'కృష్ణా జలాల విషయంలో మనకు అన్యాయం జరిగింది... న్యాయం కోసం పోరాటం చేస్తా. కొల్లేరు సమస్యలు పేదల కొంపలు ముంచు తున్నాయి... వాటి పరిష్కారానికి దారి చూపుతా. రాష్ట్రాన్ని అవినీతి తిమింగళాలు సర్వ నాశనం చేస్తున్నాయి... అవినీతిని పబ్లిక్ గానే కడిగి పారేద్దాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. '' అంటూ కృష్ణాజిల్లా పర్యటనలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై పైన, జగన్, సోనియా గాంధీల పైన ఆయన నిప్పులు చెరిగారు. బాబు కృష్ణాజిల్లా పర్యటనకు ఆనూహ్య స్పందన లభిం చింది. కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు, నియోజక వర్గాల్లో జరిపిన పర్యటనల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వైఎస్ అవినీతి పాలనతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలను తూర్పార పట్టారు. చంద్ర బాబు ప్రజలు, యువత, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తేనే సమస్యలు పరి ష్కార మవుతాయని, ప్రజాసమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ముందుం టుందని పేర్కొన్నారు.
తొలుత చంద్ర బాబు మాగంటి బాబు నివాసంలో తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంపై కొద్ది సేపు రోడ్ షో నిర్వహించారు. తరువాత స్థానిక పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండిపై రోడ్డుషోలో పాల్గొన్నారు. . కొల్లేటి వాసుల వెతలపై సభలో ఎమ్మెల్యే జయ మంగళ, మాగంటి బాబులు కొల్లేటి వాసులు ఎదుర్కొ ంటున్న సమస్యలను ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబును తగిన విధంగా స్పందించాలని కోరారు. ఆల్మట్టీ ఎత్తు పెంచేందుకు గతంలో దేవేగౌడ ప్రయత్నించారని, అయితే ఇతర రాష్ట్రాలనుంచి నిపుణులను రప్పి ంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆల్మట్టీ ఎత్తును 5119 మీటర్లకు పరిమితం చేశామని చంద్రబాబు తెలిపారు. టూజిస్పెక్ట్రం విషయంలో కేంద్రం సరైన విధంగా స్పందించలేదని, విమర్శిం చారు. 2జి కుంభకోణం విలువలో ఐదు వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించినా రైతులకు న్యాయం జరిగేదని చంద్ర బాబు పేర్కొన్నారు. కలిదిండి, సింగ రాయపాలెం, అల్లూరు, కోరుకొల్లు, డోకిపర్రు, వడ్ల మన్నాడు, ప్రాంతాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, వైఎస్ పాలనపై విమ ర్శలుగుప్పించారు.
డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు. 2004లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న వైఎస్ కుటుంబం ఇటీవల రూ.86 కోట్ల అడ్వాన్స్ టాక్స్ చెల్లించే స్థితికి ఎలా వచ్చిందని ప్రశ్నిం చారు. వైఎస్ అక్రమ సంపాదతో జగన్ ఎమ్మెల్యేలను కొంటున్నారని, లోబర్చు కునేందుకు ప్రయత్నిస్తున్నా రని విమర్శి ంచారు. సింగరాయి పాలెంలో చంద్రబాబు వైఎస్ రాజ శేఖరరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో తేదేపా ఎమ్మెల్యే లను, రోజాను పలు కారణాలతో కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేశారని, దేశం పార్టీని ఫినిష్ చేస్తాననీ వైఎస్ వ్యాఖ్యా నించారని, అయితే ఎంత మంది వైఎస్‌లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చెయ్యలేరని బాబు అన్నారు.

కొల్లేటి వాసుల హక్కుల కోసం రాజీలేని పోరాటం
కొల్లేటి ప్రాంత వాసుల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో రైతు కోసం యాత్రలో భాగంగా మంగళవారం ఆయన కైకలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కైకలూరులోని టౌన్‌హాల్ ఆవరణలో శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆవేశపూరితంగా మాట్లాడుతూ కొల్లేటివాసులకు ఉపాధిని దూరం చేసిన పాపం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిదేనని ధ్వజమెత్తారు. తమ హయాంలో సుప్రీం కోర్టునుంచి ఎన్నిసార్లు నోటీసులు వచ్చినా కొల్లేటి ప్రాంత పేద ప్రజల నోటి వద్ద కూడు తీయడం సరికాదని ఆపరేషన్ కొల్లేరు కార్యక్రమాన్ని చేపట్టకుండా అభయారణ్యంపై మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. 2004లో కొల్లేటి ప్రజల దురదృష్టవశాత్తు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మానవత్వం లేకుండా ప్రవర్తించి పేద ప్రజలను భయబ్రాంతులను చేసి చేపల చెరువులను ధ్వంసం చేశారని అన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా వైఎస్ అండ చూసుకుని దుర్మార్గంగా ప్రవర్తించి కొల్లేటి పేదలను బజారున పడేశారని అన్నారు.
