మంత్రివర్గం పేర్ల నా చేతే రాయించారు
రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ శకం ఒకటుంది. తెలుగుదేశం ఏర్పాటు... తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపన దగ్గర నుంచి అనూహ్యంగా సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం దాకా - ఆ శకంలో జరిగినవన్నీ ఆసక్తికరమైన సంఘటనలే. వీటన్నింటిలోను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకమైన పాత్రలు పోషించారు. అలాంటి ఐపీఎస్ అధికారుల్లో హెచ్.జె. దొర ఒకరు. ఆయన ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను క్రోడీకరించి రాసిన పుస్తకమే- 'ఎన్టీఆర్‌తో నేను..' ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే - ఎన్టీఆర్ వ్యక్తిత్వమే కాదు ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వెనకున్న అసలు రహస్యాలు కూడా తెలుస్తాయి. ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం...
రాముని మించిన రాముదు..
గంభీరంగా కనిపించే తారక రామారావులోని లోపలి మనిషి వేరు. నిజానికి ఆయనది చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. భోజనాల దగ్గర అది స్పష్టంగా బయటపడుతుండేది. కుటుంబసభ్యులు వడ్డించకుండా నౌకర్లు వడ్డిస్తే ఆయన కోప్పడేవారు. అది ఆయనకు అస్సలు ఇష్టం వుండేది కాదు. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆయన సతీమణి శ్రీమతి బసవతారకం భోజనం క్యారియర్ తీసుకుని సచివాలయానికి వెళ్లి స్వయంగా వడ్డించేవారు. ఒకసారి ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి మరోచోటుకి బయల్దేరి వెళ్లాల్సిన సందర్భంలో ఇంటినుంచి క్యారియర్ వచ్చింది కానీ, తన కుటుంబసభ్యులు ఎవ్వరూ రాలేదు. దాంతో ఆయన ఇంటికి ఫోన్ చేసి తన ఆఖరమ్మాయితో 'నీవు రానందుకు భోజనం చేయలేదమ్మా' అని చెప్పి అలక ప్రదర్శించుకున్నారు. అంత సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా వుండేవారు ఎన్టీఆర్.
* * * చిత్రం.. భళారే విచిత్రం..
ఎన్టీఆర్‌కి కళలంటే మక్కువ ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా కళాకృతుల మీద, శిల్పాల మీద చూపు వుండేది. అవంటే చాలా ఆసక్తి. కొనడానికి ఎంత డబ్బు అయినా వెనుకాడేవారు కాదు. చాలామంది శిల్పకళాకారులు ఆయనకి తెలుసు. కర్నూలు, ఆళ్లగడ్డ నుంచి తరచూ శిల్పులు వస్తుండేవారు ఆయన దగ్గరకి.. తమిళనాడుకు చెందిన గణపతి స్థపతితో ఎన్టీఆర్ తరచూ సంప్రదిస్తుండేవారు. ముఖ్యమంత్రి అయ్యాక వీరందరికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో విరివిగా అవకాశం ఇచ్చారు. గణపతి స్థపతిని తన ఆస్థాన శిల్పిగా కూడా నియమించుకున్నారు.
