకీయంగా యువనేత జగన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రా సొమ్ములకు కక్కుర్తిపడ్డారంటూ ఆరోపణలు విసిరారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ తక్కువేమీ తినలేదంటూ ఆక్షేపించారు. కిరణ్‌కుమార్ సర్కార్ పనికిరాని సర్కార్ అంటూ నిందలు మోపారు. కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలంటూ శాపనార్థాలు పెట్టారు. రైతుల కోసం అంతో ఇంతో చేయాల్సి వస్తే మేమే చేస్తామని, వర్గాలకు, ఇతరత్ర వాటికి దూరంగా కలిసికట్టుగా తమ పోరాటాలకు తరలిరావాలని రైతులకు పిలుపునిచ్చారు.
అక్కడక్కడ రైతుల నుంచే నేరుగా అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు జరుగుతుందా, లేదా అంటూ ఆరా తీశారు. మీరెలా కష్టాలు పడుతున్నారంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అవినీతిని పదేపదే ప్రస్తావిస్తూ దీనిపై పోరాటం తప్పదని ప్రకటించారు. అంతలోనే పార్టీపరంగా తాము ఎలా శ్రమపడ్డామో బాబ్లీ దగ్గర నుంచి నిమ్స్ వరకు సాగిన నిరాహార దీక్ష వ్యవహారాన్ని అందరికీ గుర్తుకు తెచ్చే ప్రయత్నమూ చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు చంద్రబాబు పశ్చిమలో తన పర్యటనను కొనసాగించారు. రాత్రి పొద్దుపోయిన తరువాత దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వలిలో జరిగిన రైతు సదస్సులో ఆత్మహత్యలకు పాల్పడినా, గుండెపోటుతో మృతి చెందినా కౌలు రైతు కుటుంబాల్లో ఒక్కొ కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా తమ బాట, మాట రైతుల వైపేనంటూ చంద్రబాబు అందరికీ నచ్చచెప్పే ప్రయత్నము తుది వరకు కొనసాగించారు. వాస్తవానికి చంద్రబాబు రెండు రోజుల క్రితమే జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ పనులు, పండుగ సీజన్ అడ్డు వస్తున్నా ఖాతర్ చేయకుండా కృష్ణా జలాల వినియోగం, జరిగిన నష్టం, తదితర అంశాలనే తీసుకుని నేరుగా రైతుల వద్దకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఆయన తొలి అడుగు పశ్చిమలో మోపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఆయన యాత్రకు బయలుదేరారు. పెద్ద తాడేపల్లిలో ఆయన ఎడ్ల బండి ఎక్కి ఆ ఊరి రైతులకు కాస్తంత ఊరటనిచ్చారు.
రైతులు పడుతున్న కష్టం, నష్టం అంతా తనకు తెలుసునని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అత్యంత ఘోరమంటూ ఆరోపణలు గుప్పించారు. రైతులకు అండగా ఉంటానంటూ గట్టి భరోసా ఇచ్చారు. పనిలోపనిగా జలయజ్ఞం పనులను ప్రస్తావించారు. ఈ పనుల్లో రైతులకు ఒరిగిందేమీలేదని, వైఎస్ సర్కార్ అంతా దోచుకుందని ఆరోపించారు. తాడిపూడి కాల్వకు సమాంతరంగా పోలవరం కాల్వను తవ్వి కొత్త అక్రమాలకు తెరలేపారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడబోమని ఆక్షేపించారు. పనిలోపనిగా తాడేపల్లిగూడెం-నల్లజర్ల మధ్యన నిర్మాణంలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులను స్వయంగా చూశారు. ఈ పనుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.