కొల్లేటి వాసులకు న్యాయం జరిగేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని ప్రకటించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) మాట్లాడుతూ కొల్లేటి వాసులకు వైఎస్ తీరని అన్యాయం చేశారని అన్నారు. తెలుగుదే««శం పార్టీ వచ్చే ఎన్నికల్లో అదికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొల్లేటి పేద ప్రజల హక్కులను కాపాడేందుకు తొలి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాను కొల్లేటివాసులకు అండగా ఉంటున్నానన్న కారణంగా కొందరు కాంగ్రెస్ నాయకులు తన మంత్రి పదవి పోయేందుకు కూడా పరోక్షంగా కుట్ర పన్నారని అంటూ కొల్లేటి వాసులకు న్యాయం చేసేంతవరకు తాను పోరాటం చేస్తానని ప్రకటించారు. శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఆపరేషన్ కొల్లేరు ద్వారా వైఎస్‌కు లక్షలాది మంది పేద ప్రజల ఉసురు కొట్టిందని, ప్రస్తుతం వైఎస్ పై లోకాల్లో నరకం అనుభవిస్తున్నాడని అన్నారు. తాము శాశ్వతంగా ఉపాధి కోల్పోతున్నామని కొల్లేటి వాసులు ప్రాధేయపడినా పట్టించుకోకుండా వారి జీవన భృతిపై దెబ్బ కొట్టారని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో కొల్లేరు సరస్సు ఏరియాలోని ప్రజలు సుఖశాంతులతో జీవించారని అన్నారు. ఎమ్మెల్యే తన ప్రసంగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై పలు శాపనార్దాలు పెట్టారు. ఈ సభలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య, కొడాలి నాని, దాసరి బాలవర్దనరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చిన్నం రామకోటయ్య, శ్రీరాంతాతయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉండి శాసనసభ్యుడు వేటుకూరి శివరామరాజు,పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు బచ్చుల అర్జునుడు, చలమలశెట్టి రామానుజయ, నియోజికవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం చంద్రబాబు సభాప్రాంగణంలోకి రాగానే మహిళలు ఘనస్వాగతం పలికారు. బాబు మాజీ మంత్రి మాగంటి బాబు నివాసం నుంచి ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. నియోజకవర్గంలోని మండలాల పార్టీ శాఖల అధ్యక్షులు ఎర్నేని లక్ష్మణ ప్రసాద్, మత్తే సూర్యచంద్రరావు, అల్లం శ్రీనివాసరావు, ఫణి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్పీ కార్యకర్తలు దేశంలో చేరిక
కోరుకొల్లు, బొమ్మినంపాడు గ్రామా ల్లో కాంగ్రెస్ పీఆర్పీ నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు, చంద్ర బాబు సమక్షంలో తెలుగుదేశం సభ్య త్వం తీసుకున్నారు. రైతు సమస్య లకు సంబంధించి చంద్రబాబు జిల్లాలో పలు దఫాలు ఇప్పటికే క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ఈ పర్య టనలో చంద్రబాబు అసెంబీ ్లలోను, బయట ఆందోళనలను ఉధృతం చేశా రు. మలి దఫా జిల్లాలో బాబు రైతు కోసం యాత్ర చేపట్టడంతో పార్టీ శ్రేణు ల్లో ఉత్సాహం తొంగి చూస్తోంది. రైతు ఉద్యమం 'దేశం'కి అనూహ్య స్పందన రావడంతో తాజాగా బాబు పర్యటన జిల్లాలో దేశం మరింత బలపడటానికి టానిక్ నిచ్చి నట్లయ్యింది.