చక్కని దస్తూరి ఎన్టీఆర్ సొంతం. ఆయన పేపరు మీద పెన్ను పెడితే అక్షరాలు ముత్యాల్లా మెరిసిపోతుండేవి. పాఠశాల రోజుల్లో సహవిద్యార్థులు తనతో పుస్తకాల అట్టల మీద పేర్లు రాయించుకునేవారని ఎన్టీఆర్ చెప్పుకునేవారు. స్వతహాగా తారకరాముడు మంచి ఆర్టిస్ట్. బాగా బొమ్మలు వేసేవారు. షూటింగ్‌లకోసం స్టూడియోలో సెట్టింగ్స్ నిర్మించేముందు ఎన్టీఆర్ కళాదర్శకులకి ముందే ప్లాన్ గీసిచ్చేవారు. తనకు ఎటువంటి సెట్స్ అవసరమో ముందే పేపర్ మీద ప్లాన్ గీసి ఇవ్వడం వల్ల ఆనక వారికి పని సులభంగా వుండేది. పైగా ఆ ప్లాన్ ప్రకారం అద్భుతమైన సెట్టింగ్స్ వచ్చేవి. భవనాలు, కట్టడాల విషయంలో ఎన్టీఆర్‌కు వెంకట్రామిరెడ్డి కన్సల్టెంట్‌గా వుండేవారు. వీళ్లిద్దరూ కలిశారంటే మయసభ తరహా భవన నిర్మాణాలు రూపుదాల్చేవి. రాష్ట్ర మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో హెడ్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డితో ఎన్టీఆర్ సెక్రటేరియట్‌లోని టెంపుల్ ఆర్కిటెక్చర్ పనులన్నీ శ్రద్ధగా చేయించారు. అలాగే బూర్గుల రామకృష్ణారావు భవనం, తెలుగు లలిత కళా తోరణం నిర్మాణపనులు కూడా ఆయన చేతుల మీదుగానే జరిగాయి.

* * * స్పెషల్ టీ పట్రా..
ఎన్టీఆర్ ఆఫీసు ఫైల్స్ చూస్తున్నారంటే అదొక అష్టావధానమే! రాఘవేంద్రరావు టూకీగా విషయాన్ని చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన దానిపై సంతకం పెట్టేవారు. ఫైల్‌కు ఫైల్‌కు మధ్య గ్యాప్‌లో జోక్స్ పేలుతుండేవి. ఇంతలో నేనో, మరొకరో రంగప్రవేశం చేసేవాళ్లం. మమ్మల్ని చూడ్డంతోనే ఆయన ఈ పూటకి ఇక ఫైల్స్ చాలండీ.. అనేవారు. వంటవాడిని పిలిచి స్పెషల్‌గా టీ చేసి పట్రా.. అని పురమాయించేవారు. ఈ విధంగా ఫైల్స్ చూసే కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయేసరికి ఆఫీసర్లంతా నన్ను తిట్టుకునేవారు. అసలు విషయం ఫైళ్లు చూడటము ఆయనకు అంత ఇష్టముండేది కాదు.
* * * అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేద్దాం...
1994 ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే నాకు ఎన్టీఆర్ నుంచి కబురు వచ్చింది వెంటనే రమ్మని.. నేను మర్యాదపూర్వకంగా వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి అభినందించాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. పదవీ ప్రమాణం చేయడానికి డిసెంబర్ 12వ తేదీ ఉదయం వేళలో ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తాన్ని పెట్టింది బి.వి. మోహన్‌రెడ్డి. ఆయనతోనే ముహూర్తం పెట్టించడం ఎన్టీఆర్‌కు సెంటిమెంట్. లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారమని చెప్పారు. ఆ ప్రదేశం అచ్చి రాలేదని ఇదివరకు ఎన్టీఆర్ అంటుండేవారు. అయినా ఈసారి కూడా అక్కడే ప్రమాణ స్వీకారమని అన్నారు.
సరే, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఎవర్ని పెట్టుకోవాలి? ఎవరైతే బాగుంటుందని నన్ను అడిగారు ఎన్టీఆర్. ఈ విషయం మీద కొంత తర్జనభర్జన జరిగింది. ఇంతకుముందు ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మసలిన ఆఫీసర్లు అందరూ సీనియర్ పొజీషన్లో ఎక్కడెక్కడో వున్నారు. సరైన వారు అని అనుకున్నవారంతా ఢిల్లీలో వున్నారు. వారిని రమ్మనడం సరైనది కాదు. నేను అన్నీ ఆలోచించి సిఎస్‌రావు పేరు సూచించాను. అయితే ఎన్టీఆర్ వెంటనే సుముఖత చూపలేదు. జయప్రకాశ్ నారాయణ్‌ను ఒక కార్యదర్శిగా తీసుకోవచ్చునని చెప్పాను. కానీ ఆయన గవర్నర్‌కు కార్యదర్శిగా వుంటున్నారు. అక్కడినుంచి వత్తిడిచేసి ఆయన్ని తీసుకురావాలి. ముహూర్తం తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే నేను ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి కలిశాను.