జలయజ్ఞం కాదు అంతా ధన యజ్ఞమేనని అభివర్ణించారు. ఆ తరువాత నల్లజర్లలో జరిగిన పొగాకు రైతుల సదస్సులో కూడా కాసేపు పాల్గొన్నారు. మెట్ట ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు మాత్రమే ఈ సదస్సులో పాల్గొన్నారు. పొగాకు రైతులు పడుతున్న పాట్లను ఆయన ప్రస్తావిస్తూ పొగాకు రైతులకు ఇచ్చిన రుణంపై మారటోరియం ప్రకటించాలని, అదనంగా కొత్త రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావని బాధను వ్యక్తం చేశారు. ఈవిషయంలో తాను వెనుకంజ వేసేదిలేదని, అండగా నిలుస్తానని ప్రకటించారు. అలాగే ఇంకోవైపు పామాయిల్ రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ పామాయిల్‌కు కనీస మద్దతు ధరను 8 వేల 500 రూపాయలుగా ఉండాలని డిమాండ్ చేఉశారు. నష్టపోయిన పామాయిల్ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
నల్లజర్లలో ఇంజనీరింగ్ విద్యార్థితోపాటు మిగతా విద్యార్థులు కూడా రైతు సదస్సుకు తరలివచ్చారు. తాము ఎదుర్కొన్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. రైతాంగ సమస్యలతోపాటు వారి కుటుంబాలకు చెందిన విద్యార్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకాదని, ఈ విషయంలో తాను అన్ని విధాలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పేర్కొన్నారు. నల్లజర్ల నుంచి భీమడోలు, గుండుగొలను, దెందులూరు, దోసపాడు మీదుగా ఆయన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కొవ్వలికి చేరుకున్నారు. మార్గమధ్యలో కౌలు రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వై.ఎస్ హయాంలో జరిగిన అవినీతిని నేరుగా ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా వదలకుండా దోపిడీ చేశారని ఆరోపించారు.
వై.ఎస్ ఏకంగా తన కొడుకుకి, బంధువులకు లక్ష కోట్లు దోచిపెట్టారని నిందించారు. వీటితోనే దినపత్రిక, చానల్ పెట్టడంతోపాటుగా మిగతా పరిశ్రమలను అడ్డగోలుగా స్థాపించి దండుకునే ప్రయత్నం చేశారన్నారు. పనిలోపనిగా ఉల్లి, కూరగాయల ధరలను కూడా ప్రస్తావిస్తూ అసలు వీటి సంగతి మీరు పట్టించుకుంటున్నారా అంటూ మహిళలనుద్దేశించి ప్రశ్నించారు. తామంతా ఉల్లిపాయ కోసి చాలాకాలమైందని, ధరలు అందుబాటులోలేవని కొందరు నేరుగా చంద్రబాబుకే తేల్చిచెప్పారు. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ కేడర్‌పై అనవసరంగా కేసులు బనాయిస్తున్నారని, ఇది గనుక జరిగితే కాంగ్రెస్ నేతలు మాడి మసైపోతారంటూ శాపనార్ధాలు పెట్టారు. అధికారం ఉందికదా అని విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కొవ్వలిలో జరిగిన రైతు సదస్సుకు భారీగా రైతులు, స్థానికులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.
అంతుకుముందు చాలాచోట్ల చంద్రబాబుపై కొందరు అమిత అభిమానాన్ని ప్రదర్శించారు. కొందరు పువ్వులు చల్లి ఆనందం ప్రకటించగా, మరికొందరు హారతులతో ఎదురేగారు. చంద్రబాబు మాత్రం ఎక్కడా కూడా వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని, వైఎస్.జగన్ చేష్టలను చెప్పకుండా మాత్రం ప్రసంగం ముగించిన దాఖలాలులేవు. ఆయన లక్ష్యం యావత్తు జగన్‌వైపే కనిపించింది. ఎక్కడా కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ అంశాలను ప్రస్తావించకుండా జాగ్రత్త వహించారు. నేతలను కూడా ఆమేరకు కట్టడి చేసినట్టే కనిపించింది. కొవ్వలిలో జరిగిన రైతు సదస్సుకు మాత్రం అపూర్వమైన మద్దతు కనిపించింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ రాష్ట్ర నేత మాగంటి బాబులు అద్భుతంగా సభను నిర్వహించారు.