అర్థరాత్రి వరకు చంద్రబాబు పర్యటన
రైతుకోసం యాత్రలో భాగంగాజిల్లాలో సోమవారం చంద్రబాబు యాత్ర అర్ధరాత్రి వరకు జరిగింది. ఉదయం 9కు ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు బాబు కైకలూరులో మాగంటి బాబు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అది దాదాపు గంటా 40ని.వరకు ప్రారంభం కాలేదు. అక్క డ నుంచి కైకలూరుబహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహాన్ని చూసి ఎక్కువసేపు ప్రసంగించడంతో మూ డున్నర గంటలు ఆలస్యమైంది. సా యంత్రం 5 కల్లా ముగియాల్సిన యాత్ర అర్ధరాత్రి 12 వరకూ సాగడం విశేషం. అంతరాత్రిలోనూ ఆయన ఉద్విఘ్నంగా ప్రసంగించారు.
వైఎస్ హయాంలో జరిగిన జలయజ్ఞం... ఆయన కుటుంబానికి, అనుచరులకు ధనయజ్ఞంగా మారిందని, ఆ డబ్బుతోనే వైఎస్ తనయుడు జగన్ ‘దీక్ష’ల జల్సా చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ అవినీతి సొమ్ముతోనే జగన్, ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.రాష్ట్రానికితీరని అన్యాయం చేసి, కుక్కలు చింపిన విస్తరిని చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
‘రైతుకోసం’ యాత్రలో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ జగన్‌పై త్రీవ ఆరోపణలు చేశారు. ఆపరేషన్ కొల్లేరుతో సర్వం కోల్పోయి జీవనోపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్న కొల్లేటి ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అదనంగా కొట్టేసిన భూములను తిరిగి అప్పగించే వరకు నిద్రపోమని చంద్రబాబునాయుడు అన్నారు. భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు, పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లేటి ప్రజల పొట్ట కొట్టిందని వారి బతుకుల్లో వెలుగులు నిండాలంటే ఆపరేషన్ కొల్లేరు కింద ధ్వంసం చేసిన 7,500 ఎకరాల అదనపు భూములను తిరిగి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు చేపల సాగు చేసుకొని అభివృద్ధి చెందండి అని ప్రోత్సహించిన ప్రభుత్వం నేడు వారి బతుకుల్లో చీకటి నింపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తిరిగి వారి భూములను వారికి పంచకపోతే ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని ఆయన అన్నారు. ధ్వంసం చేసిన భూములను తిరిగి ఇవ్వకపోగా చిత్తడి నేలల సంరక్షణ చట్టన్ని కొత్తగా వెలుగులోకి తెచ్చి కొల్లేటి ప్రజలకు ఆవాసం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ జీవోను అమలు చేస్తే కేంద్రంపై అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో మాజీ ప్రధాని దేవగౌడ ఉండగా కర్ణాటకలో ఆల్‌మట్ట డాం ఎత్తు పెంచేందుకు ప్రయత్నం చేశారని, తాము ఢిల్లీ వెళ్లి వ్యతిరేకించి 519 అడుగులకే ఉండేలా పోరాటం చేశామన్నారు.
నేడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది అందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనమే అన్నారు. ట్రిబ్యునల్ వాదనలో ప్రభుత్వం పనికి రాని న్యాయమూర్తులను నియమించిదన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్నా కష్టాలను ప్రత్యక్షంగా చూసివెళ్ళలని ఈ యాత్ర చేపట్టనని ఈ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం పై విరుచుకుపడతాదన్నారు. చివరిగా పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవితాశయమని, రైతురాజ్యం రావాలని ఆయన ఆశయాలన్నారు. మొలకెత్తిన ధాన్యానికి సైతం మద్దతు ధర ఇవ్వాలని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని, కొల్లేటి ప్రజలకు 7,500 ఎకరాలను 16 వేల కుటుంబాలకు పంచాల్సిందేనని, చిత్తడి నేల చట్టన్ని రద్దు చేయాలని లేకపోతే తమ సత్తా చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ఉసురుతోనే వై. యస్ మృతి
కొల్లేరును ధ్వంసం చేసింది దివంగత ముఖ్య మంత్రి వై. యస్ నని ఆయన కోట్ల రూపాయాలు నొక్కేసి ప్రజ ల ఉసురు పోసుకున్నాడని, ఆ ఉసురు తగిలే అర్ధాంతరంగా చనిపోయాడని ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మా ట్లాడుతూ విమర్శించారు. రెైతు కోసం యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బలవంతంగా చెరువులను ధ్వంసం చేసి నిరాశ్రయులను చేసిందని ఆవేదన వ్యక్తం చే శారు. కొల్లేరు ముంపునకు చెరువులు కారణం కాదని 1900సం ప్రాంతంలోని ఎగువ ప్రాంతాల నీరు కొల్లేరు లోకి చేరి వరద తాకిడికి గురెైందని విషయాన్ని ప్రభుత్వాల కు తెలిపినా పట్టంచుకోలేదని వాపోయారు. వెై.ఎస్ ప్రభు త్వమే కొల్లేరు ప్రజల కొంప కొట్టిందన్నారు. జీవనాధారం లేక అల్లాడుతున్న కొల్లేటి ప్రజలకు అండగా వుండి, అసెంబ్లీలో పోరాటం చేసి తమ ప్రజలకు ఆధారం చూపాలని తమ అధినేత చంద్రబాబుకు విన్నవించారు. కొల్లేరు పెద్దలతో కలిసి వినతి పత్రం అందించారు.