రండి.. కూర్చోండి అంటూ ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి చేసిన బందోబస్తు ఏర్పాట్లు గురించి చెప్పాలని నా ప్రయత్నం. కానీ, ఆయన నా మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేరు. మీరు వుండండి అంటూ నన్ను కూర్చోపెట్టేశారు. నాకు ఓ పక్క టెన్షన్ పెరిగిపోతోంది. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. సిటీ కమిషనర్‌గా అవతల బందోబస్తు వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యత నాపై వుంది. నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయి వున్నాను. ఎన్టీఆర్ వుండమంటున్నారు. ఎందుకో ఏమో తెలియదు. తప్పదు కదా! అలానే వుండిపోయాను. ఆయన తనను కలవడానికి వచ్చిన అభిమానులందరినీ పంపించేసి వచ్చి కూర్చున్నారు. ఇంతలో చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్ ఆయనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయారు. ఆయన కూడా చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయారు. బాబు అలా వెళ్లగానే ఎన్టీఆర్ నన్ను రమ్మని తనూ లోపలికి నడిచారు. అక్కడ ఇద్దరం కూర్చున్నాక నన్ను ఒక పేపర్ తీసుకోమని చెప్పారు.
"చెప్పండి.. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకుందాం..'' నేరుగా టాపిక్‌లోకి వచ్చేశారు. ఆశ్చర్యపోతూ అడిగాను- "అదేమిటీ...? ఇవాళ మీరొక్కరే కదా ప్రమాణం చేస్తున్నది..'' వెంటనే ఆయన రిప్లయ్.. "నోనో.. అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేద్దాం.. నాతోపాటు మరికొందరు కూడా ప్రమాణం చేస్తారు. మీరు ముందు పేర్లు రాయండి.''
ఆయన నిర్ణయానికి తిరుగులేదు కదా. జాబితా తయారుచేయడానికి సిద్ధపడ్డాను. అక్కడ మరో వ్యక్తి లక్ష్మీపార్వతి కూడా కూర్చుని వున్నారు. మా ఇద్దరి సంభాషణల మధ్య మూడో వ్యక్తి.. నాకు కాస్త ఇబ్బందిగానే వుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు వివరించే సమయంలో ముఖ్యమంత్రికి, మాకు మధ్య మరెవ్వరూ వుండేవారు కాదు. అసలు బయటి వ్యక్తులు ఎవరున్నా మేం విషయాలు చెప్పం. చివరికి ఆయనే చెప్పడం మొదలు పెట్టారు. ముందు చంద్రబాబునాయుడు పేరు చెప్పి రాసుకోమన్నారు. వివాదాస్పదం కాని వ్యక్తులు బి.వి. మోహన్‌రెడ్డి, అశోక్ గజపతిరాజు పేర్లు రాశాను.
పశ్చిమగోదావరి జిల్లా నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, గుంటూరు జిల్లా నుంచి మాకినేని పెదరత్తయ్య, నల్గొండ జిల్లా నుంచి ఎం నర్శింహులు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇంద్రారెడ్డి, వరంగల్ నుంచి ప్రణయ్ భాస్కర్ (తన అభిమాని) పేర్లు రాశాను. అంతకుముందు ప్రతిపక్షంలో వున్నప్పుడు డిప్యూటీ లీడర్లుగా వ్యవహరించిన కోటగిరి విద్యాధరరావు, ఎ. మాధవరెడ్డి విషయంలో ఆయన పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇష్టం లేనట్టుగా 'తర్వాత చూద్దాం..' అనేశారు. ఈ పేర్లన్నీ టైప్ చేసి ప్రింటవుట్ తీసేందుకు అక్కడ టైపిస్ట్ కూడా ఎవరూ లేరు.
పుస్తకం: ఎన్టీఆర్‌తో నేను
రచయిత: హెచ్.జె.దొర, పేజీలు: 189
ధర: 90 రూపాయలు, ప్రచురణ: ఎమెస్కో
ప్రతులకు: 040 23264028

No comments:
Post a Comment