రాష్ట్ర సంపదను వైఎస్ కుటుంబం కొల్లగొట్టింది
రాష్ట్రంలోని భూగర్భ ఖనిజ సంపదను వైఎస్ కుటుంబం కొల్లగొట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్థానిక ఆర్ అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేకర్లతో సోమవారం మాట్లాడారు. ఓబుళాపురం బయేటీస్ గనులు,బాక్సెడ్ గనులను లక్ష ఎకరాలను వైఎస్ అల్లుడుకి కట్టబెట్టేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో భూమి సేకరణ కోసం రైతుల వద్ద నుంచి ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నారని మండిపడ్డారు. రెండు పంటలు పండే భూములను తక్కువ ధరకు తీసుకున్నారని అన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 
పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు దీనస్థితిలో ఉన్నారని, రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో పంటను రైతులు నష్టపోయారన్నారు. అసల ప్రభుత్వం ఉన్నదా... అనే విధంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని, జలయజ్ఞం ధనయజ్ఞనంగా మారిందని విమర్శించారు. తాళ్ళపూడి, పోలవరం కాలువలు నిరుపయోగంగా మారాయన్నారు. ఎస్ ఇజెడ్ పేరుతో రైతుల పొలాలను లాక్కున్నారన్నారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను ఒక కుటుంబానికి చెందిన వారే చేజిక్కించుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ దీక్ష ఢిల్లీలో కాదని, ఇడుపులపాయలో చేయాలని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మయమైందన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో రూ. 1.76లక్షల కోట్ల అవినీతి జరిగినట్టు చెప్పారు. కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయందని చంద్రబాబు నాయడు దుయ్యబట్టారు.
సోనియా గాంధీకి ముడుపులు అందుతున్నందు వల్లే లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందన్నారు. భోఫోర్స్ కుంభకోణంలో కత్రోచిని కాపాడేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు అమ్మేసి వాటిని రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో జరిగిన కుంభకోణాల్లో సోనియా గాంధీకి వాటాలు అందాయని ఆరోపించారు. అందువల్లే ఆమె వీటిని పట్టించుకోవటంలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలన రైతులపాలిట శాపంగా మారిందన్నారు. రైతుకు ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రభుత్వం వేలకోట్ల అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవటంలేదన్నారు. పెంటపాడు మండలంలో రైతులు పూర్తిగా పంటనష్టపోయి ఉన్నారని, రంగుమారి,మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారన్నారు. దోచుకో... దాచుకో...అన్న రీతిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్‌జగన్ అడ్డాన్స్ ట్యాక్స్‌గా రూ. 87కోట్లు చెల్లించారంటే ఎంత ఆస్థిని కూడబెట్టారో అర్ధమవుతుందన్నారు.
దేశంలో అవినీతి పెరిగిపోయిందని దీనిని అరికట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై తాను రాజీలేని పోరాటం చేస్తానన్నారు. కృష్ణానది జలాలపై మనకు రావాల్సిన వాటాను రాబ ట్టేందుకు ట్రిభ్యునల్ ఎదుట సరియైన వాదనలు వినిపించకపోవటం వల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో ఎంపిలు అసమర్థులుగా వ్యవహరించారన్నారు. తెలంగాణా విషయమై విలేకర్లు ప్రస్థావించగా కేవలం రైతుల విషయమై మాట్లాడడానికి వచ్చానని సమాదానం దాటవేశారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముళ్ళపూడి బాపిరాజు,గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, మాగంటి బాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు(శివ),ఎమ్మెల్సి బొమ్మిడి నారాయణరావు, దేశం సీనియర్‌నాయకులు గాదిరాజు బాబు, ఉంగుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గన్ని వీరాంజనేయులు, నాయుడు రామచంద్రరావు,మెంటే పార్థసారది, బడేటి బుజ్జి, తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాళ్ళు కొండ్రెడ్డి హైమావతి, మాధవరపు బాజీ, కిల్లాడి ప్రసాద్,గొర్రెల శ్రీధర్, బొద్దాని శ్రీనివాస్, బడుగు వెంకటేశ్వరరావు, దాసరి అప్పన్న,పెంటపాడు జడ్పిటీసి సభ్యుడు తెన్నేటి సంజాయ్‌ఖాన్, మాజీ జడ్పిటిసి సభ్యుడు ఆకుతీగపాడు బాబు, రంపా చింతన్న, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఎస్ కృష్ణమోహన్, ఈదుపల్లి వాసు, పద్మనాభుని మురళీ,రెడ్డి చందు, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండల టిడిపి అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, బాలం కృష్ణ, పెంటపాడు మండల తెలుగుయువత అధ్యక్షుడు కొల్లూరి నాగరాజు,టిడిపి సీనియర్ నాయకులు గూడెపు సత్యనారయణ, కొయ్యలమూడి బ్రహ్మానందం తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment