ఇది చేతగాని, సిగ్గులేని ప్రభుత్వం. అందుకే రైతాంగ సమస్యలపై స్పందిం చటం లేదని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతాం గ సమస్యలపైనా ఏ మాత్రం ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని, తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదు కోవాలని అసెంబ్లీలో పోరాటం చేసినా రైతు సమస్యలపై నిరవధిక దీక్షలు చేసి నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని చంద్రబాబు గుర్తుచేశారు. రైతుకోసం యాత్ర ముగించుకుని బుధవారం సాయంత్రం 3.15గంటలకు చంద్రబా బు ఎర్రుపాలెం చేరుకున్నారు.
టీడీపీ జిల్లా కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లు సండ్రా వెంకటవీరయ్య, ఊకే అబ్బ య్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటే శ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీ నారాయణ, పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమం తరావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎర్రుపాలెం జడ్పీ టీసీ చావా రామకృష్ణ, టీడీపీ నేతలు తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబా బు ఎర్రుపాలెంలో రైతులను, ప్రజలను ద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో ఆయన యాత్ర నిర్వహించి ప్రసంగించారు.
ఆ తర్వాత మధిర రైతు సదస్సులో పా ల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రైతు లు సంక్రాంతి పండుగను కూడా ఆనం దంగా చేసుకునే పరిస్థితి లేదని ఆవేద న వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి వంటి పంటలకు ఎకరాకు రూ.వేలల్లో పెట్టుబడులు పెడితే కనీసం రూ.10 వేలు కూడా పరిహారం అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమె త్తారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో పోరాడినా, నిరవధిక దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా ప్రభుత్వం ఆమోదించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభు త్వం సరైన వాదనలు విన్పించకపో వటం, పొరుగు రాష్ట్ర్లాలతో రాజీపడ టం వలననే ట్రిబ్యునల్ తీర్పు ఈ విధంగా వచ్చిందని, ఆ తీర్పు పర్య వసారాన్ని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు ఆల్మట్టి, ఆత రువాత బాబ్లీపై కొన సాగించిన పోరు ను సదస్సులో వివరిం చా రు. ప్రతిపక్షంలో ఉ న్నా కృష్ణాజలాల పరి రక్షణ కోసం పోరాటం సాగిస్తామని, రైతులు కూడా కదలిరావాలని సూ చించారు. నదీ జలాల్లో వాటా కో ల్పోతే చివరిభూ ములకు నీరు అం దక, రైతాంగం నష్టపోతుందని చెప్పారు.
వైఎస్ హ యాంలో జలయ జ్ఞంలో జరిగిన అవినీ తిని వివరించి, తద్వారా రైతులకు కలుగుతున్న నష్టాన్ని తెలిపారు. రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ పెంచే విషయంలో ము ఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి చొరవ చూపలే కపోతున్నారని, ఆయన ఎంతకాలం ఆ పదవిలో ఉంటారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న టెలి కాం, కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకో ణాలను ప్రస్తావించా రు. అవినీతి క్యా న్సర్‌లా పెరిగిపోతుం దని, యువత చూస్తూ ఊరుకుంటే సమాజం క్షమి ంచదన్నారు.
పెరిగిన నిత్యావసర ధర లను చెప్పుతూ ఉల్లి, వెల్లుల్లి ధరలను ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉల్లి కిలో రూ.4ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ హ యాంలో రూ.40కు అమ్ముతున్నారని, వెల్లులి అప్పుడు రూ.30 ఉంటే ఇప్పుడు రూ.300 అమ్ముతున్నారని వివరించారు. రైతు సదస్సు అనంతరం చంద్రబాబు బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి హైద్రాబా ద్‌కు తిరిగి వెళ్లారు. టీఆర్ఎస్ నిరసనలు.. లాఠీచార్జి చంద్రబాబు పర్యటనను అడ్డుకుం టామని ముందే ప్రకటించిన టీఆర్ఎస్ పని చేసింది. చంద్రబాబు మధిరకు చేరుకుంటున్న తరుణంలో మూలమ లుపు వద్ద వేచి ఉన్న టీఆర్ఎస్ కార్య కర్తలు గులాబీ కండువాలతో అకస్మా త్తుగా కాన్వాయికి అడ్డంగా దూసుకు వచ్చారు. టీడీపీ కార్యకర్తలు కూడా వారిపై దాడికి ప్రయత్నించారు. ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టీఆ ర్ఎస్ కార్యకర్తలను లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిం చారు. మధిర రైతు సదస్సులో కూడా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు నినా దాలు చేస్తూ నిరసన తెలియచే యబోగా, టీడీపీ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను సభాస్థలి నుంచి వెళ్లగొట్టడంతో సద్దు మణిగింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా మధిర నియోజకవర్గంతో పాటు జిల్లాలో పలు చోట్ల టీఆర్ఎస్ నాయకులను ముందుగానే అదుపు లోకి తీసుకున్నారు.

అల్లుడికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్నంగా ఇచ్చాడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తన అల్లుడికి కట్నం కింద ప్రభుత్వ భూమి అయిన 1.50లక్షల ఎకరాల్లో ఖనిజసంపదను కట్నం కింద ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి బోనకల్ వచ్చిన చంద్రబాబు రోడ్‌షో కార్యక్రమంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 9సంవత్సరాలు పాటు సీఎంగా ఉన్న తనకు ఏ కోరికలు లేవని, మీ హృదయాల్లో చిరస్థాయిగా ఉండేందుకు ఈ పోరాటం చేస్తున్నానని తెలిపారు.