ఆదుకోండి సారూ...: ఆపరేషన్ కొల్లేరులో చెరువులు కో ల్పోయి, జీవనోపాధి కరవెై ఆదరించాల్సిన బిడ్డలు కడుపు చేతపట్టి ఊరు వదిలి వలస పోయారు. పట్టెడన్నం లేక అర్ధా కలితో గడుపుతున్నాం. వండుకోలేక వెళ్లలేక ఉండిపోయిన మమ్మల్ని ఆదరించండి మహాప్రభో అంటూ మండలంలోని శృంగవరప్పాడుకు చెందిన బి.వరలక్ష్మీ, చంద్రావతిలు సభ లో దేశం అధినేత చంద్రబాబును వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి వెం కటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వ రరావు, ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యేలు దాసరి బాల వర్ధనరావు, శ్రీరాంతాతయ్య, చిన్నం రామకోటయ్య, చింతమనేని ప్రభాకర్‌రావు, గొరంట్ల బుచ్చయ్యచౌదరి అను రాధ, బచ్చుల అర్జనుడు, అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్, నాయకులు మత్తె సూర్యచంద్రరావు, చలమలశెట్టి రామానుజయ, కమతం విశ్వసం, సూర్యనారాయణ రాజు, త్రినాధ్‌రాజు, కమినేని శ్రీరామకృష్ణప్రసాద్, పొలవరపు ల క్ష్మిరాణి, పావులూరి హేమలత, ఎంపిపి జయమంగళ చిన సుబ్బారాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.
గజినీ, ఘోరీలను తలపించేలా

కొల్లగొడుతున్నారు
కాంగ్రెస్ నేతలపై చంద్రబాబు ధ్వజం
సోనియా మౌనానికి కారణం ముడుపుల బాగోతమే!
కాంగ్రెస్ నేతలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఘోరీ, మహ్మద్ గజనీలను తలపించేలా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా పర్యట నలో భాగంగా మంగళవారం కైకలూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఘోరీ, గజనీలు భూమిపై సంపదను కొల్లగొడితే వై.ఎస్.రాజశేఖరరెడ్డి గనులను కొల్లగొట్టుకోమని అయినవారికి అప్పగించారన్నారు.
గాలి బ్రదర్స్ ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకుని వైఎస్‌ను డబ్బుకట్టలతో సంతృప్తి పరచారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరినా సోనియాగాంధీ మౌనంగా ఉండటం వెనుక ముడుపుల బాగోతం దాగుందన్నారు. అవినీతి కేన్సర్ కన్నా ప్రమాదకరమని, రూ.లక్ష కోట్ల వైఎస్ అవినీతిపై మడమ తిప్పని పోరాటం చేస్తానని ప్రతిన బూనారు. వైఎస్ దోచుకున్న ఆ సొమ్మును వారసత్వంగా చేజిక్కించుకున్న జగన్మోహనరెడ్డి ఢిల్లీలో రైతుల పక్షాన ధర్నా చేయడం రాజకీయమేనని విమర్శించారు.
టీడీపీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను లొంగదీసుకుని సంతలో పశువులు మాదిరిగా బేరమాడి తీసుకెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను డబ్బుతో కొని అధికారం దక్కించుకోవాలని జగన్ ఆరాటపడుతున్నారని తెలిపారు. అతని ఆటలు సాగనివ్వబోమని.. అవినీతి సొమ్మును కక్కించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని అసమర్ధత ప్రభుత్వంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
చిత్తడి నేలల చట్టం దారుణం
ఆపరేషన్ కొల్లేరు పేరిట వైఎస్ తీసుకున్న చర్యలతో కొల్లేరు వాసులు దెబ్బతిని కోలుకుంటున్న దశలో చిత్తడి నేలల చట్టంలోకి కొల్లేరును తీసుకురావడం వారి కడుపుపై కొట్టడమేనని బాబు పేర్కొన్నారు. చిత్తడి నేలల చట్టం వల్ల కొల్లేరులో 5.50లక్షల ఎకరాలకు ముప్పు పొంచి ఉందని, దీంతో మూడు లక్షల మంది ఉపాధికి ఆటంకం ఏర్పడనుందన్నారు. అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానంటూ కొల్లేరు ప్రజలకు భరోసా ఇచ్చారు. సభలో మాజీ ఎంపీ మాం గటి వెంకటేశ్వరరావు(బాబు), టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవినేని ఉమామహేశ్వరరావు, అంబటి బ్రహ్మణయ్య, కైకలూరు ఎమ్మె ల్యే జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.

జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్‌లకు చంద్రబాబు క్లాస్ పీకారు. పార్టీ ఏ ఒక్కరిదీ కాదనీ, అందరూ కలిసి కట్టు గా పనిచేస్తేనే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలమని హితబోధ చేశారు. వన్‌మ్యాన్ షో కార్యక్రమాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, వ్యక్తిగత ప్రతిష్టకు పో కుండా నేతలందరూ ప్రతి కార్యకర్తను కలుపుకుని పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎనిమిది మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ ఉన్నారని, ఇలాంటి చోట ఐక్యమత్యంగా ఉండాల్సింది పోయి ఎవరి కి వారు భేషజాలకు పోవడం సబబు కాదని చురక వేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన బాబు కైకలూరులో మాగంటిబాబు ఇంట్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు.
జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరి సమక్షంలో చంద్రబాబు ముందు సానుకూలంగానే చర్చించా రు. తరువాత పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, వాటి ఫలితా లు, జిల్లా, నగరంలో పార్టీ తీరుతెన్ను లు, పోకడలు తదితర అంశాలకు సం బంధించి ఎమ్మెల్యేల ఎదుట ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పది మంది కి మంచిచెడ్డలు చెప్పాల్సిన జిల్లా నేత లు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని మసకబార్చడందారుణమైన విషయం గా పేర్కొన్నారు. దీనితో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. ముందుగా ప్రజా ప్రతినిదులందరూ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడంతోపాటు పార్టీ పరంగా పిలుపునిచ్చే కార్యక్రమాలకు దూరం గా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేనిపై చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారు.
ముందు సీరియస్‌గా స్పం దించిన ఆయన తరువాత సుతిమెత్తగా వంశీని సూటిగా ప్రశ్నించారు. సీపీ సీతారామాంజనేయులు ఫోన్‌ట్రాప్ లో వంశీ పేరు వినిపించడాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులతో సమస్యలు తెచ్చుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని సూచించినట్టు సమాచారం. అదే సందర్భంలో జిల్లా, అర్బ న్ నేతలు దీనిపై స్పందించకపోడాన్నీ ప్రశ్నించినట్లు తెలిసింది. బయటకు వచ్చిన పార్టీ నేతలు ఈ వ్యవహారానికి సంబంధించి వంశీపై సీరియర్ అయినట్లు చెబుతున్నారు. తరువాత చంద్రబాబు తన కోపాన్ని జిల్లా అధ్యక్షుడు దేవినేనిపై చూపించారు. పార్టీనంతా ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తరువాత దేవినేని, వంశీలను పక్క గదిలోకి తీసుకెళ్లి కొద్ది సేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు భేటీలో జిల్లా పార్టీ, అర్బన్ పార్టీ మధ్య జరుగుతున్న పొరపచ్చా లు, ఒంటెద్దు పోకడలపై తీసుకోవాల్సి న చర్యలపై బాబు వీరికి సూచించినట్లు తెలిసింది.
ఇదే సందర్భంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు వంశీ మోహన్ చూసే పార్టీ కార్యక్రమాలను కూడా జిల్లా పార్టీ నేతలు, అర్బన్‌నేతలు పాల్గొని విజయ వంతం చేయాలని ఉమాకు సూచించినట్లు తెలుస్తోంది. అర్బన్ పరంగా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని దీనిపై ఉమా తీసుకునే కార్యక్రమాలు కూడా అర్బన్ నుంచి అంతే సహకారం ఉండాలని, ఇటు అర్బన్, అటు జిల్లా పార్టీకి రెండు కళ్ళు వంటివని ఇందులో ఎవరికి వారు భేషజాలకు పోకుండా ఉభయులు పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం.

No comments:
Post a Comment