పేదరికం లేని సమాజాన్ని రూపొందించేందుకు కృషి చేస్తారన్నారు. ఢిల్లీలో దీక్ష చేసే అర్హత జగన్‌కు లేదని విమర్శించారు. ఢిల్లీని గజగజలాడించిన ఏకైక ఎన్టీఆర్ అని గుర్తు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తమ ప్రభుత్వ హయాంలో వెలుగెత్తి చాటామని తెలిపారు. సోనియాగాంధీకి డబ్బుపిచ్చి పట్టిందని, ఆ డబ్బుతో ఏంచేస్తుందో అర్థంకావటం లేదన్నారు.
సమాజంలో అన్ని సమస్యలకు కారణం అవినీతినని, ఇది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనని, వారి వద్దనున్న అవినీతి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. యువత అవినీతిపై విజృంభించాలని, నేను ముఖ్యమంత్రి కావటం కంటే రాష్ట్రం బాగుంటమే ముఖ్యమని తెలిపారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాను దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి మీ ఇంటికి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఒక్కసారి ఆలోచించిన తర్వాత నచ్చితే మీరు పదిమందికి చెప్పండి అని, ఆ పది మంది మరో పది మందికి చెప్పేటట్లు చేయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లి గ్రామానికి లిఫ్టు మంజూరు చేస్తా - చంద్రబాబు
మండలంలోని కలకోట, బ్రాహ్మణపల్లి, పెద్దబీరవల్లి,జానకీపురం గ్రామా ల్లో రోడ్‌షో ద్వారా కొద్దిసేపు బుధవారం రాత్రి ప్రజలనుద్ధేశించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. కలకోట గ్రామంలో ఓ పెద్దాయనను చూసి వయస్సు మీదపడినప్పటికీ ఎంతో ఓపికగా చల్లిలో జెండా పట్టుకుని ఎదురుచూస్తున్న ఆయన ఎదో కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు అనటంతో ఒక్కసారిగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు.
మరో మహిళను చూయిస్తూ ఆ ఆడబిడ్డ పాపాను ఎత్తుకుని ఎదురుచూస్తుందని అలాంటి పిల్లలను చదివించే బాధ్యతలను స్వీకరిస్తానని తెలిపారు. తమ పంటలపొలాలకు సాగునీరు కరువైందని, తమ గ్రామానికి లిఫ్టుమంజూరు చేస్తే పంటలకు నీరందుతుందని రైతులు చెప్పగా స్పందించిన చంద్రబాబు తప్పకుండా బ్రాహ్మణపల్లి గ్రామానికి చేస్తానని, ఆ బాధ్యతను తొందర్లోనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

సోనియాగాంధీకి డబ్బు పిచ్చి
యూపీఏ అధినేత్రికి డబ్బుపిచ్చి పట్టిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, మధిర ప్రాంతాల్లో పర్యటించిన చంద్ర బాబు పంట నష్టం జరిగిన రైతులను ఓదార్చారు. అనం తరం మధిరలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడుతూ యూిపీఎ ప్రభుత్వం హయాంలో దేశం అవినీతిమయమైందన్నారు. టెలిఫోన్ కుంభకోణంలో 1.76 లక్షల కోట్ల అవినీతి బయటపడ్డా పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. కార్గిల్ అమరుల కుటుం బాలకు కేటాయించిన భూములను సైతం ఆక్రమించు కునేందుకు కాంగ్రెస్ నాయకులు పూనుకోవడం క్షమించరాని నేరం అన్నారు. పంటలు చేతికొచ్చే స్థితిలో నీటమునిగిన రైతులను ఆదుకోలేని దిక్కుమాలిన స్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరం అన్నారు.
తనతండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ మొత్తంలో దండుకున్న వైఎస్ జగన్ ఆ డబ్బుతో పరిశ్రమలు స్థాపించుకొని రాష్ట్రంలోని ప్రధాన వనరులను దోచుకుంటున్నా డన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై కమిటీ వేసి అడ్డుకట్టవేయకపోతే దేశసంపద అంతా అక్రమార్కుల చేతిలోకి చేరే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులు కృష్ణట్రిబ్యునల్‌తో ఎడారిగా మారే అవకాశం ఉందని, సాగు నీరు, తాగునీరుకు ఇబ్బంది కల్గుతుందని అన్నారు. నిత్యావ సర వస్తువులు ధరలు పెరగడంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యవసా యంపై అవగాహనలేదన్నారు. నాడు బాబ్లిగురించి పోరాడి తే కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారని, కాంగ్రె స్ నాయకుల అసమర్థత వల్లనే కృష్ణా ట్రిబ్యులన్ తీర్పు వచ్చిందని అన్నారు.
ఈ తీర్పు మూలంగా కాంగ్రెస్ నాయ కులను చరిత్ర క్షమించదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతం పోరాటం సాగిస్తానని, చివరి రక్తం బొట్టు ఉన్నతం వరకు రైతుకోసం తపిస్తానన్నారు. పేదరికంలేని సమాజం చూడాలనేది తన తపన అన్ని బాబు అన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంిపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మె ల్యేలు తుమ్మల నాగేశ్వర్‌రావు, సండ్రావెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వర్‌రావు, బాలసాని లక్ష్మినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వర్ రావు, షోడే రామయ్య, కోనేరు నాగేశ్వర్‌రావు స్థానిక ఎంపిపి ఎ. లక్ష్మి, మద్దినేని బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.